Pawan Kalyan: ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కు( deputy CM Pawan Kalyan) విపరీతమైన పుస్తకాల పిచ్చి. ఖాళీగా ఉన్న సమయంలో ఆయన పుస్తక పఠనం చేస్తుంటారు. పైగా చేతిలో ఎప్పుడూ ఏదో ఒక పుస్తకం కనిపిస్తూనే ఉంటుంది. పుస్తకం విలువ తెలుసునని.. తన దగ్గర ఉన్న పుస్తకాలు ఎవరికీ ఇవ్వనని.. అవసరమైతే కొనిస్తానని మొన్న ఒక సందర్భంలో చెప్పుకొచ్చారు పవన్. అయితే ఈరోజు ఆయన ఏకంగా 10 లక్షల రూపాయల( 10 lakh rupees) విలువ చేసే పుస్తకాలను కొనుగోలు చేశారు. విజయవాడలో జరుగుతున్న బుక్ ఫెస్టివల్ ను ఇవాళ మరోసారి ఆయన సందర్శించారు. ఒక్కసారిగా అంత మొత్తంలో పుస్తకాలు కొనుగోలు చేసేసరికి అక్కడ ఉన్న వారంతా ఆశ్చర్యపోయారు. ఒక బుక్ ఫెస్టివల్ లో ఒకేసారి ఇంత మొత్తంలో పుస్తకాలు కొన్న రికార్డ్ పవన్ కళ్యాణ్ సొంతమయ్యింది. ఇప్పుడు ఇదే హాట్ టాపిక్ అవుతోంది. పవన్ పుస్తక పఠనం విషయంలో వైసిపి ఎన్నో రకాల విమర్శలు చేసింది. కానీ పవన్ ఎన్నడు దానిని పట్టించుకోలేదు. ఇప్పుడు ఏకంగా 10 లక్షల రూపాయల విలువచేసే పుస్తకాలు కొనుగోలు చేయడం మాత్రం నిజంగా సాహసమే.
* పవన్ కోసం ప్రత్యేకంగా
మొన్న ఆ మధ్యన విజయవాడలో బుక్ ఫెస్టివల్ ను( book festival) ప్రారంభించారు పవన్ కళ్యాణ్. ఈరోజు మరోసారి స్టాల్స్ ను సందర్శించారు. తన కోసం ప్రత్యేకంగా ఉదయం పూట రెండు గంటలపాటు స్టాల్స్ ఓపెన్ చేయాలని పవన్ విజ్ఞప్తి చేశారు. దీంతో పవన్ కోసం రెండు గంటలపాటు ప్రత్యేకంగా స్టాల్స్ ను తెరిచారు నిర్వాహకులు. దీంతో పవన్ మీడియా కంట పడకుండా, ఎలాంటి హడావిడి లేకుండా వ్యక్తిగతంగా వెళ్లి.
.. పుస్తకాలను పరిశీలించారు. సుమారు పది లక్షల రూపాయల విలువ చేసే పుస్తకాలను ఆర్డర్ చేశారు. పిఠాపురంలో నిరుద్యోగ యువత కోసం భారీ లైబ్రరీ ఏర్పాటు చేయాలని పవన్ భావిస్తున్నారు. అందుకోసమే పది లక్షల రూపాయల సొంత డబ్బులు వెచ్చించి భారీగా పుస్తకాలు కొనుగోలు చేసినట్లు తెలుస్తోంది. అయితే ఈ పుస్తకాలన్నింటినీ పవన్ కళ్యాణ్ తన కారులోనే తీసుకెళ్లినట్లు సమాచారం.
* ఫోటోలు విడుదల
మరోవైపు పవన్ బుక్ ఫెస్టివల్ సందర్శనను జనసేన( janasena ) గోప్యంగా ఉంచింది. అయితే ఆ పార్టీ తరఫున ఫోటోలు మాత్రం విడుదల చేశారు. సహజంగానే పవన్ పుస్తక పఠనాన్ని ఎంతో ఇష్టపడతారు. ఇప్పటికే పవన్ కళ్యాణ్ రెండు లక్షల పుస్తకాలు చదివినట్లు పలుమార్లు చెప్తుంటారు. బుక్ ఫెస్టివల్స్ కు వెళ్లడం ఆయనకు అలవాటు. ఖాళీ సమయాల్లో ఎక్కువగా పుస్తకాలతోనే గడుపుతుంటారు. అలాగే తన ప్రసంగాల్లో సైతం తాను చదివిన పుస్తకాల్లో కోడ్స్ ఎక్కువగా వాడుతుంటారు. అయితే పవన్ కళ్యాణ్ బుక్ ఫెస్టివల్ సందర్శనకు సంబంధించి ఫోటోలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
* సంక్రాంతి సంబరాల్లో పాల్గొన్న పవన్
నిన్ననే పిఠాపురంలో జరిగిన సంక్రాంతి సంబరాల్లో పవన్ పాల్గొన్నారు. తిరుపతి ఘటన నేపథ్యంలో ఈ ఏడాది సంక్రాంతి సంబరాలు ఘనంగా జరుపుకోలేకపోతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. పిఠాపురంలో మినీ గోకులాలను ప్రారంభించారు. రైతులకు ఆవులు కూడా పంపిణీ చేశారు. ఇప్పుడు యువత కోసం ఏకంగా లైబ్రరీ ఏర్పాటుకు సన్నాహాలు చేస్తుండడం విశేషం. అందుకోసమే పవన్ భారీగా పుస్తకాలు కొనుగోలు చేసినట్లు తెలుస్తోంది. ఇంకోవైపు రాష్ట్రవ్యాప్తంగా గ్రంథాలయాల ఏర్పాటుకు సంబంధించి కూడా ప్రభుత్వపరంగా నిర్ణయం తీసుకునే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.