CMs Comments : సగటు వేతన జీవికి బడ్జెట్ ఉంటుంది. నెల జీతం రాగానే సరుకులు, అద్దె, బిల్లులు, ఫీజులు, ఆస్పత్రుల ఖర్చులు.. రవాణా చార్జీలు, పొదుపు.. ఇలా లెక్కల పద్దు ఉంటుంది. కానీ ఏడాదికాలంగా దేశంలో కొత్తగా బాధ్యతలు చేపడుతున్న సీఎంలు కీలక వ్యాఖ్యలు చేస్తున్నారు.
‘ధనిక రాష్ట్రం తెలంగాణ(Telangana) అనుకున్న.. ఖజానాలో బాగా డబ్బులు ఉన్నయని అనుకున్నం. లంకె బిందెలు ఉన్నయనుకుంటే.. ఇక్కడ ఏమీ లేవు’ ఇవీ 2023 డిసెంబర్‌లో బాధ్యతలు చేపట్టిన తెలంగాణ సీఎం చేసిన వ్యాఖ్యలు.
రాష్ట్రాన్ని ధ్వంసం చేశారు. అప్పుల కుప్పగా మార్చారు. ఖజానాలో డబ్బులేమీ లేవు. అప్పులు మాత్రమే మిగిలాయి.. ఇవీ జూన్‌లో బాధ్యతలు చేపట్టిన ఆంధ్రప్రదేశ్ సీఎం చంబ్రాబునాయుడు(Chandrababu naidu) చేసిన వ్యాఖ్యలు.
తాజాగా ఢిల్లీ సీఎం సురేఖ(Surekha) కూడా ఇలాగే మాట్లాడారు. ఢిల్లీ ఖజానా మొత్తం ఖాళీ చేశారు. ప్రభుత్వం వద్ద పైసలు లేవు అని పేర్కొన్నారు. వీరు చేసిన వ్యాఖ్యలన్నీ అంతకు ముందు ఉన్న పాలకుల గురించే. డబ్బులు లేవని కొత్తగా అప్పులు చేస్తున్నారు. అంటే వీరి పదవీకాలం ముగిసే నాటికి ఇదే పరిస్థితి ఉంటుంది. ఖజానా ఖాళీ అని చెబుతున్నవారు కూడా దానిని నింపే పని చేయడం లేదు. ఇందుకు ప్రధాన కారణం ఉచితాలే. అధికారంలోకి రావడానికి ఇష్టానుసారంగా ఉచిత హామీలు ఇస్తున్నారు. అధికారంలోకి వచ్చాక వాటిని అమలుచేస్తున్నారు. దీంతో ఖజానా ఖాళీ చేస్తున్నారు.
ఉచితాలు అనుచితమని తెలిసినా..
ఉచిత పథకాలు(Free Scheams) అనుచితమని అన్ని పార్టీల నాయకులకు తెలుసు. కానీ, అధికారం అంతకన్నా ముఖ్యం. రాష్ట్రం దివాళా తీసినా మాకేం సంబంధం అన్నట్లుగా అన్ని పార్టీలు వ్యవహరిస్తున్నాయి. అధికారం కోసం అలవికాని హామంఈలు ఇస్తున్నాయి. ఏ పార్టీ కూడా ఉచితాలు సరికాదని చెప్పడం లేదు. మొన్నటి వరకు ఉచిత హామీలకు దూరంగా ఉన్న బీజేపీ(BJP) కూడా ఇటీవల ఢిల్లీ ఎన్నికల సమయంలో ఉచిత హామీలు ఇచ్చింది. ఎందుకంటే.. దేశమంతా ఎన్నికల్లో గెలుస్తున్నా.. ఢిల్లీ(Delhi)లో పట్టు చిక్కడం లేదు. దీంతో గెలవడానికి ఉచిత హామీలు ఒక్కటే మార్గమని భావించింది. దీంతో ఇబ్బడి ముబ్బడిగా ఉచిత హామీలు ఇచ్చేసింది. ఇక కాంగ్రెస్ పార్టీ అయితే.. గ్యారంటీల పేరుతో ఉచిత హామీల వర్షం కురిపిస్తోంది. ప్రాంతీయ పార్టీలు అదే బాటలో పయనిస్తున్నాయి. గెలిచాక కొన్ని అమలు చేస్తున్నాయి. మిగతా వాటికి డబ్బులు లేవని చేతులెత్తేస్తున్నాయి.
సుప్రీం కోర్టు కీలక వ్యాఖ్యలు..
దేశంలో రాజకీయ పార్టీలు ఉచిత పథకాలు అమలు చేయడంపై దేశ సర్వోన్నత న్యాయస్థానం(Supream Court)కూడా కీలక వ్యాఖ్యలు చేసింది. ఎన్నికల సమయంలో రాజకీయ పార్టీలు ప్రకటించే ఉచిత పథకాలు ప్రజలను సోమరిపోతులుగా మారుస్తున్నాయని పేర్కొంది. ఈ పథకాల కారణంగా ప్రజలు స్వయంగా సంపాదించే ఆసక్తి కోల్పోతున్నారని తెలిపింది. పరాన్న జీవులుగా మారుతున్నారని పేర్కొంది. సంపద సృష్టిలో ప్రజలను బాగస్వాములను చేయడం మానేసి ఇంటివ్దద కూర్చోబెట్టి ప్రభుత్వమే పోషించడంతో వ్యవస్థపై ప్రభావం పడుతుందని ఆందోళన వ్యక్తం చేసింది.
ఆవిరవుతున్న సంపద..
కూర్చొని తింటే కొండలైనా కరుగుతాయంటారు పెద్దలు. అంటే ఎన్ని కోట్ల ఆస్తి ఉన్నా.. ఏ పనీ చేయకుంటా తింటూ ఉంటే కొంతకాలానికి కరిగిపోతుంది. ఇప్పుడు ప్రభుతావలు ఇవే చేస్తున్నాయి. ప్రజల నుంచి వసేలు చేస్తున్న పన్నులను, ఇతర డబ్బులను వారికే పంచుతున్నామన్న పేరుతో కూర్చోబెట్టి తినిపిస్తున్నాయి. దీంతో ప్రజలు కూడా పని చేయడం మానేస్తున్నారు. ఉచిత డబ్బులు, పింఛన్లు, ఉచితంగా ఇచ్చే ఇతర సదుపాయాలతో కాలం వెల్లదీస్తున్నారు.