https://oktelugu.com/

Pawan Kalyan: అల్లు అర్జున్ కు నో అపాయింట్మెంట్.. పవన్ ఆగ్రహం దేనికి?

మెగా కాంపౌండ్ వాల్ నుంచి వచ్చారు అల్లు అర్జున్. కానీ తనకంటూ ఒక సెపరేట్ ఇమేజ్ క్రియేట్ చేసుకుంటూ ముందుకు సాగుతున్నారు. మెగా అభిమానులతో సంబంధం లేదంటూ వ్యాఖ్యానించారు. అయితే అదే మెగా కుటుంబం ఇప్పుడు అల్లు అర్జున్ అరెస్ట్ అయ్యేసరికి అండగా నిలబడింది. కానీ పవన్ స్పందన మాత్రం ఇంతవరకు తెలియదు.

Written By:
  • Dharma
  • , Updated On : December 18, 2024 / 03:48 PM IST

    Pawan Kalyan(2)

    Follow us on

    Pawan Kalyan: మెగా ఫ్యామిలీ వర్సెస్ అల్లుఅర్జున్ వివాదానికి ఎండ్ కార్డు పడిందని అంతా భావించారు. పుష్ప 2 చిత్ర ప్రదర్శనకు సంబంధించి.. అల్లు అర్జున్ సంధ్య థియేటర్ వద్దకు వచ్చిన సంగతి తెలిసిందే. ఆ సమయంలో జరిగిన తొక్కిసలాటలో రేవతి అనే మహిళ మృతి చెందింది. దీనికి అల్లు అర్జున్ ను బాధ్యులు చేస్తూ తెలంగాణ పోలీసులు కేసు నమోదు చేశారు. అల్లు అర్జున్ ను అరెస్టు చేశారు. అయితే అప్పటివరకు పెద్దగా అల్లు అర్జున్ ను పట్టించుకోని మెగా కుటుంబం ఆయనను పరామర్శించింది. మెగాస్టార్ చిరంజీవితో పాటు నాగబాబు అల్లు అర్జున్ ఇంటికి వెళ్లి పరామర్శించారు. అయితే అల్లు అర్జున్ అరెస్ట్ సమయంలో పవన్ ఒక ట్వీట్ చేశారు. అయితే అది అల్లు అర్జున్ ను ఉద్దేశించి కాకపోయినా.. అప్పటివరకు రెండు కుటుంబాల మధ్య జరిగిన పరిణామాలతో.. అది అల్లు అర్జున్ కోసం చేసిన ట్వీట్ అని అంతా భావించారు. అదే రోజు పవన్ ప్రత్యేక విమానంలో హైదరాబాద్ వచ్చారు. అప్పటికే చిరంజీవితో పాటు నాగబాబు అల్లు అర్జున్ ను పరామర్శించిన నేపథ్యంలో.. పవన్ కూడా అదే పని మీద వస్తున్నారని అంతా భావించారు. కానీ అటువంటిదేమీ లేకుండా పోయింది.

    * ఇంతవరకు రాని అనుమతి
    అయితే పవన్ ఇంకా అల్లు అర్జున్ విషయంలో వేరే ఆలోచనకు రాలేదని ఈ పరిణామాల ద్వారా తెలియ వచ్చింది. అల్లు అర్జున్ నేరుగా అమరావతికి వెళ్లి పవన్ ను కలుస్తారని కూడా ప్రచారం జరిగింది. ఈ విషయంలో దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ ద్వారా అల్లు అర్జున్ ప్రయత్నించారన్నది ఒక వార్త. కానీ పవన్ కళ్యాణ్ నుంచి ఎటువంటి సంకేతం రాకపోవడంతో.. అల్లు అర్జున్ వెయిట్ చేస్తున్నట్లు సమాచారం. అయితే డిప్యూటీ సీఎం కావడంతో పవన్ కళ్యాణ్ తన అధికారిక కార్యక్రమాల్లో బిజీగా ఉన్నారా? లేకుంటే ఇతర కారణాలేమైనా ఉన్నాయా? అన్నది తెలియాల్సి ఉంది.

    * అంతా సానుకూలం
    వాస్తవానికి పుష్ప 2 చిత్ర ప్రదర్శనకు సంబంధించి ప్రత్యేక అనుమతులు, ఆపై టిక్కెట్ల ధర పెంపునకు పర్మిషన్ వంటి విషయాల్లో కూటమి ప్రభుత్వం ఎటువంటి వివక్ష లేకుండా వ్యవహరించింది. దీంతో చిత్ర యూనిట్ తో పాటు అల్లు అర్జున్ ఏపీ సీఎం చంద్రబాబు తో పాటు పవన్ కళ్యాణ్ కు కృతజ్ఞతలు తెలిపారు. అక్కడి నుంచి సానుకూల పరిణామాలు చోటు చేసుకున్నాయి. అయితే పుష్ప 2 చిత్రం విజయవంతమైన నేపథ్యంలో మెగా కుటుంబం నుంచి ఒక్క హీరో కూడా స్పందించలేదు. కనీసం ఒక ట్వీట్ కూడా చేయలేదు. కానీ అల్లు అర్జున్ అరెస్టు అయ్యేసరికి మెగా కుటుంబమంతా శరవేగంగా స్పందించింది. కానీ పవన్ మాత్రం ఇప్పటికీ అదే దూరాన్ని పాటిస్తున్నారు. అల్లు అర్జున్ చేసిన పనికి పవన్ కోపంగా ఉన్నారా? మరి ఏ ఇతర కారణాలు ఉన్నాయా? అన్నది తెలియాల్సి ఉంది.