Chiranjeevi : మన తెలుగు సినిమా ఇండస్ట్రీ కి మెగాస్టార్ చిరంజీవి ఎలా అయితే నెంబర్ హీరో గా ఉండేవాడో, తమిళ సినిమా ఇండస్ట్రీ కి సూపర్ స్టార్ రజినీకాంత్ కూడా అలా ఉండేవాడు. కాకపోతే రజినీకాంత్ కి పాన్ ఇండియా లెవెల్ లో మార్కెట్ ఉంటే, చిరంజీవి మాత్రం కేవలం టాలీవుడ్ కి మాత్రమే పరిమితం అయ్యాడు. ఇద్దరి కెరీర్స్ ఒకేసారి మొదలయ్యాయి. రజినీకాంత్ మాత్రం చిరంజీవి కంటే ముందే స్టార్ అయిపోయాడు. అయితే వీళ్లిద్దరి కాంబినేషన్ లో అప్పట్లో ‘కాళీ’, ‘బందిపోటు సింహం’ వంటి చిత్రాలు వచ్చాయి. వీటిలో కాళీ చిత్రం సమయంలో రజినీకాంత్, చిరంజీవి మధ్య జరిగిన కొన్ని సంఘటనలను మెగా బ్రదర్ నాగబాబు తన యూట్యూబ్ ఛానెల్లో ఒకసారి చెప్పుకొచ్చాడు. రజినీకాంత్ కి అప్పట్లో చాలా కోపం ఉండేదట. సెట్స్ లో అందరిపై అరుస్తూ ఉండేవారట. ఒకసారి మీడియా రిపోర్టర్ ని ఆయన కొట్టిన సందర్భాలు కూడా ఉన్నాయట.
మీడియా రిపోర్టర్ చెయ్యి చేసుకోవడంతో రజినీకాంత్ కి పిచ్చి ఉందని మీడియా మొత్తం దండోరా వేసి ప్రచారం చేసిందట. దీంతో అప్పట్లో నిజంగానే చాలా మంది అభిమానులు రజినీకాంత్ కి మెంటల్ ఉందని అనుకున్నారట. ఇవన్నీ అప్పట్లో హాట్ టాపిక్ గా మారిన అంశాలు. అయితే అప్పట్లో రజినీకాంత్, చిరంజీవి కాంబినేషన్ లో ‘కాళీ’ అనే చిత్రం వచ్చిందని. తమిళం లో అన్నయ్య చిరంజీవి గారి క్యారక్టర్ ని విజయ్ కుమార్ చేసాడని, తెలుగు లో అన్నయ్య చేసాడని నాగబాబు చెప్పుకొచ్చాడు. ఇంకా ఆయన మాట్లాడుతూ రజినీకాంత్ గారికి కోపం చాలా ఎక్కువ అని, యాటిట్యూడ్ కూడా మామూలుగా చూపించడని అందరూ అంటూ ఉండేవారు, కాళీ సినిమా షూటింగ్ సమయంలో కూడా అన్నయ్య కి, రజినీకాంత్ కి మధ్య ఒక విషయం లో విబేధాలు వచ్చాయని, ఇద్దరు పెద్దగా అరుచుకున్నారని నాగబాబు చెప్పుకొచ్చాడు. ఆ తర్వాత డైరెక్టర్ జోక్యం తో ఇద్దరు మళ్ళీ సర్దుకొని సినిమాని పూర్తి చేసారని చెప్పుకొచ్చాడు నాగబాబు.
అలా అప్పట్లో అంత కోపం గా ఉండే రజినీకాంత్, ఎప్పుడైతే మహావతార్ బాబా కి భక్తుడిగా మారాడో అప్పటి నుండి పూర్తిగా మారిపోయాడని,శాంత మూర్తి అయ్యాడని చెప్పుకొచ్చాడు నాగబాబు. ఆయనతో కలిసి నేను జైలర్ చిత్రం లో నటించానని, షూటింగ్ ముగిసిన తర్వాత ఆయన తో కలిసి ఒక ఫోటో దిగాలని అనిపించిందని, రజినీకాంత్ గారి PA కి ఈ విషయం చెప్పానని, ఈ విషయం తెలుసుకున్న రజినీకాంత్ స్వయంగా నాగబాబు వద్దకు వచ్చి సెల్ఫీ తీసుకున్నాడని, ఆ మధురమైన జ్ఞాపకాన్ని నేను ఎప్పటికీ మర్చిపోలేను అంటూ నాగబాబు మాట్లాడిన ఈ వీడియో సోషల్ మీడియా లో బాగా వైరల్ అయ్యింది. ఇదంతా పక్కన పెడితే ప్రస్తుతం రజినీకాంత్ లోకేష్ కనకరాజ్ దర్శకత్వంలో ‘కూలీ’ అనే చిత్రంలో నటిస్తున్నాడు. సరివేగంగా షూటింగ్ ని జరుపుకుంటున్న ఈ చిత్రం వచ్చే ఏడాది ప్రేక్షకుల ముందుకు రానుంది.