Three teams : ఇప్పటికే హైదరాబాద్, చెన్నై, రాజస్థాన్ ఎలిమినేట్ అయ్యాయి. దీంతో ప్లే ఆఫ్ లో నాలుగు స్థానాల కోసం మిగతా జట్లు పోటీ పడుతున్నాయి. జాబితాలో గుజరాత్ టైటాన్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, కింగ్స్ ఎలెవన్ పంజాబ్ ప్లే ఆఫ్ వెళ్లడం దాదాపు ఖాయం. ఈ జట్లు ప్లే ఆఫ్ నుంచి నిష్క్రమించాలంటే దాదాపు అద్భుతం జరగాలి. కానీ ఆ అద్భుతం జరిగే అవకాశం ఇప్పుడు లేదు. ఎందుకంటే గుజరాత్, బెంగళూరు, పంజాబ్ జట్లు భీకరమైన ఫామ్ లో ఉన్నాయి. కాబట్టి ఈ జట్లు ప్లే ఆఫ్ వెళ్లకుండా ఉండడం దాదాపు అసాధ్యం. గుజరాత్ జట్టు ఖాతాలో ప్రస్తుతం 16 పాయింట్లు ఉన్నాయి. ఆ జట్టు తదుపరి మూడు మ్యాచ్లు ఆడాలి. ఇందులో ఒకటి గెలిచినా ఆ జట్టు ప్లే ఆఫ్ వెళ్తుంది. సో మొత్తంగా గుజరాత్ జట్టు ప్లే ఆఫ్ వెళ్లిపోవడం దాదాపు ఖాయం. ఇక రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్టు ఖాతాలో 16 పాయింట్లు ఉన్నాయి. ఈ జట్టు మరో మూడు మ్యాచ్లు ఆడాల్సి ఉంది. అందులో ఒకటి గెలిచినా చాలు ప్లే ఆఫ్ వెళ్ళిపోతుంది. ఇక పంజాబ్ జట్టు ఖాతాలో 15 పాయింట్లు ఉన్నాయి. ఈ జట్టు ఇంకా మూడు మ్యాచ్లు ఆడాలి. ఇందులో ఒకటి గెలిచినా చాలు పంజాబ్ ప్లే ఆఫ్ వెళ్లిపోతుంది. మొత్తంగా తొలి మూడు స్థానాలలో గుజరాత్, బెంగళూరు, పంజాబ్ నిలిచే అవకాశాలు ఉన్నాయి. మిగతా ఒక స్థానం కోసం ముంబై, ఢిల్లీ క్యాపిటల్స్ మధ్య పోరు జరిగే అవకాశం ఉంది.. అయితే ఇప్పటికీ కోల్ కతా నైట్ రైడర్స్, లక్నో సూపర్ జెయింట్స్ కు ఆశలు ఉన్నప్పటికీ.. అవి తదుపరి ఆడే మ్యాచ్లలో కచ్చితంగా విజయం సాధించాలి. భారీ వ్యత్యాసంతో గెలుపును సొంతం చేసుకోవాలి. ఇతర జట్ల సమీకరణాలు కూడా కలిసి రావాలి. అప్పుడే ఆ జట్లు ప్లే ఆఫ్ వెళ్లడానికి అవకాశం ఉంటుంది. కానీ లక్నో జట్టు కోరుకున్నట్టుగా.. కోల్ కతా నైట్ రైడర్స్ జట్టు ఆశించినట్టుగా ఫలితాలు రావడం అనేది దాదాపు అసాధ్యంగానే కనిపిస్తోంది.
Also Read: ఢిల్లీ పై బెంగళూరు గెలిచినా.. విరాట్ కోహ్లీని ఓ ఆట ఆడుకుంటున్న నెటిజన్లు.. ఎందుకిలా?
మిగతా జట్ల పరిస్థితి ఎలా ఉందంటే
ముంబై జట్టు చేతుల ప్రస్తుతం 14 పాయింట్లు ఉన్నాయి.. ఈ జట్టు తన తదుపరి రెండు మ్యాచ్ లలో కచ్చితంగా విజయం సాధించాలి. ఢిల్లీ క్యాపిటల్స్ కూడా 13 పాయింట్లు తో కొనసాగుతోంది. ఈ జట్టు తదుపరి మూడు మ్యాచ్లు ఆడాలి. అందులో రెండు మ్యాచ్లలో గెలవాలి. ఒకవేళ మూడు మ్యాచ్లు కనుక గెలిస్తే ముంబై ఇండియన్స్ పక్కకు తప్పుకోవాల్సి వస్తుంది. అప్పుడు ఢిల్లీ జట్టు ప్లే ఆఫ్ వెళ్తుంది. ఒకవేళ ఢిల్లీ, ముంబై చెట్లు తమ తదుపరి మ్యాచ్లు కనుక ఓడిపోతే… అప్పుడు లక్నో, కోల్ కతా కు అవకాశాలు ఉంటాయి. అయితే ఈ రెండు జట్లు కూడా తమ తదుపరి మ్యాచ్లలో గెలవడంతో పాటు.. భారీవ్యత్యాసంతో విజయం సాధించాలి. లక్నోతో పోల్చి చూస్తే ముంబై కాస్త బలంగా కనిపిస్తోంది. అయితే ముంబై జట్టు ఇటీవల గుజరాత్ చేతిలో అనూహ్య స్థితిలో భంగపాటుకు గురైంది. ఒకవేళ తదుపరి మ్యాచ్లలో అదే పరిస్థితి కనుక ఎదురైతే లక్నోకు ఊహించని వరం లభించినట్టే. అయితే లక్నో జట్టు వచ్చిన అవకాశాలను వినియోగించుకోగలుగుతుందా.. ప్లే ఆఫ్ వెళ్లే సామర్థ్యాన్ని నిరూపించుకుంటుందా.. అనేది చూడాల్సి ఉంది. మొత్తంగా ప్రస్తుత ఐపీఎల్ లో నిలకడగా రాణిస్తున్న గుజరాత్, బెంగళూరు, పంజాబ్.. తమ ప్లే ఆఫ్ అవకాశాలను పటిష్టం తీసుకోగా.. మిగతా జట్లు పడుతూ లేస్తూ ప్రయాణం సాగించడంతో.. ప్లే ఆఫ్ వెళ్లే అవకాశాలను సంక్లిష్టం చేసుకున్నాయి.
Also Read: విరాట్ కోహ్లీకి పాక్ క్రికెటర్లు అంటేనే ఇష్టమా..ఒరేయ్ మీకు ఉంటది రా..