HomeNewsPawan Kalyan: అన్నా లెజినోవా తో విడాకుల తర్వాత పవన్ కళ్యాణ్ సంచలన ట్వీట్.. కన్నీళ్లు...

Pawan Kalyan: అన్నా లెజినోవా తో విడాకుల తర్వాత పవన్ కళ్యాణ్ సంచలన ట్వీట్.. కన్నీళ్లు పెట్టుకున్న ఫ్యాన్స్!

Pawan Kalyan: పవన్ కళ్యాణ్ , అన్నా లెజినోవా విడాకులు తీసుకున్న ఘటన ఇప్పుడు సోషల్ మీడియా లో సంచలనం గా మారింది. తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా, నేషనల్ లెవెల్ లో కూడా ఈ అంశం పై ఇప్పుడు చర్చలు నడుస్తున్నాయి. అభిమానులు కొంతమంది ఏమి చెప్పుకోలేని పరిస్థితి లో ఉంటే , పవన్ కళ్యాణ్ ప్రత్యర్థులు మాత్రం తీవ్ర స్థాయిలో విమర్శిస్తున్నారు. ఒకసారి చేస్తే తప్పు అనుకోవచ్చు, రిపీట్ గా అదే జరుగుతుంది కాబట్టి పవన్ […]

Pawan Kalyan: పవన్ కళ్యాణ్ , అన్నా లెజినోవా విడాకులు తీసుకున్న ఘటన ఇప్పుడు సోషల్ మీడియా లో సంచలనం గా మారింది. తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా, నేషనల్ లెవెల్ లో కూడా ఈ అంశం పై ఇప్పుడు చర్చలు నడుస్తున్నాయి. అభిమానులు కొంతమంది ఏమి చెప్పుకోలేని పరిస్థితి లో ఉంటే , పవన్ కళ్యాణ్ ప్రత్యర్థులు మాత్రం తీవ్ర స్థాయిలో విమర్శిస్తున్నారు. ఒకసారి చేస్తే తప్పు అనుకోవచ్చు, రిపీట్ గా అదే జరుగుతుంది కాబట్టి పవన్ కళ్యాణ్ వైపు నుండే తప్పు ఉందంటున్నారు. కానీ గత కొన్ని నెలలుగా పవన్ కళ్యాణ్ రాజకీయ కార్యక్రమాల్లో దూరంగా ఉండడం వంటివి గమనిస్తే , ఆయన ఈ అంశం పై పడుతున్న మనోవేదన ఎలాంటిదో అర్థం అవుతోంది. విడాకులు ఎవ్వరూ సరదాకి తీసుకోరు, బలమైన కారణాలు, ఇక జీవితాంతం కలిసి నడవలేము అనే ఫీలింగ్ వచ్చినప్పుడే విడాకులు తీసుకుంటారు.

బహుశా పవన్ కళ్యాణ్ ఫీలింగ్ కూడా అదే అయ్యుండొచ్చు. అయితే ఈ అంశం నుండి ఆయన బయటకు వచ్చేసినట్టు తెలుస్తోంది. ఎందుకంటే కాసేపటి క్రితమే ఆయన డిప్యూటీ సీఎం ట్విట్టర్ హ్యాండిల్ నుండి ‘హ్యాపీ ఫారెస్ట్ డే’ అంటూ ఒక ట్వీట్ పడింది. ఆడవాయులను రక్షించుకోవడం మన బాధ్యత అని , అది తరతరాలను కాపాడుతుందని ఆయన ఈ సందర్భంగా చెప్పుకొచ్చాడు. అంతే కాకుండా ee సందర్భంగా అడవులను రక్షించేందుకు తమ ప్రయత్నం చేస్తున్న ఫారెస్ట్ ఆఫీసర్స్ కి సెల్యూట్ చేసాడు. సోషల్ మీడియా లో ఇంత రచ్చ జరుగుతున్న సమయం లో పవన్ కళ్యాణ్ హ్యాండిల్ నుండి ఇలాంటి ట్వీట్ రావడం అందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తోంది. అభిమానులు సైతం కొంతమంది విమర్శలు చేస్తుంటే , మరికొంతమంది మాత్రం జాలి చూపిస్తున్నారు. ఈ ఘటన నుండి పవన్ కళ్యాణ్ రాజకీయంగా తేరుకోవడం చాలా కష్టమే.

అభిమానులను ఆయన రాబోయే రోజుల్లో ఎలా ఎదురుకుంటాడో చూడాలి. మొదటి రెండు సార్లు విడాకులు జరిగినప్పుడు అభిమానులు క్షమించారు, ఆ నెగటివిటీ నుండి పవన్ కళ్యాణ్ పూర్తిగా కోలుకోవడానికి చాలా సమయమే పట్టింది. ఇప్పుడు ఈ నెగటివిటీ నుండి ఆయన కోలుకోవడానికి ఇంకెంత సమయం పడుతుందో చూడాలి. అభిమానులతో ముఖా ముఖి జరిగినప్పుడు ఆయన ఇచ్చే రియాక్షన్స్ ని బట్టే ఉంటుంది. అయితే పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ మాత్రం ప్రత్యర్థుల విమర్శలకు దీటుగానే సమాదానాలు చెప్తున్నారు. తమిళనాడు ముఖ్యమంత్రి విజయ్ పెళ్లి అయ్యినప్పటికీ కూడా భార్య పిల్లల్ని వదిలేసి త్రిష తో ఉంటున్నాడు , అప్పుడు ఎవ్వరూ ప్రశ్నించలేదు , పైగా సీఎం అయ్యాక త్రిష కి శుభాకాంక్షలు తెలిపారు, అలాంటి వాళ్లకు పవన్ కళ్యాణ్ ని విమర్శించే హక్కు లేదంటూ సోషల్ మీడియా లో పవన్ ఫ్యాన్స్ అంటున్నారు. మరి ఈ అంశం పై మీ అభిప్రాయం ఏంటో కామెంట్ చేయండి , మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్ స్క్రైబ్ చేసుకోండి.

Vishnu Teja
Vishnu Teja
Vishnuteja is a Writer Contributes Movie News. He has rich experience in picking up the latest trends in movie category and has good analytical power in explaining the topics on latest issues. He also write articles on Movie news.

Related News

Most Popular

Oktelugu Epaper