Pawan Kalyan: పిఠాపురంలో స్థలాలు కొన్న పవన్ కళ్యాణ్.. ఎన్ని ఎకరాలు.. ధర ఎంతంటే?

పవన్ పిఠాపురం నుంచి పోటీ చేస్తానని ప్రకటించినప్పుడు నాన్ లోకల్ గా ముద్ర వేసేందుకు ప్రయత్నించిన సంగతి తెలిసిందే. అప్పట్లో వైసీపీ నేతలు పవన్ పై తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు.

Written By: Dharma, Updated On : July 4, 2024 12:06 pm

Pawan Kalyan

Follow us on

Pawan Kalyan: ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కీలక నిర్ణయం తీసుకున్నారు. తాను ప్రాతినిధ్యం వహిస్తున్న పిఠాపురంలో సొంతంగా ఇల్లు కట్టేందుకు సన్నాహాలు ప్రారంభించారు. స్థానికంగా స్థలం కూడా కొనుగోలు చేశారు. బుధవారం రిజిస్ట్రేషన్ ప్రక్రియ కూడా పూర్తయింది.పిఠాపురం మండలంలోని భోగాపురం, ఇల్లింద్రాడ రెవిన్యూ పరిధిలో 1.44 ఎకరాలు, మరో బిట్ లో 2.08 ఎకరాలు తీసుకున్నారు. ఆ భూమికి సంబంధించి రిజిస్ట్రేషన్ పూర్తయింది. పవన్ పేరిట కొనుగోలు చేశారు.

పవన్ పిఠాపురం నుంచి పోటీ చేస్తానని ప్రకటించినప్పుడు నాన్ లోకల్ గా ముద్ర వేసేందుకు ప్రయత్నించిన సంగతి తెలిసిందే. అప్పట్లో వైసీపీ నేతలు పవన్ పై తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు. ఎక్కడో సినిమాలు చేసుకునే పవన్ ను గెలిపిస్తారా? స్థానికంగా ఉండే వంగా గీతను గెలిపిస్తారా? అంటూ పెద్ద ఎత్తున ప్రచారం చేశారు. కానీ పిఠాపురం నియోజకవర్గ ప్రజలు మాత్రం ఆ ప్రచారాన్ని నమ్మలేదు. పవన్ ను తమ మనిషిగా భావించి ఆదరించారు. ఎన్నికల్లో ఓటు వేశారు. 70 వేల ఓట్ల మెజారిటీతో గెలిపించారు. పవన్ సైతం కూటమి ప్రభుత్వంలో డిప్యూటీ సీఎం తో పాటు నాలుగు కీలక మంత్రిత్వ శాఖలను సొంతం చేసుకున్నారు. పదవి బాధ్యతలు చేపట్టిన తొలిసారి పిఠాపురం నియోజకవర్గంలో అడుగుపెట్టిన పవన్ మూడు రోజులపాటు క్షణం తీరిక లేకుండా గడిపారు.అందులో భాగంగానేఇంటి స్థలాన్ని కొనుగోలు చేసి.. నిర్మాణ పనులు ప్రారంభించేందుకు సన్నాహాలు చేస్తుండడం విశేషం.

పవన్ కొనుగోలు చేసిన ప్రాంతంలో ఎకరం స్థలం మార్కెట్ విలువ 15 లక్షల నుంచి 16 లక్షలు ఉంటుందని చర్చ జరుగుతోంది. అయితే దీనితోపాటు జనసేన నేతలు మరో 10 ఎకరాల తోటలు కొనేందుకు సిద్ధపడుతున్నట్లు తెలుస్తోంది. రెండు ఎకరాల స్థలంలో క్యాంప్ ఆఫీస్, మిగిలిన స్థలంలో ఇల్లు కట్టుకోవాలని పవన్ భావిస్తున్నట్లు సమాచారం. మరోవైపు పిఠాపురంలో పర్యటిస్తున్న పవన్ తన ఇంటి నిర్మాణం పై కీలక వ్యాఖ్యలు చేశారు. తాను పిఠాపురంలో ఉండనని.. హైదరాబాదులో ఉంటానని వైసీపీ నేతలు విమర్శించారని.. కానీ పిఠాపురంలో మూడున్నర ఎకరాలు కొని ఈరోజే రిజిస్ట్రేషన్ చేయించినట్లు పవన్ ప్రకటించడం విశేషం. నియోజకవర్గ ప్రజలు పిఠాపురం ఎమ్మెల్యే తాలుకానేనని.. కానీ తనకు చెడ్డ పేరు తీసుకురావద్దని కోరారు పవన్ కళ్యాణ్. నియోజకవర్గ ప్రజలకు ఇచ్చిన ప్రతి హామీని నిలబెట్టుకుంటానని పవన్ ప్రమాణం చేయడం విశేషం.