Rana Ayyub
Rana Ayyub: జర్నలిస్ట్.. ఈ పేరుతో నేటితరం జర్నలిస్టులు అరాచకాలు చేస్తున్నారు. జర్నలిస్టు(Journilist) ముసుగులో అక్రమాలకు పాల్పడుతున్నారు. సమాజ నిర్మాణంలో కీలక పాత్ర పోషించాల్సిన జర్నలిస్టులు అక్షరం ముక్క రాకపోయినా.. జర్నలిజం గురించి తెలియకపోయినా.. ఆ పేరుతో పబ్బం గడుపుకుంటున్నారు.
జర్నలిస్టు అనగానే కొందరికి తాము రాసిందే వాస్తవం అన్న భావన ఉంటుంది. లేదా దాని వెనుక వారికిగాని, వారికి కావాల్సిన వారికి గానీ సంబంధించిన ప్రయోజనాలు ఉంటాయి. ఇక కొందరు ఉద్దేశపూర్వకంగా సమాజంలో చిచ్చురేపే వార్తలు రాస్తుంటారు. అయితే తమపై చర్య తీసుకోకుండా జర్నలిజం తమకు రక్షణ కల్పిస్తుందని భావిస్తుంటారు. కానీ చట్టం ముందు అందరూ సమానులే. కానీ, జర్నలిస్టుల విషయంలో పోలీసులు కూడా కాస్త ఆలోచించి. ఆచితూచి వ్యవహరిస్తుంటారు. దీంతో జర్నలిస్టుల ఆగడాలు కూడా పెరుగుతున్నాయి. దీంతో న్యాయస్థానాలు జోక్యం చేసుకోవాల్సి వస్తోంది. తాజాగా జర్నలిస్టు రానా అయూబ్(Rana Ayub)పై కేసు నమోదు చేయాలని ఢిల్లీ హైకోర్టు(Delhi High Court) ఆదేశించింది. 2016017లో ఆమె హిందూ దేవతలను అవమానించడం, భారత వ్యతిరేక భావాలను వ్యాప్తి చేయడం, మతపరమైన సామరస్యాన్ని దెబ్బతీయడం వంటి పోస్టు చేశారని దాఖలైన పిటిషన్‌పై కోర్టు ఈ ఉత్తర్వులు జారీ చేసింది.
ఏం జరిగిందంటే..
2016–17లో హిందూ దేవతలను అవమానించేలా రాణా అయూబ్ పోస్టులు పెట్టారు. భారత వ్యతిరేక భావాలను వ్యాప్తి చేశారు. దేశంలో మతసామరస్యాన్ని దెబ్బతీసేలా వ్యవహరించారు. దీనిపై ఢిల్లీ హైకోర్టులో పిటిషన్ దాఖలైంది. విచారణ జరిపిన న్యాయస్థానం ఎఫ్‌ఐఆర్ నమోదు చేయాలని ఢిల్లీ కోర్టు పోలీసులను ఆదేశించింది. కోర్టు ముందున్న పిటిషన్‌లో గుర్తించదగిన నేరాల కమిషన్‌ను వెల్లడించిందని, ఈ విషయాన్ని ‘న్యాయంగా‘ దర్యాప్తు చేయాలని నగర పోలీసులను ఆదేశించిందని కోర్టు పేర్కొంది. ఎఫ్‌ఐఆర్ నమోదు చేయడానికి కోర్టు ఆదేశాలను కోరుతూ ఒక న్యాయవాది దాఖలు చేసిన దరఖాస్తును చీఫ్ జ్యుడీషియల్ మెజిస్ట్రేట్ హిమాన్షు రామన్ సింగ్ విచారిస్తున్నారు. అయూబ్ ఎక్స్ వేదికగా అవమానకరమైన పోస్టులు చేశారని పిటిషన్‌లో ఆరోపించింది.
ఎవరీ రానా అయూబ్..
రానా అయూబ్‌ది వాషింగ్‌టన్ పోస్ట్‌లో జర్నలిస్టు. భారతీయురాలు. కాలమిస్టు కూడా, ఆమె గుజరాత్ ఫైల్స్, అనాటమీ ఆఫ్ ఎ కవర్ ఆఫ్ అనే పరిశోధనాత్మక గ్రంథం రాశారు. అయూబ్ ముంబైలో జన్మించారు. ఆమె తండ్రి మహ్మద్ అయూబ్ వకీఫ్, ముంబైకి చెందిన బ్లిట్స్ అనే పత్రికలో రచయిత. అభ్యుదయ రచయితల ఉద్యమంలో సభ్యుడు. 1992–93 అల్లర్ల సమయంలో ఈ కుటుంబం డియోనార్క్‌కు మారింది. అక్కడే రానా పెరిగింది.
వివిధ పత్రికల్లో..
ఇక రానా ఢిల్లీకి చెందిన ఇన్వెస్టిటేటివ్ అండ్ పొలిటికల్ మ్యాగజైన్ తెహల్కా కోసం పనిచేశారు. గతంలో బీజేపీని, నరేంద్రమోదీని విమర్శించారు. 2019లో నరేంద్రమోదీకి అత్యంత సన్నిహితుడైన అమిత్‌షాను కొన్ని నెలలు జైలుకు పంపడంలో రానా అయూబ్ నివేదిక కీలకపాత్ర పోషించింది. తెహల్కా ఇన్వెస్టిగేటింగ్ జర్నలిస్ట్‌గా పనిచేశారు. గుజరాత్ ఫైల్స్ అనే పుస్తకం ఆధారంగా స్టింగ్ ఆపరేషన్ నిర్వహించారు. ఆమె సేకరించిన డేటా ఆధారంగానే తెహల్కా పుస్తకం ప్రచురించింది. ఇక 2013లో తెహల్కా ఎడిటర్ ఇన్ చీఫ్, ప్రధాన షేర్ హోల్డర్ తరుణ్‌తేజ్‌పాల్‌పై ఆయన జర్నలిస్టు సబార్టినేట్ ఒకరు లైంగిక ఆరోపణలు చేశారు. దీంతో రానా అయూబ్ రాజీనామా చేశారు. అప్పటి నుంచి స్వతంత్రంగా పనిచేస్తున్నారు. 2019లో వాషింగ్‌టన్ పోస్టులో గ్లోబల్ ఓపీనియన్స్ విభాగానికి సహకార రచయితగా పని చేస్తున్నారు.
Ashish. D is a senior content writer with good Knowledge on Telangana politics. He is having rich experience in journalism writing analytical stories on latest political trends.
Read MoreWeb Title: A delhi court has ordered an fir to be registered against journalist rana ayyub for allegedly insulting hindu deities
Get Latest Telugu News, Andhra Pradesh News , Entertainment News, Election News, Business News, Tech , Career and Religion News only on oktelugu.com