Paripoornananda Swamy: బాలకృష్ణ పై రగిలిపోతున్న పరిపూర్ణానంద స్వామి

వాస్తవానికి తెలంగాణ ఎన్నికలకు ముందు బిజెపిలో చేరారు స్వామి పరిపూర్ణానంద.ఆ ఎన్నికల్లో తెలంగాణ వ్యాప్తంగా పర్యటించారు.బిజెపికి మద్దతుగా ప్రచారం చేశారు.రాష్ట్రంలో బిజెపి అధికారంలోకి రాబోతుందని ప్రకటించారు.

Written By: Dharma, Updated On : April 24, 2024 9:52 am

Paripoornananda Swamy

Follow us on

Paripoornananda Swamy: హిందూపురం నుంచి పోటీ చేయడానికి స్వామి పరిపూర్ణానంద డిసైడ్ అయ్యారు. నామినేషన్ కూడా దాఖలు చేశారు. అయితే ఆయన తీసుకున్న నిర్ణయంపై సర్వత్ర చర్చ నడుస్తోంది. హిందూపురం పార్లమెంట్ స్థానం నుంచి బిజెపి అభ్యర్థిగా పోటీ చేస్తాననుకున్న స్వామీజీకి.. బాలకృష్ణ అడ్డు తగిలినట్లు తెలుస్తోంది. హిందూపురంలో ఉన్న మైనారిటీ ఓటు బ్యాంకుకు గండి పడకుండా బాలకృష్ణ జాగ్రత్తలు తీసుకున్నారని.. అందుకే స్వామి పరిపూర్ణానంద కు బిజెపి టిక్కెట్ ఇవ్వలేదని ప్రచారం జరుగుతుంది. అందుకే బాలకృష్ణ పై రివెంజ్ తీర్చుకోవాలని పరిపూర్ణానంద స్వామి హిందూపురం నుంచి పోటీ చేస్తున్నట్లు సమాచారం.హిందూ మత బోధనలతో తెలుగు రాష్ట్రాల్లో స్వామి పరిపూర్ణానంద మంచి గుర్తింపు సాధించారు.ఆ గుర్తింపుతోనే ప్రజాప్రతినిధి కావాలని భావించారు.

వాస్తవానికి తెలంగాణ ఎన్నికలకు ముందు బిజెపిలో చేరారు స్వామి పరిపూర్ణానంద.ఆ ఎన్నికల్లో తెలంగాణ వ్యాప్తంగా పర్యటించారు.బిజెపికి మద్దతుగా ప్రచారం చేశారు.రాష్ట్రంలో బిజెపి అధికారంలోకి రాబోతుందని ప్రకటించారు.అంతటితో ఆగకుండా ఓ సన్యాసి తెలంగాణకు సీఎం కాలేడా? అంటూ సరికొత్త వ్యాఖ్యలు చేశారు. యూపీలో యోగి, తెలంగాణలో పరిపూర్ణ అంటూ తనకు తాను ప్రచారం చేసుకున్నారు. కానీ తెలంగాణలో బిజెపి అధికారంలోకి రాలేదు. అప్పటినుంచి రాజకీయాల వైపు ఆసక్తి తగ్గించారు. పెద్దగా కనిపించలేదు కూడా.

అయితే తాజాగా ఏపీలో ఎన్నికలు జరుగుతుండడంతో మళ్ళీ యాక్టివ్ అయ్యారు.హిందూపురం లోక్సభ స్థానంపై దృష్టి పెట్టారు.పెనుగొండను స్థావరంగా చేసుకుని రాజకీయాలు చేయడం ప్రారంభించారు.ఆర్ఎస్ఎస్ మద్దతు పుష్కలంగా ఉండడంతో ఇక తనకు తిరుగులేదని భావించారు. కానీ హిందూపురం పార్లమెంట్ స్థానం పరిధిలో ముస్లిం ఓటు బ్యాంకు అధికం. ఆ సీటు బిజెపికి ఇస్తే అసెంబ్లీ స్థానాల పరిధిలో ఎఫెక్ట్ ఉంటుందని.. అది మొదటికే మోసం వస్తుందని తెలుగుదేశం పార్టీ ఆ స్థానాన్ని తీసుకుంది. బీసీ నేత పార్థసారధిని అభ్యర్థిగా ప్రకటించింది.అప్పటినుంచి కోపంతో ఉన్న స్వామి పరిపూర్ణానంద చివరి వరకు ప్రయత్నాలు చేశారు.నేరుగా టిడిపి అధినేత చంద్రబాబును కలిశారు.అయినా వర్కౌట్ కాకపోవడంతో ఇండిపెండెంట్ గా బరిలో దిగారు.

అయితే ఆయన హిందూపురం ఎంపీ సీటును ఆశిస్తే.. అది దక్కకపోయేసరికి అసెంబ్లీ స్థానం నుంచి పోటీ చేయడం గమనార్హం. కేవలం బాలకృష్ణపై కోపంతోనే ఇండిపెండెంట్ గా పోటీ చేస్తున్నారని.. తనకు టికెట్ రాకుండా అడ్డుకోవడంలో బాలకృష్ణ మొదటి వ్యక్తి అని భావించి ఈ నిర్ణయానికి వచ్చినట్లు సమాచారం. అయితే ఈ నియోజకవర్గంలో ఇప్పటి వరకు టిడిపికి ఓటమి లేదు. పైగా ఇక్కడ ముస్లిం ఓటు బ్యాంకు అధికం. అటు పరిపూర్ణానంద స్వామి హిందూ భావజాలంతో ముందుకెళ్తుంటారు. ఈ క్రమంలో ఆయన టిడిపి ఓట్లు చీల్చుతారా? లేకుంటే వైసీపీ ఓట్లకు గండి కొడతారా? అన్నది చూడాలి.