Pawan Kalyan
Pawan Kalyan : జనసేన( janasena ) ప్లీనరీ వేదికగా పవన్ ప్రసంగం ఇప్పుడు హాట్ టాపిక్ అవుతోంది. రాజకీయ ప్రత్యర్థి వైయస్సార్ కాంగ్రెస్ పార్టీని తూలనాడుతూనే.. తెలుగుదేశం పార్టీకి చురకలు అంటించారు. జనసేన ను నిలబెట్టడమే కాదు.. నాలుగు దశాబ్దాల తెలుగుదేశం పార్టీని కూడా నిలబెట్టినట్లు చెప్పుకొచ్చారు. జనసేన మద్దతు లేనిదే తెలుగుదేశం అధికారంలోకి వచ్చి ఉండేది కాదని సంకేతాలు ఇచ్చేలా మాట్లాడారు. ఒకవైపు కూటమి కొనసాగుతూనే ఉంటుందని చెప్పడం ద్వారా ఐక్యతకు బీజం వేశారు. అదే సమయంలో జాగ్రత్తగా ఉండాలని తెలుగుదేశం పార్టీకి గట్టి సంకేతాలే పంపారు పవన్ కళ్యాణ్. తమ మధ్య గొడవలు సృష్టించేందుకు వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రయత్నిస్తోందని ఇదివరకు చెప్పిన పవన్.. వారి పప్పులు ఉడకవన్నారు. మరి కొద్ది రోజులపాటు తెలుగుదేశం పార్టీతో కొనసాగుతామని తేల్చి చెప్పారు. ఇప్పుడు అదే తెలుగుదేశం జనసేన మద్దతుతో మాత్రమే అధికారంలోకి వచ్చిందని పవన్ చెప్పడం ఇప్పుడు హాట్ టాపిక్ అవుతోంది.
Also Read : నాలుగు దశాబ్దాల చరిత్ర ఉన్న తెలుగుదేశం పార్టీ ని నిలబెట్టింది మనమే – పవన్ కళ్యాణ్.
* క్షేత్రస్థాయిలో ఇదే భావజాలం
వాస్తవానికి జనసేన క్షేత్రస్థాయిలో ఇదే భావజాలంతో ఉంది. తమ మద్దతుతో మాత్రమే టిడిపి( Telugu Desam Party) అధికారంలోకి రాగలిగిందని.. ఆ పార్టీ వైయస్సార్ కాంగ్రెస్ పార్టీని ఒంటరిగా ఢీకొట్టడం అసాధ్యమని ఎక్కువమంది అభిప్రాయపడుతుంటారు. మొన్నటి ఎన్నికల్లో గెలుపులో సింహభాగం పవన్ కళ్యాణ్ కు ఇస్తుంటారు. అదే సమయంలో క్షేత్రస్థాయిలో తెలుగుదేశం పార్టీతో జనసేన విభేదించడానికి ఇదే ప్రధాన కారణం. తమరెక్కల కష్టంతో అధికారంలోకి వచ్చినట్లు జనసేన భావిస్తోంది. అయితే క్షేత్రస్థాయిలో తమకు ఉన్న బలమైన సైన్యంతోనే అధికారంలోకి రాగలిగామని టిడిపి భావిస్తోంది. దీంతో రెండు పార్టీల శ్రేణుల మధ్య ఒక రకమైన విభిన్న వాతావరణం ఉంది. ఇటువంటి తరుణంలోనే పవన్ కళ్యాణ్ ఈ కీలక వ్యాఖ్యలు చేయడం మాత్రం సంచలనం గా మారింది.
* శ్రేణుల్లో జోష్ నింపేందుకే..
అయితే సుదీర్ఘ నిరీక్షణ తర్వాత జనసేనకు( janasena ) శత శాతం విజయం దక్కింది. జనసేన విజయం సాధించిన తర్వాత తొలిసారి ఆవిర్భావ సభ జరిగింది. పార్టీ శ్రేణుల్లో ఒక రకమైన ధైర్యం నింపేందుకు.. వారిలో జోష్ నెలకునెందుకు పవన్ ఈ వ్యాఖ్యలు చేసి ఉంటారని తెలుస్తోంది. అయితే పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలతో తెలుగుదేశం పార్టీలో ఒక రకమైన అనుమానం ప్రారంభం అయ్యింది. అయితే అధినేతల ఇద్దరి మధ్య సహృద్భావ వాతావరణం ఉంది. గౌరవం ఇచ్చిపుచ్చుకుంటున్నారు. ఇటువంటి పరిస్థితుల్లో పవన్ కేవలం తన పార్టీ శ్రేణుల్లో జోష్ నింపేందుకే ఆ తరహా వ్యాఖ్యలు చేసి ఉంటారన్న కామెంట్స్ కూడా వినిపిస్తున్నాయి.
* ఆ ఘటన మరువకముందే..
అయితే మొన్నటికి మొన్న జనసేన కీలక నేత, మంత్రి నాదెండ్ల మనోహర్( Minister nadendla Manohar ) కూడా ఇటువంటి వ్యాఖ్యలే చేశారు. జనసేన మద్దతు లేనిదే ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా కారని సంచలన వ్యాఖ్యలు చేశారు. కేవలం పవన్ కళ్యాణ్ మద్దతు ఇవ్వడం వల్లే తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రాగలిగిందని తేల్చి చెప్పారు. పార్టీ శ్రేణుల అంతర్గత సమావేశంలో నాదెండ్ల మనోహర్ చేసిన వ్యాఖ్యలు దుమారానికి కారణమయ్యాయి. అయితే అవి మరువకముందే ఇప్పుడు డిప్యూటీ సీఎం పవన్ నేరుగా వ్యాఖ్యానాలు చేయడం విశేషం. గతంలో పవన్ ఈ తరహా వ్యాఖ్యలు ఎప్పుడూ చేయలేదు. ఇప్పుడు చేయడం మాత్రం ఓకింత ఆశ్చర్యానికి గురిచేస్తోంది. దీని వెనుక కారణం ఏమై ఉంటుందన్న ప్రశ్న ఉత్పన్నమవుతోంది.
Also Read : నా 2వ కొడుకుని పైకి ఎత్తుకోలేకపోతున్నాను..అంత బలహీనుడిని అయ్యాను అంటూ పవన్ కళ్యాణ్ ఎమోషనల్ కామెంట్స్!
Dharma Raj is a Senior Journalist who has good experience in reporting and had worked with top Media Organizations. He Contributes articles on AP Politics.
Read MoreWeb Title: Pawan kalyan janasena plenary speech hot topic
Get Latest Telugu News, Andhra Pradesh News , Entertainment News, Election News, Business News, Tech , Career and Religion News only on oktelugu.com