Wagon R New Model: భారతదేశంలో Maruti Suzuki సుస్థిర స్థానాన్ని సంపాదించుకుంది. మిడిల్ క్లాస్ పీపుల్స్ కార్ కొనాలని అనుకుంటే ముందుగా ఈ కంపెనీ వైపే చూస్తారు. దశాబ్దాలుగా వాహనదారుల్లో నమ్మకాన్ని పెంపొందించుకున్న ఈ కంపెనీ ఎప్పటికప్పుడు ప్రజలకు అనుగుణంగా వెహికల్స్ను అందుబాటులో ఉంచుతుంది. మారుతి సుజుకి నుంచి దశాబ్దాల కిందట మార్కెట్లోకి వచ్చిన wagon R గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఈ కారు ను ఇప్పటికీ సొంతం చేసుకోవాలని చాలామంది అనుకుంటూ ఉంటారు. ఎప్పటికప్పుడు అప్డేట్ అవుతున్న వ్యాగన్ఆర్ 2026వ సంవత్సరంలో సరికొత్త కారుగా మార్కెట్లోకి రాబోతుంది. ఇప్పటివరకు వచ్చిన కార్లకంటే ఇందులో కొన్ని ప్రత్యేకంగా ఫీచర్స్ ను జోడించారు. అవేంటో ఇప్పుడు చూద్దాం.
తక్కువ ధరలో అనుకూలంగా ఉండే ఫీచర్స్ తో పాటు.. మంచి మైలేజ్ ఇచ్చే కారు ఏదంటే వ్యాగన్ఆర్ గురించి చాలామంది చెబుతారు. అయితే ఈ కారు ఇప్పుడు డిజైన్తో పాటు ఇంజన్ పనితీరులో మెరుగ్గా ఉండే అవకాశం ఉంది. 2026 లో విడుదలైన కొత్త వ్యాగన్ ఆర్ లో టాల్ బాయ్ డిజైన్ ను చేర్చారు. ఇది రిఫ్రిజిరేడ్ ఎక్స్టీరియర్ ను కలిగి ఉంది. ఫ్రంట్ లో ఆధునీకరించబడిన గ్రిల్, అందంగా కనిపించేందుకు హెడ్ లాంప్ లు మార్చారు. అలాగే సూక్ష్మమైన క్రోమ్ యాక్సెంట్ ఆధునికరించబడింది. వీటిని చూస్తే ప్రీమియం కార్ల వలె కనిపిస్తుంది. దీంతో సిటీల్లో ప్రయాణం చేస్తే రిచ్ లుక్ వస్తుంది. అంతేకాకుండా ఇందులో 7 సీట్స్ ను ప్రవేశపెట్టారు. దీంతో ఫ్యామిలీ అంతా కలిసి విహారయాత్రలకు వెళ్లేందుకు ఇది అనుగుణంగా ఉంటుంది. అంతేకాకుండా క్యాబిన్లో విశాలమైన స్పేస్ ఎక్కువగా పెంచడంతో చిన్నపాటి వ్యాన్ లా తలపిస్తుంది. దూర ప్రయాణాలు చేసేటప్పుడు లగేజ్ కి అనుకూలంగా ప్రత్యేకమైన స్థలను అమర్చారు. సీట్లు ఫోల్డ్ చేయగలిగేలా ఉండడంతో మరింత స్పేస్ ఉండే అవకాశం ఉంటుంది.
వ్యాగన్ఆర్ కారు అనగానే మైలేజ్ నెంబర్ వన్ అని అంటూ ఉంటారు. ఈ కొత్త కారులో పెట్రోల్ ఇంజన్ ను గతంలో ఉన్న కారు లాగే ఉంచారు. అయితే ఈ కారులో మాత్రం స్మూత్ డ్రైవ్ అయ్యేలా ఇంజన్ ను అప్డేట్ చేశారు. ఇలా అప్డేట్ చేయడం వల్ల ఇది లీటర్ ఇంధనానికి 37 కిలోమీటర్ల మైలేజ్ ఇస్తుంది. పెట్రోల్ తో పాటు CNG ఆప్షన్, హైబ్రిడ్ ఆప్షన్ కూడా ఉండడంతో బహుళ పవర్ ట్రెయిన్ పొందే అవకాశం ఉంది. ఇందులో ఆధునిక టెక్నాలజీ ఫీచర్లను అమర్చడం వల్ల మరింత సౌకర్యంగా మారింది. టచ్ స్క్రీన్ ఇన్ఫోటైన్మెంట్ సిస్టం స్మార్ట్ఫోన్ కనెక్టివిటీకి ఈజీగా ఉండనుంది. అలాగే ఇందులో యుఎస్బి చార్జింగ్ పాయింట్లు, స్టీరింగ్ మౌంటెడ్ కంట్రోల్స్, ఏసీ వెన్స్ వంటివి సౌకర్యంగా ఉండనున్నాయి. అలాగే ఇందులో అంటూ డ్యూయల్ ఎయిర్ బ్యాగ్స్, EBD తో కూడిన ABS టెక్నాలజీ, రియర్ పార్కింగ్ సెన్సార్స్ వంటివి అత్యంత సేఫ్టీని ఇస్తాయి.