Pawan Kalyan
Pawan Kalyan : ఏపీలో( Andhra Pradesh) రాజకీయాలు ఆసక్తిగా మారుతున్నాయి. కూటమిలో మూడు పార్టీలు ఎవరికి వారుగా బలోపేతం కావాలని భావిస్తున్నారు. ఈ క్రమంలో పార్టీ కార్యక్రమాల్లో నేతల ప్రసంగాలు వివాదాస్పదంగా మారుతున్నాయి. తాజాగా జనసేన ప్లీనరీలో పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలపై టిడిపి శ్రేణులు మండిపడుతున్నాయి. నాలుగు దశాబ్దాల చరిత్ర కలిగిన తెలుగుదేశం పార్టీని నిలబెట్టానని పవన్ వ్యాఖ్యానించిన సంగతి తెలిసిందే. జనసేనతో పాటు టిడిపిని నిలబెట్టగలిగానని పవన్ కామెంట్స్ చేశారు. ఇది తెలుగుదేశం పార్టీ శ్రేణులకు ఇబ్బందికరంగా మారింది. పవన్ కామెంట్స్ ను ఎక్కువమంది టీడీపీ నేతలు తప్పు పడుతున్నారు. తెలుగుదేశం పడి లేచిన కెరటం అని.. ఆ పార్టీకి ఒడిదుడుకులు అన్నవి నిత్య కృత్యమని.. లేచిన ప్రతిసారి నిలబడిన విషయాన్ని ప్రస్తావిస్తున్నారు.
Also Read : పవన్ కళ్యాణ్ నెక్స్ట్ టార్గెట్ అదేనా? నాయకుడొచ్చాడు అంటూ చిరంజీవి చెప్పకనే చెప్పాడా?
* నాగబాబు సైతం
అంతకుముందు జనసేన ఎమ్మెల్సీ నాగబాబు( janasena MLC Nagababu ) చేసిన కామెంట్స్ సైతం అభ్యంతరకరంగా ఉన్నాయి. పిఠాపురంలో పవన్ గెలుపునకు రెండే కారణాలు ఉన్నాయని నాగబాబు చెప్పుకొచ్చారు. ఒకటి పవన్, రెండోది పిఠాపురం ప్రజలు మాత్రమేనని తేల్చి చెప్పారు. పవన్ విజయానికి మరొకరు దోహద పడలేదని కూడా చెప్పుకొచ్చారు. పరోక్షంగా పిఠాపురం మాజీ ఎమ్మెల్యే వర్మపై సెటైర్లు వేశారు నాగబాబు. కనీసం తెలుగుదేశం పార్టీ ప్రస్తావన లేకుండా.. టిడిపిని అవమానించేలా నాగబాబు మాట్లాడారు. దానికి కొనసాగింపుగా పవన్ కళ్యాణ్ సైతం టిడిపిని నిలబెట్టినట్లు చెప్పుకొచ్చారు. దీనిపై ఫైర్ అవుతున్నారు టిడిపి శ్రేణులు. కేవలం కూటమి కట్టింది చంద్రబాబు అని.. కూటమి ప్రతిపాదన చేసింది కూడా ఆయనేనని.. కానీ ఇటువంటి ప్రకటనలు పవన్ కళ్యాణ్ హోదాకు తగినవి కావని ఎక్కువ మంది వ్యాఖ్యానిస్తున్నారు.
* పరోక్ష విమర్శలే తప్ప..
అయితే పవన్ కళ్యాణ్ ( Pawan Kalyan) ఏ సందర్భంలో ఆ వ్యాఖ్యానాలు చేశారు తెలుగుదేశం పార్టీ శ్రేణులకు తెలుసు. అలాగని టిడిపి బహిరంగంగా పవన్ కళ్యాణ్ పై ఎటువంటి వ్యాఖ్యానాలు చేయలేదు. పవన్ కళ్యాణ్ జనసేన ప్లీనరీలో సందర్భోచితంగా మాత్రమే ఆ మాట చెప్పుకొచ్చారని.. ఎన్ని ఒడిదుడుకులు ఎదురైనా జనసేన ను నిలబెట్టానని.. అదే క్రమంలో నాలుగు దశాబ్దాల టిడిపిని సైతం నిలబెట్టగలిగానని మాత్రమే అన్నారని.. అందులో తప్పేముందని మరికొందరు ప్రశ్నిస్తున్నారు. చంద్రబాబు కష్టకాలంలో ఉంటే పవన్ ముందుకు వచ్చి అండగా నిలిచిన విషయాన్ని ప్రస్తావిస్తున్నారు. ఆ ఉద్దేశంతోనే పవన్ మాట్లాడారు తప్ప.. టిడిపిని అగౌరవపరిచే ఉద్దేశం ఆయనకు ఉండదని మరికొందరు అభిప్రాయపడుతున్నారు.
* రెండు పార్టీల మధ్య భిన్న పరిస్థితులు
అయితే క్షేత్రస్థాయిలో ఇప్పటికే భిన్న పరిస్థితులు ఉన్నాయి. తమ వల్లే టీడీపీ కూటమి( TDP Alliance ) అధికారంలోకి వచ్చిందని జనసేన బలంగా నమ్ముతోంది. ఆ పార్టీ శ్రేణులు కూడా ఇదే చెప్పుకుంటున్నాయి. అయితే 40 శాతం ఓటు బ్యాంకు కలిగిన పార్టీ తమదని టిడిపి శ్రేణులు చెబుతున్నాయి. రెండు పార్టీల కలయికతోనే అద్భుత విజయం సొంతమైందని.. రెండు పార్టీలు పరస్పరం గౌరవించుకోవాల్సిన అవసరం ఉందని ఎక్కువ మంది అభిప్రాయపడుతున్నారు. అయితే ఎప్పుడు కుదురుగా మాట్లాడే పవన్ కళ్యాణ్.. జనసేన వల్ల టిడిపి అధికారంలోకి వచ్చిందని అర్థం వచ్చేలా వ్యాఖ్యానించడం మాత్రం తెలుగుదేశం పార్టీలో ఆందోళనకు కారణమవుతోంది. మరి ఏం జరుగుతుందో చూడాలి.
Also Read : మొన్న నాదెండ్ల.. నేడు పవన్.. జనసేన వల్లే టీడీపీకి అధికారమట!*
Dharma Raj is a Senior Journalist who has good experience in reporting and had worked with top Media Organizations. He Contributes articles on AP Politics.
Read MoreWeb Title: Pawan kalyan concerns in tdp ranks over comments
Get Latest Telugu News, Andhra Pradesh News , Entertainment News, Election News, Business News, Tech , Career and Religion News only on oktelugu.com