Jagan: ఏపీ అసెంబ్లీ సమావేశాల్లో( AP assembly sessions ) ఆసక్తికర పరిణామాలు చోటుచేసుకున్నాయి. ఈరోజు అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం అయ్యాయి. రెండు వారాలు పాటు కొనసాగనున్నాయి. ఉభయ సభలను ఉద్దేశించి గవర్నర్ ప్రసంగించారు. అయితే తమకు ప్రతిపక్ష హోదా ఇవ్వకపోవడాన్ని తప్పు పట్టింది వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ. గవర్నర్ ప్రసంగిస్తున్న సమయంలోనే నిరసన తెలిపింది. సభలో ఉండకుండానే బాయ్ కట్ చేసి బయటకు వెళ్ళిపోయింది. దీంతో జగన్ వ్యూహం అర్థం అయింది. ప్రభుత్వాన్ని నిలదీయడం కంటే ప్రతిపక్ష హోదా కోసమే ఆయన ఎక్కువగా పరితపిస్తున్నారు అని తెలుస్తోంది. ప్రతిపక్ష హోదా ఇస్తే కానీ తాము సభకు హాజరు కామని స్పష్టత ఇచ్చారు జగన్మోహన్ రెడ్డి. దీంతో కూటమి ప్రభుత్వ నిర్ణయాన్ని బట్టి జగన్మోహన్ రెడ్డి శాసనసభ సమావేశాలకు హాజరయ్యే ఛాన్స్ కనిపిస్తోంది. అయితే ఎట్టి పరిస్థితుల్లో జగన్మోహన్ రెడ్డికి ప్రతిపక్ష నేత హోదా ఇవ్వమని ప్రభుత్వం తేల్చి చెబుతోంది.
* వైయస్సార్ కాంగ్రెస్ తీరు సరికాదు
మరోవైపు వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ( YSR Congress party ) వ్యవహరించిన తీరుపై డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అభ్యంతరం వ్యక్తం చేశారు. గవర్నర్ ప్రసంగాన్ని వైయస్సార్ కాంగ్రెస్ పెద్దలు, ఎమ్మెల్యేలు చులకనగా చూశారని ఆవేదన వ్యక్తం చేశారు. గవర్నర్ ఆరోగ్య పరిస్థితి బాగా లేకపోయినా.. అసెంబ్లీ సమావేశాల ప్రారంభం సందర్భంగా సభకు వచ్చారని గుర్తు చేశారు. గవర్నర్ ప్రసంగానికి సంబంధించి పత్రాలు చించి వేయడం, ప్రతిపక్ష హోదా కోసం బల ప్రదర్శన చేయడానికి తప్పుపట్టారు పవన్ కళ్యాణ్. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి ప్రతిపక్ష హోదా అడిగితే వచ్చేది కాదని… ప్రజలు ఇస్తే వస్తుందని.. అత్యధిక మెజారిటీ ఉన్న ప్రభుత్వం ఏర్పాటు చేస్తారని… గతంలో ప్రభుత్వాన్ని పాలించాం కాబట్టి ప్రతిపక్షంగా గుర్తించాలంటే కుదరని పనిగా తేల్చి చెప్పారు. అసెంబ్లీలో జగన్మోహన్ రెడ్డి తో పాటు వైసీపీ ఎమ్మెల్యేలు వ్యవహరించిన తీరు సరికాదన్నారు.
* శాసనసభ నిబంధనల మేరకే.. శాసనసభ( assembly) నిబంధనల మేరకు ప్రతిపక్ష హోదా ఇస్తారన్న విషయాన్ని గుర్తించుకోవాలన్నారు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. టిడిపి తర్వాత అతిపెద్ద పార్టీ జనసేన అని.. 21 సీట్లతో జనసేన ఉందని.. కానీ తరువాత 11 సీట్లు గా ఉన్న వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి ప్రతిపక్ష హోదా ఎలా ఇస్తారని ప్రశ్నించారు. వారి స్థాయికి తగ్గట్టు ప్రశ్నలు అడిగే అవకాశం ఇస్తారని… గతంలో ప్రశ్నోత్తరాల సమయంలో స్పీకర్ సమయం ఇచ్చారని.. సభకు జగన్ రావడానికి అనుమతించారని గుర్తు చేశారు. సభకు హాజరై వైసీపీ సభ్యులు హుందాగా ప్రవర్తించాలని కోరారు. ప్రభుత్వంలో లోటుపాట్లు ఉంటే సభలో చెప్పాలన్నారు. మరో ఐదేళ్లపాటు వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి ప్రతిపక్ష హోదా రాదని.. 11 సీట్లతో ప్రతిపక్ష హోదా ఇవ్వరని.. ఇదేదో చంద్రబాబు, జనసేన నిర్ణయించేది కాదని.. దానికి రూల్స్, నియమ నిబంధనలు ఉన్నాయని పవన్ స్పష్టం చేశారు. కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు అయ్యే సమయంలో పార్లమెంటరీ పక్షంలో ఎన్డీఏ నాయకుడిని ఎన్నుకునే సమయంలో.. ప్రధానితో పాటు జనసేన పార్టీ నాయకుడిగా తాను కూర్చున్నానని.. తాను మంత్రిగా ప్రమాణస్వీకారం చేసే సమయంలో ప్రధాని మోడీ పక్కన కూర్చోలేదని.. మంత్రులతో పాటే కూర్చున్న విషయాన్ని గుర్తు చేశారు పవన్ కళ్యాణ్.
* ఎవరైనా ప్రోటోకాల్ పాటించాల్సిందే
ప్రోటోకాల్( protocol) అనేది అందరికీ వర్తిస్తుందని గుర్తు చేశారు పవన్ కళ్యాణ్. అసెంబ్లీకి వచ్చినప్పుడు స్పీకర్ తనను రావాలని పిలిచినా తాను ఆయనతో వెళ్లలేదని.. డిప్యూటీ సీఎం కు ప్రోటోకాల్ లేదని.. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి కూడా ప్రోటోకాల్ రాదని.. ప్రజలు దానిని ఇవ్వలేదన్నారు. వారిని అవమానించాలని ఉద్దేశం తమకు లేదని… 175 సీట్లలో 11 సీట్లు మాత్రమే వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి ప్రజలు ఇచ్చిన విషయాన్ని గుర్తు చేసుకోవాలన్నారు. ఈ ఐదేళ్లపాటు వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి హోదా ఇవ్వడం అనేది కుదరదు అన్నారు. మొత్తానికి అయితే ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పూర్తి స్పష్టతనిచ్చారు. ఇక తేల్చుకోవాల్సింది వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ.