Homeఆంధ్రప్రదేశ్‌Pawan Kalyan: వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ బలంపై పవన్ పంజా!

Pawan Kalyan: వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ బలంపై పవన్ పంజా!

Pawan Kalyan: జనసేన పార్టీ బలోపేతం పై ఫుల్ ఫోకస్ పెట్టింది. అయితే ఈ విషయంలో వ్యూహాత్మకంగా అడుగులు వేస్తోంది. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి బలమైన కంచుకోటలపై దృష్టి పెట్టింది. గత కొంతకాలంగా టిడిపికి చిక్కని నియోజకవర్గాలను తనకు విడిచి పెట్టాలని జనసేన కోరుతోంది. ప్రధానంగా రిజర్వుడు నియోజకవర్గాలపై ఆ పార్టీ ఫోకస్ చేసినట్లు తెలుస్తోంది. అందులో భాగంగా అరకు పార్లమెంట్ స్థానం పరిధిలోని ఏడు అసెంబ్లీ నియోజకవర్గాల్లో వచ్చే ఎన్నికల్లో పోటీ చేయాలని చూస్తోంది జనసేన. ఇటీవల అరకు పార్లమెంట్ నియోజకవర్గ విస్తృత స్థాయి సమావేశంలో ఇదే అంశం చర్చకు వచ్చింది.

* టిడిపికి అవకాశాలు తక్కువ..
సాధారణంగా ఎస్టీ రిజర్వుడు నియోజకవర్గాల్లో తెలుగుదేశం పార్టీ గెలిచిన దాఖలాలు లేవు. కానీ 2024 ఎన్నికల్లో మాత్రం తెలుగుదేశం పార్టీ మెజారిటీ స్థానాల్లో గెలిచింది. అయినా సరే రెండు చోట్ల వైసిపి తన ఆధిపత్యాన్ని కొనసాగించగలిగింది. కూటమి ప్రభంజనంలో సైతం అరకు పార్లమెంటరీ స్థానం వైసీపీ ఖాతాలో పడింది. అందుకే ఈసారి ఎలాగైనా అరకు పార్లమెంట్ స్థానంలో కూటమి అడుగు పెట్టాలని చూస్తోంది. ఆ బాధ్యతను జనసేన తీసుకున్నట్లు తెలుస్తోంది. అరకు పార్లమెంట్ సీటుతో పాటు దాని పరిధిలోని మెజారిటీ అసెంబ్లీ స్థానాలను పొత్తులో భాగంగా జనసేన తీసుకోవాలని చూస్తున్నట్లు సమాచారం.

* ఎంపీ తో పాటు ఎమ్మెల్యే సీట్లపై..
అరకు పార్లమెంటు నియోజకవర్గం పరిధిలో అరకు, పాడేరు, రంపచోడవరం, కురుపాం, సాలూరు, పార్వతీపురం, పాలకొండ నియోజకవర్గాలు ఉన్నాయి. అరకు తో పాటు పాడేరులో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ గెలిచింది. పాలకొండ నుంచి జనసేన విజయం సాధించింది. మిగతా నాలుగు స్థానాల్లో మాత్రం తెలుగుదేశం పార్టీ గెలుపొందింది. అరకు పార్లమెంట్ స్థానం మాత్రం వైసిపి చేజిక్కించుకుంది. అయితే ఇప్పుడు అరకు పార్లమెంట్ సీట్ తో పాటు దాదాపు ఓ నాలుగు నుంచి ఐదు స్థానాలపై జనసేన గురిపెట్టినట్లు సమాచారం.

* పవన్ ప్రత్యేక ఫోకస్..
రిజర్వుడు నియోజకవర్గాలపై జనసేన గురి పెట్టడానికి అనేక రకాల కారణాలు ఉన్నాయి. ముఖ్యంగా కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎం అయ్యారు. గ్రామీణాభివృద్ధి తో పాటు అటవీ, పర్యావరణ శాఖలను సైతం తీసుకున్నారు. గిరిజన ప్రాంతాల్లో అభివృద్ధి పనులపై దృష్టి పెట్టారు. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రధాన ఓటు బ్యాంకుగా గిరిజనులు ఉన్నారు. వారు చాలావరకు జనసేన వైపు టర్న్ అయినట్లు ప్రచారంలో ఉంది. అందుకే ఆ స్థానాలపై జనసేన గురిపెట్టినట్లు తెలుస్తోంది.

Dharma Raj
Dharma Rajhttps://oktelugu.com/
Dharma Raj is a Senior Journalist who has good experience in reporting and had worked with top Media Organizations. He Contributes articles on AP Politics.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES

Most Popular