T20 World Cup Champions: దాదాపు 17 సంవత్సరాల తర్వాత టి20 వరల్డ్ కప్ ను టీమిండియా గెలుచుకుంది.. శనివారం జరిగిన ఫైనల్ మ్యాచ్లో దక్షిణాఫ్రికాపై 7 పరుగుల తేడాతో విజయం సాధించింది. విజయం అనంతరం ఆదివారం తెల్లవారుజామున టీమిండియా స్వదేశానికి తిరిగి రావాల్సి ఉండేది. విపరీతమైన వర్షాలు కురవడంతో బుధవారం తెల్లవారుజామున దాకా టీమిండియా ఆటగాళ్లు వెస్టిండీస్ లోని బార్బడోస్ లోనే ఉండిపోవాల్సి వచ్చింది. వాతావరణం అనుకూలించిన తర్వాత నిన్న తెల్లవారుజామున ప్రత్యేక విమానంలో టీమిండియా ఆటగాళ్లు స్వదేశానికి బయలుదేరారు. గురువారం తెల్లవారు జామున 6 గంటలకు టీమిండియా ఆటగాళ్లు ఢిల్లీ చేరుకున్నారు. ఢిల్లీ చేరుకున్న టీమిండియా ఆటగాళ్లకు బీసీసీఐ అధికారులు ఘన స్వాగతం పలికారు. అనంతరం రోహిత్ శర్మ, రోజర్ బిన్నీ, జై షా కేక్ కట్ చేశారు. ఈ సందర్భంగా టి20 వరల్డ్ కప్ ట్రోఫీని శర్మ సగర్వంగా ప్రదర్శించాడు.
అభిమానుల కేరింతలతో ఢిల్లీ విమానాశ్రయం దద్దరిల్లిపోయింది. రోహిత్ విమానాశ్రయంలోకి ప్రవేశించగానే ఒక్కసారిగా వాతావరణం మారిపోయింది. అభిమానుల కేరింతలతో ఆ ప్రాంతం మొత్తం సందడిగా మారింది. అభిమానుల ఉత్సాహాన్ని మరింత పెంచేలా రోహిత్ వరల్డ్ కప్ ట్రోఫీని పైకెత్తి చూపుతూ అభివాదం చేశాడు అనంతరం భారత క్రికెటర్లు ప్రత్యేక బస్సులు ఐటీసీ మౌర్య హోటల్ వెళ్లారు. అక్కడ కూడా భారత క్రికెటర్లకు ఘన స్వాగతం లభించింది. హోటల్ మౌర్య లోకి ప్రవేశించే మార్గంలో కళాకారుడు సాంప్రదాయ నృత్యాలు చేస్తూ టీమిండియా ఆటగాళ్లకు ఘన స్వాగతం పలికారు. డోలు చప్పులకు రోహిత్ శర్మ, సూర్య కుమార్ యాదవ్, రిషబ్ పంత్ ఊర మాస్ డాన్స్ చేశారు. రోహిత్ వేసిన స్టెప్పులు సోషల్ మీడియాను ఒక ఊపు ఊపుతున్నాయి.
ఇక భారత క్రికెటర్లు ఐటిసి మౌర్య హోటల్లో కొద్దిసేపు విశ్రాంతి తీసుకున్నారు. ఆ తర్వాత భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీని కలిసేందుకు ఆయన అధికారిక నివాసానికి బయలుదేరి వెళ్లారు. అక్కడ ప్రధానమంత్రిని కలిశారు. ఈ సందర్భంగా క్రికెటర్లను ప్రధానమంత్రి వ్యక్తిగతంగా అభినందించారు. ప్రతి ఒక్కరితో కరచాలనం చేసి, భుజం తట్టి శభాష్ అంటూ శుభాకాంక్షలు తెలిపారు. ప్రధానితో భేటీ తర్వాత టీమిండియా ఆటగాళ్లు ఓపెన్ టాప్ బస్సులో ర్యాలీగా వెళ్తారు.. అనంతరం సాయంత్రం ముంబైలోని వాంఖడె మైదానం చేరుకున్నారు. అక్కడ క్రికెటర్లను బీసీసీఐ ఘనంగా సన్మానిస్తుంది.125 కోట్ల చెక్కును అందజేస్తుంది.
Jubilation in the air
The #T20WorldCup Champions have arrived in New Delhi!
Presenting raw emotions of Captain @ImRo45 -led #TeamIndia‘s arrival filled with celebrations pic.twitter.com/EYrpJehjzj
— BCCI (@BCCI) July 4, 2024