Pawan Kalyan: ఏపీ పై బిజెపి ( Bhartiya Janata Party)ఫుల్ ఫోకస్ పెట్టిందా? ఎట్టి పరిస్థితుల్లో రాష్ట్రంలో బలపడాలని భావిస్తోందా? ఇంత మంచి తరుణం మరోసారి రాదని అంచనా వేసిందా? అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది. ఏపీలో కూటమి ప్రభుత్వం నడుస్తోంది. చంద్రబాబు నాయకత్వంలో ఉమ్మడి ప్రభుత్వం ఉంది. అదే సమయంలో కేంద్రంలో టిడిపి కీలక భాగస్వామిగా ఉంది. ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో తెలుగుదేశం పార్టీతో స్నేహం కొనసాగిస్తూనే బలపడాలన్నది బిజెపి ప్లాన్. అలా జరగాలంటే వైసిపిని నిర్వీర్యం చేయాలి. అదే కావాలంటే పవన్ ద్వారానే చేయాలి. పవన్ అయితేనే వైసీపీ నిర్వీర్యం కాగలదు. వైసిపి ప్లేస్ లోకి ఇప్పుడు బిజెపితో పాటు జనసేన చేరాలి. ఓటు బ్యాంక్ పెంచుకోవాలి. ఈ ఆలోచనతో ఉన్న బిజెపి భారీ స్కెచ్ దిశగా ముందుకు సాగుతున్నట్లు సమాచారం. 2029 నాటికి బిజెపితో పాటు జనసేన సైతం బలీయమైన శక్తిగా మారాలన్నదే ప్లాన్. అందులో భాగంగా పవన్ కళ్యాణ్ కు బిజెపి పెద్దలనుంచి పిలుపు వచ్చినట్లు సమాచారం.
* విజయసాయిరెడ్డి ప్లేస్ లో
ఇటీవల వైసిపికి( YSR Congress) విజయసాయిరెడ్డి గుడ్ బై చెప్పిన సంగతి తెలిసిందే. ఆయన తన రాజ్యసభ సభ్యత్వానికి సైతం రాజీనామా ప్రకటించారు. రాజకీయాల నుంచి తప్పుకుంటున్నట్లు చెప్పుకొచ్చారు. అయితే ఇప్పుడు బిజెపి ప్లాన్ మారినట్లు సమాచారం. వీలైనంతమంది వైసిపి కి చెందిన ఎంపీలతో పాటు ఎమ్మెల్సీలను చేర్చుకునేందుకు ప్లాన్ వేసినట్లు తెలుస్తోంది. తద్వారా వైసిపి పూర్తిగా నిర్వీర్యం అవుతుందని.. జగన్ సైతం పూర్తిగా అచేతనం అవుతారని అంచనాకు వచ్చింది. అయితే విజయసాయిరెడ్డి రాజీనామాతో ఖాళీ అయిన స్థానాన్ని పవన్ కళ్యాణ్ తో భర్తీ చేస్తారని తెలుస్తోంది. ఏపీ డిప్యూటీ సీఎం గా పవన్ ఉన్నారు. ఆయనను జాతీయ రాజకీయాల్లోకి తీసుకురావడం ద్వారా ఏపీలో బలపడాలన్నది బిజెపి ప్లాన్.
* పక్కా పొలిటికల్ గేమ్
పక్కా రాజకీయ వ్యూహంతోనే బిజెపితో పాటు చంద్రబాబు ( Chandrababu)అడుగులు వేస్తున్నట్లు తెలుస్తోంది. పవన్ సైతం దీనికి సమ్మతించినట్లు సమాచారం. ప్రస్తుతం డిప్యూటీ సీఎం గా ఉన్న పవన్ జాతీయ రాజకీయాల్లోకి వెళితే కేంద్రమంత్రి అవుతారు. ముందుగా రాజ్యసభకు వెళ్లి ఆయనను క్యాబినెట్లోకి మోడీ తీసుకుంటారు. కీలక మంత్రిత్వ శాఖను అప్పగిస్తారు. ఇక్కడ పవన్ కళ్యాణ్ ఖాళీ చేసిన డిప్యూటీ సీఎం పోస్ట్ బిజెపితో భర్తీ చేస్తారు. అవసరం అయితే లోకేష్ ను డిప్యూటీ సీఎం చేసిన ఆశ్చర్యపోనవసరం లేదు. ఇప్పటికే మెగా బ్రదర్ నాగబాబును మంత్రివర్గంలోకి తీసుకుంటామని చంద్రబాబు ప్రకటించిన సంగతి తెలిసిందే. నాగబాబు రాష్ట్ర క్యాబినెట్ లో ఉంటే.. పవన్ కళ్యాణ్ ని ప్రమోట్ చేసి కేంద్ర మంత్రివర్గంలోకి తీసుకెళ్లాలి అన్నది పక్క ప్రణాళిక. అయితే ఈ ఒప్పందాల వెనుక మూడు పార్టీల ప్రయోజనాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి.
* మూడు పార్టీలకు ప్రయోజనం
ఎట్టి పరిస్థితుల్లో 2029 నాటికి వైసిపి ( YSR Congress )ఈ రాష్ట్రంలో ఉండకూడదు అన్నది బిజెపి ప్రణాళిక. అందుకు ఎంత చేయాలో అంతలా చేస్తోంది భారతీయ జనతా పార్టీ. విజయసాయిరెడ్డి రాజీనామాతో వైసీపీకి మిగిలింది ఏడుగురు రాజ్యసభ సభ్యులు. అందులో మరో నలుగురు సైతం పార్టీకి గుడ్ బై చెప్పడం ఖాయమని తెలుస్తోంది. అలాగే ఎమ్మెల్సీలతో పాటు కీలక నేతలు సైతం పార్టీని వీడేందుకు సిద్ధంగా ఉన్నారు. మొత్తానికైతే వైసీపీ ని సంక్షోభంలో నెట్టి.. మూడు పార్టీలు సమాన ప్రయోజనాలు పొందాలన్నది ప్లాన్ గా తెలుస్తోంది. మరి అది ఎంతవరకు వర్కౌట్ అవుతుందో చూడాలి.