Pawan Kalyan : ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పై( AP deputy CM Pawan Kalyan) సోషల్ మీడియాలో ఒక విష ప్రచారం నడుస్తోంది. ఆయనపై ముస్లిం వ్యతిరేక ముద్ర వేసే ప్రయత్నం జరుగుతోంది. ఈ క్రమంలో జనసేన ఫ్యాక్ట్ చెక్ పేరిట ఓ వీడియోను సోషల్ మీడియాలో విడుదల చేసింది. ప్రస్తుతం అది ఆలోచింపజేస్తోంది. విపరీతంగా వైరల్ అవుతుంది. పవన్ కళ్యాణ్ పై జరుగుతున్న ప్రచారంలో ఏమాత్రం నిజం లేదని నెటిజెన్లు ఒక నిర్ణయానికి వస్తున్నారు. అదంతా ఉత్త ప్రచారం అని తేల్చేస్తున్నారు.
Also Read : ఆపరేషన్ సిందూర్ బ్రీఫింగ్.. దేశం దృష్టిని ఆకర్షించిన మహిళా ఆధికారులు
* ఉగ్రదాడుల పై స్పందన..
కొద్దిరోజుల కిందట కాశ్మీర్లో పర్యాటకులపై( tourists ) ఉగ్రదాడి జరిగిన సంగతి తెలిసిందే. 27 మంది పర్యటకులు ప్రాణాలు కోల్పోయారు. ఆ సమయంలో మీది ఏ మతం అని అడిగి మరి ఉగ్రవాదులు వారిని హతమార్చారు. భారత ప్రభుత్వం దీనిపై సీరియస్ యాక్షన్కు దిగింది. ఉగ్ర స్థావరాలపై దాడులు చేస్తోంది. పాకిస్తాన్ పౌరులు, అక్కడి సైన్యానికి నష్టం కలుగకుండా ఉగ్రవాద స్థావరాలను మాత్రమే టార్గెట్ చేసుకుంది. ప్రస్తుతం ఆపరేషన్ సింధూర సక్సెస్ అయ్యింది. దీనిపై దేశవ్యాప్తంగా ఆనందం వ్యక్తం అవుతోంది. అదే సమయంలో ఏపీ డిప్యూటీ సీఎం సీరియస్గా స్పందించారు. సోషల్ మీడియాలో అవాకులు చవాకులు పేలవద్దని హెచ్చరికలు జారీచేశారు. ఈ తరుణంలో పవన్ కళ్యాణ్ పై ముస్లిం వ్యతిరేక ముద్ర వేస్తూ సోషల్ మీడియాలో ప్రచారం ప్రారంభించారు.
* ఫ్యాక్ట్ చెక్ లో వాస్తవాలు..
ఫాక్ట్ చెక్ పేరిట జనసేన( janasena ) దీనిపై ఫుల్ క్లారిటీ ఇచ్చింది. ఉగ్రదాడి తరువాత పవన్ కళ్యాణ్ సీరియస్ గా స్పందించారు. పహల్గాం దాడితో సంబంధం ఉన్న ఉగ్రవాదులందరూ ఇస్లాంను అనుసరిస్తున్నారు. వారు సమాజంలో విశ్వాసం పేరుతో అధికారాన్ని దుర్వినియోగం చేస్తున్నారు. కానీ దీనికి విరుద్ధంగా ఇస్లాంను అనుసరించే అనేకమంది కాశ్మీరీ ముస్లింలు.. ఈ ఘటనలో గాయపడిన పర్యాటకులను రక్షించారు అని పవన్ కళ్యాణ్ వ్యాఖ్యానించారు. మొత్తం పేరు అడిగి మరి మారణకాండ సృష్టించడాన్ని తప్పు పట్టారు. ఉగ్రవాదులు ఇస్లాం మతాన్ని అనుసరిస్తున్నారని మాత్రమే పవన్ కళ్యాణ్ అన్నారు. ఉగ్రవాదులంతా ఇస్లాం మతస్తులేనని పవన్ అన్నట్లు సోషల్ మీడియా హ్యాండిల్స్ ద్వారా నకిలీ వార్తలను కొంతమంది సృష్టిస్తున్నారు. ఈ క్రమంలోనే స్పందించింది జనసేన. ఫాక్ట్ చెక్ పేరిట ప్రజల ముందు వాస్తవం ఉంచే ప్రయత్నం చేసింది.
Also Read : యుద్ధ భయంలో పాకిస్తాన్..ఏటీఎంలు ఖాళీ.. స్టాక్ మార్కెట్ పతనం
Exposing Fake Agenda Peddlers pic.twitter.com/7UKXn3jEEI
— JanaSena Shatagni (@JSPShatagniTeam) May 7, 2025