Nominated posts : మూడో విడత నామినేటెడ్ పదవుల ప్రకటనకు సీఎం చంద్రబాబు( CM Chandrababu ) సిద్ధపడుతున్నారు. దీంతో ఆశావహుల్లో ఒక రకమైన ఆశలు ప్రారంభం అయ్యాయి. ఇప్పటికే రెండు విడతల్లో నామినేటెడ్ పదవులను ప్రకటించారు. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న 47 మార్కెట్ కమిటీలకు పాలకవర్గాలను నియమించారు. అయితే మూడో విడత జాబితా పై చాలామంది నేతలు ఆశలు పెట్టుకున్నారు. అయితే ఈసారి పార్టీ కోసం పని చేసిన నేతలకు మాత్రమే అవకాశం ఇవ్వాలని చంద్రబాబు భావిస్తున్నారు. తద్వారా వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నుంచి టిడిపిలో చేరిన వారికి ఇప్పుడే ఛాన్స్ లేదని తేల్చేశారు. ముందుగా పార్టీలోకి వచ్చినవారు పని చేయాలని.. తమ పనితీరు మెరుగు పరుచుకున్న తర్వాత వారికి అవకాశం ఇస్తామని చంద్రబాబు తేల్చి చెబుతున్నట్లు సమాచారం.
Also Read : టిడిపిలో ఆ ముగ్గురు నేతల ఫుల్ సైలెన్స్!
* అర్బన్ డెవలప్మెంట్ అథారిటీలకు చైర్మన్లుగా..
అయితే ఈసారి ప్రధానంగా అర్బన్ డెవలప్మెంట్ అథారిటీలకు( Urban Development authorities) చైర్మన్ లను ప్రకటిస్తారని తెలుస్తోంది. రాష్ట్రవ్యాప్తంగా చాలా అర్బన్ డెవలప్మెంట్ అథారిటీలకు ఇంతవరకు నియామకాలు పూర్తి చేయలేదు. అటువంటి వాటికి మూడో జాబితాలో అవకాశం ఇస్తారని తెలుస్తోంది. నగరాల అభివృద్ధిలో అర్బన్ డెవలప్మెంట్ అథారిటీల పాత్ర చాలా కీలకం. అందుకే వాటిపై కీలక నేతలు ఆశలు పెట్టుకున్నారు. ముఖ్యంగా కొందరు మాజీలకు ఛాన్స్ ఇస్తారని తెలుస్తోంది. అటువంటి వారి పేర్లు ప్రముఖంగా వినిపిస్తున్నాయి.
* ఎన్నికలకు ముందు వారు జంప్..
2024 సాధారణ ఎన్నికలకు ముందు చాలామంది నేతలు వైయస్సార్ కాంగ్రెస్( YSR Congress ) పార్టీ నుంచి టిడిపిలో చేరారు. అటువంటివారు తమకు నామినేటెడ్ పదవులు ఇస్తారని ఆశించారు. టిడిపిలోకి రావడం వల్లే పార్టీ అభ్యర్థుల విజయానికి దోహదపడ్డామని వారు భావిస్తున్నారు. కానీ క్షేత్రస్థాయిలో పరిస్థితి అలా లేదు. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నుంచి చేరిన వారికి నామినేటెడ్ పదవులు ఇస్తే తప్పుడు సంకేతాలు వెళ్తాయని చంద్రబాబు భావిస్తున్నారు. అందుకే నామినేటెడ్ పదవులు ఎంపిక విషయంలో ఒకటికి రెండుసార్లు ఆలోచన చేస్తున్నారు.
* వేలకొలది పదవులు భర్తీ
రాష్ట్రవ్యాప్తంగా మార్కెట్ కమిటీలకు( market committees ) పాలకవర్గాలను నియమించాల్సి ఉంది. ముందుగా ఓ 47 మార్కెట్ కమిటీలకు పాలకవర్గాలను నియమించారు. అయితే రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు వందల కొలిది మార్కెట్ కమిటీలు ఉన్నాయి. ఇంకోవైపు ప్రాథమిక వ్యవసాయ పరపతి సంఘాలు కూడా ఉన్నాయి. ఇప్పటికే స్థానిక సంస్థల్లో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ హవా నడుస్తోంది. అందుకే పిఎసిఎస్ లకు పాలకవర్గాలను నియమించి కూటమిని మరింత యాక్టివ్ చేయాలని ప్రభుత్వం భావిస్తోంది. రాష్ట్రవ్యాప్తంగా వేల కొలదిగా ఉన్న పిఎసిఎస్ లతో పాటు మార్కెట్ కమిటీలకు కొత్త పాలకవర్గాలు వస్తాయని తెలుస్తోంది. మరి ఏం జరుగుతుందో చూడాలి.
Also Read : నందమూరి హీరో పార్టీ జెండా.. అభిమానుల్లో పూనకాలు!