Operation Sindhur : బుధవారం తెల్లవారుజామున ఏకకాలంలో పాకిస్థాన్లో ఉన్న 9 ఉగ్రవాద స్థావరాలపై భారత్ క్షణకాలంలో దాడులు చేసింది. ఈ దాడుల్లో దాదాపు 100 మంది దాకా చనిపోయి ఉంటారని నిఘా వర్గాలు అంచనా వేస్తున్నాయి. చనిపోయిన వారు మొత్తం ఉగ్రవాద గ్రూపులలో పనిచేస్తున్న వారిని.. వారంతా కూడా అత్యంత ప్రమాదకరమైన ఉగ్రవాద సంస్థల్లో శిక్షణ పొందుతున్నారని భారత త్రివిధ దళాధిపతులు వెల్లడించారు. అంతేకాదు ఈ దాడులకు ముందు పకడ్బందీ ప్రణాళిక రూపొందించామని.. తాము చేసిన దాడుల వల్ల ఏ ఒక్క పాక్ పౌరుడు చనిపోలేదని పేర్కొన్నారు. తమ దేశ పౌరులు చనిపోయారని పాకిస్థాన్ చెబుతుందని.. ఆ మాటలు మొత్తం పచ్చి బూటకమని భారత దళాలు వెల్లడించాయి.. పకడ్బందీగా ఆపరేషన్ సింధూర్ చేపట్టామని.. ఇందులో పాకిస్తాన్ భూభాగానికి గాని.. పాకిస్తాన్ ప్రజలకు గాని నష్టం వాటిల్లలేదని త్రివిధ దళాధిపతులు వెల్లడించారు.
Also Read : ఆపరేషన్ సిందూర్ తో ప్రపంచానికి భారత్ ఏం చెప్పింది?
ఆరోజు రాత్రి ఏం జరిగింది
ఆపరేషన్ సింధూర్ లో భాగంగా మంగళవారం రాత్రి భారత త్రివిధ దళాలు ఏం చేశాయనే ఉత్కంఠ అందరిలోనూ నెలకొంది. అయితే దీనికి సంబంధించి సోషల్ మీడియాలో రకరకాల వార్తలు తెరపైకి వస్తున్నాయి. ఆదివారం అర్ధరాత్రి 12 గంటలకు పాకిస్థాన్లోని సీయాల్ కోట్ ప్రాంతంలో భారత్ క్షిపణులతో విరుచుకుపడిందని.. భారీగా ఆస్తి నష్టం.. ప్రాణ నష్టం సంభవించిందని సోషల్ మీడియాలో రకరకాల వీడియోలు.. రకరకాల కథనాలు వెలుగులోకి వచ్చాయి. అంతేకాదు భారత్ లోని పంజాబ్ రాష్ట్రంలోని అమృత్ సర్ ప్రాంతంలో పాకిస్తాన్ బాంబులు వేసిందని ప్రచారం జరుగుతున్నది. కానీ ఇవన్నీ నిరాధారమని.. భారత్ మంగళవారం అర్ధరాత్రి ఎటువంటి దాడులకు పాల్పడలేదని.. బుధవారం తెల్లవారుజామున మాత్రమే ఆపరేషన్ సింధూర్ చేపట్టిందని భారత త్రివిధ దళాధిపతులు వెల్లడించారు. సోషల్ మీడియాలో వచ్చే వీడియోలను.. ప్రచారాన్ని ఎట్టి పరిస్థితిలో నమ్మకూడదని సూచిస్తున్నారు. పాకిస్తాన్ సరిహద్దుల్లో మాత్రమే కాల్పులు జరుపుతోంది. ఈ కాల్పుల వల్ల సరిహద్దు గ్రామాల ప్రజలు గాయపడుతున్నారు. భారత ఆర్మీ వెల్లడించిన వివరాల ప్రకారం పాకిస్తాన్ సరిహద్దు గ్రామాల్లో జరిపిన కాల్పుల వల్ల మన దేశానికి చెందిన జమ్ము కాశ్మీర్ పౌరులు కొంతమంది చనిపోయారని భారత ఆర్మీ పేర్కొంది. చాలామంది గాయపడ్డారని.. వారందరికీ సమీపంలో ఉన్న ఆస్పత్రులలో చికిత్స అందిస్తున్నామని భారత ఆర్మీ పేర్కొంది. భారత త్రివిధ దళాలు చేసిన దాడుల నేపథ్యంలో సరిహద్దుల్లో అత్యంత పటిష్టమైన బందోబస్తు ఏర్పాటు చేశామని.. పాకిస్తాన్ నుంచి అక్రమంగా మనదేశంలోకి చొరబాటుదారులు ప్రవేశించకుండా చూస్తున్నామని భారత సైన్యం వివరించింది. ” సరిహద్దుల్లో నిత్యం పహారా కాస్తున్నాం. ఏమాత్రం పాకిస్తాన్ చొరబాటుదారులకు అవకాశం ఇవ్వకుండా పటిష్టమైన బందోబస్తు ఏర్పాటు చేస్తున్నాం. పాకిస్తాన్ కవ్వింపు చర్యలకు పాల్పడే అవకాశం ఉన్న నేపథ్యంలో భారీగా బలగాలను మోహరించామని” భారత ఆర్మీ పేర్కొంది.
Also Read : ఆపరేషన్ సిందూర్.. మసూద్ అజహర్ కుటుంబం హతం..