Oscar Awards 2025: ఆస్కార్.. సినిమారంగానికి ఇచ్చే అత్యున్నత పురస్కారం. 2024లో తెలుగు సినిమా ఆర్‌ఆర్‌ఆర్‌కు ఆస్కార్ దక్కింది. 2025 ఆస్కార్ కోసం ఇండియా నుంచి లాపతా లేడీస్ సినిమాను ఎంపిక చేశారు. ఉత్తమ ఫీచర్ సినిమా కేటగిరీలో ఈసారి కూడా ఆస్కార్ ఇండియాకు తెస్తుందని భావించారు. కానీ తాజాగా ది అకాడమీ ఆఫ్ మోషన్ పిక్చర్ ఆర్ట్స్ అండ్ సైన్సెస్ చేసిన ఫార్ట్ లిస్టులో లాపతా లేడీస్‌కు చోటు దక్కలేదు. దీని స్థానంలో మరో హిందీ సినిమా సంతోష్ ఈ కేటరిగీలో ఎంపికైంది.
సంచలన విజయం..
లాపతా లేడీస్ మూవీ ఈ ఏడాది విడుదలైంది. బాలీవుడ్ హీరో అమీర్‌ఖాన్ దీనిని నిర్మించారు. అతని మాజీ భార్య కిరణ్‌రావు డైరెక్టు చేశారు. ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర సక్సెస్ కావడంతోపాటు నెట్‌ఫ్లిక్స్‌లోనూ దుమ్మ రేపింది. దీంతో ఈ సినిమాను 2025 ఆస్కార్ నామినేషన్‌కు ఎంట్రీగా పంపించారు. వివిధ దేశౠల నుంచి మొత్తం 85 ఎంట్రీలు వాచ్చాయి. షార్ట్ లిస్ట్‌లో 15 సినిమాలకు మాత్రమే చోటు దక్కింది. ఇందులో లాపతా లేడీస్ లేకపోవడం భారత సినీ ప్రియులను నిరాశపర్చింది.
రేసులో సంతోష్..
ఇక తాజా షార్ట్ లిస్ట్‌లో మరో హిందీ సినిమా సంతోష్ నిలిచింది. యూకే నుంచి అధికారిక ఎంట్రీగా వచ్చింది. దీనిని యూకేవాసులు నిర్మించారు. భారతీయ వాస్తవ అంశం ఆధారంగా దీనిని తెరకెక్కించారు. ఈ ఏడాది మేలో జరిగిన కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్‌లోనూ సంతోష్‌ను ప్రదర్శించారు. నార్త్ ఇండియా గ్రామీణ ప్రాంతానికి చెందిన కథ ఇది. సంధ్య సూరి ఈ సినిమాకు కథ అందించి దర్శకత్వం వహించారు. మూవీలో నటించిన షహానా గోస్వామి స్పందిస్తూ.. షార్ట్ లిస్ట్‌లో సంతోష్‌కు చోటు దక్కడంపై సంతోషం వ్యక్తం చేశారు.
సంతోష్ మూవీ స్టోరీ?
సంధ్య సూరి డైరెక్ట్ చేసిన సంతోష్ సినిమాలో హహానా నటించింది. భర్తను కోల్పోయిన ఆమె ఓ ప్రభుత్వ పథకంలో పోలీస్ కానిస్టేబుల్ ఉద్యోగం సంపాదిస్తుంది. అందులో చేరిన తర్వాత ఆమెకు అసలు సవాళ్లు ఎదురవుతాయి. అక్కడి అవినీతితోపాటు సీనయర్ ఇన్‌స్పెక్టర్ శర్మతో పనిచేయడం ఆమెకు సవాల్‌గా మారుతుంది. ఈ క్రమంలో ఓదళిత టీ నేజర్ హత్య కేసు విచారణకు వస్తుంది ఆ తర్వాత ఏం జరిగింది అనేది ఈ స్టోరీ.
హిందీ సినిమా అయినా..
సంతోష్ హిందీ సినిమా. కానీ, ఈ సినిమా యూకే నుంచి ఆస్కార్‌కు నామినేట్ అయింది. ఈ సారి ఆస్కార్ బరిలో ఇండియా నుంచి ఒక్క సినిమా కూడా లేదు నార్వే, సెనెగల్, ఫ్రాన్స్, లాత్వియా, పాలస్తీనా, డెన్మార్క్, థాయ్‌లాండ్, బ్రెజిల్, ఐర్లాండ్, యూకే, జర్మనీ, ఐస్‌లాండ్, కెనడా, చెక్ రిపబ్లిక్, ఇటలీ దేశాల నుంచి సినిమాలు రేసులో ఉన్నాయి. షార్ట్ లిస్ట్ నుంచి ఫైనల్ లిస్టు ఎంపిక చేస్తారు. జనవరి 8 నుంచి 12 వరకు ఈ ప్రక్రియ జరుగుతుంది. జనవరి 17న నామినేషన్లు అనౌన్స్ చేస్తారు.