HomeNewsOperation Sindoor : యుద్ధ భయంలో పాకిస్తాన్..ఏటీఎంలు ఖాళీ.. స్టాక్ మార్కెట్ పతనం

Operation Sindoor : యుద్ధ భయంలో పాకిస్తాన్..ఏటీఎంలు ఖాళీ.. స్టాక్ మార్కెట్ పతనం

Operation Sindoor : పహల్గాం ఉగ్రదాడికి ప్రతీకారంగా భారత్ చేపట్టిన ఆపరేషన్ సింధూర్ తర్వాత పాకిస్తాన్ లో యుద్ధవాతావరణం నెలకొంది. సోషల్ మీడియాలో ప్రజలు తమ భయాందోళనలను వ్యక్తం చేస్తున్నారు. ఎప్పుడు ఏం జరుగుతుందో అని బిక్కుబిక్కుమంటూ గడుపుతున్నారు. ఈ నేపథ్యంలో తమ డబ్బుల కోసం ఏటీఎంల ముందు బారులుతీరుతున్నారు. యుద్ధం మొదలైతే ఎన్ని రోజులకు ముగుస్తుదో తెలియకపోవడంతో రెండు నెలల పాటు రేషన్ సిద్ధం చేసుకునే పనిలో ఉన్నారు. అలాగే తమను తాము రక్షించుకునేందుకు సురక్షిత ప్రాంతాలకు వెళ్లడానికి ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ పరిణామాల నేపథ్యంలోనే పాకిస్తాన్ స్టాక్ మార్కెట్ భారీగా పతనమైంది.

Also Read : పహల్గామ్ నుంచి ప్రతీకారం వరకు.. ఆపరేషన్ సింధూర్ కథను ప్రపంచ మీడియా ఎలా చెప్పిందంటే!

సోషల్ మీడియాలో అనేక మంది పాకిస్తాన్ ప్రజలు తమ ఆందోళనలను పోస్ట్ చేస్తున్నారు. యుద్ధం వస్తే పరిస్థితి ఏమవుతుందో అని కొందరు గుండె చేతుల్లో పట్టుకుని భయపడుతుంటే, తమ కుటుంబాలను ఎలా కాపాడుకోవాలో అని మరికొందరు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అలాగే ప్రస్తుతం #PakistanUnderAttack, #OperationSindoor వంటి హ్యాష్‌ట్యాగ్‌లు ట్రెండింగ్‌లో ఉన్నాయి. వీటి ద్వారా ప్రజలు తమ భయాలను, ప్రభుత్వ స్పందనపై అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నారు. చాలా మంది తమ నిత్యావసర వస్తువులను నిల్వ చేసుకోవడానికి ప్రయత్నిస్తున్నట్లు కూడా తెలుస్తోంది.

అంతేకాకుండా, పలు వెబ్‌సైట్లు, న్యూస్ పోర్టల్‌లు పాకిస్తాన్‌లోని ప్రధాన నగరాల్లో ఏటీఎంల వద్ద భారీగా జనం గుమిగూడిన దృశ్యాలను వెలుగులోకి తీసుకొచ్చాయి. తమ డబ్బును విత్‌డ్రా చేసుకోవడానికి ప్రజలు గంటల తరబడి క్యూలో నిలబడుతున్నారు. భవిష్యత్తులో ఆర్థిక సంక్షోభం ఏర్పడవచ్చు అనే భయంతో చాలా మంది తమ డబ్బును బ్యాంకుల్లో ఉంచడానికి వెనుకాడుతున్నారు.

సురక్షిత ప్రాంతాలకు వెళ్లడానికి ప్రయత్నిస్తున్న వారి సంఖ్య కూడా పెరుగుతోంది. ముఖ్యంగా సరిహద్దు ప్రాంతాల నుంచి ప్రజలు పెద్ద సంఖ్యలో ఇతర ప్రాంతాలకు తరలివెళ్తున్నారు. దీంతో రవాణా వ్యవస్థపై తీవ్రమైన ఒత్తిడి నెలకొంది. బస్సులు, రైళ్లలో సీట్లు దొరకడం కష్టంగా మారింది. ఈ పరిస్థితి దేశంలో నెలకొన్న అసాధారణమైన భయానికి నిదర్శనం.

ఆపరేషన్ సింధూర్ ప్రభావం పాకిస్తాన్ స్టాక్ మార్కెట్‌పై తీవ్రంగా పడిపోయింది. ఒక్కసారిగా సూచీలు భారీగా పతనం అయ్యాయి. పెట్టుబడిదారులు తమ పెట్టుబడులను ఉపసంహరించుకుంటున్నారు. ఇది దేశ ఆర్థిక వ్యవస్థకు పెద్ద దెబ్బగా పరిగణిస్తున్నారు. భవిష్యత్తులో ఆర్థిక సంక్షోభం మరింత తీవ్రమయ్యే అవకాశం ఉందని ఆర్థిక నిపుణులు హెచ్చరిస్తున్నారు. మొత్తం మీద, ఆపరేషన్ సింధూర్ పాకిస్తాన్‌లో తీవ్రమైన భయాందోళనలను సృష్టించింది.

Rakesh R
Rakesh Rhttps://oktelugu.com/
Rocky is a Senior Content writer who has very good knowledge on Bussiness News and Telugu politics. He is a senior journalist with good command on writing articles with good narative.
RELATED ARTICLES

Most Popular