Homeఆంధ్రప్రదేశ్‌New Rurban Panchayats in AP: ఏపీలో కొత్తగా రూర్బన్ పంచాయతీలు!

New Rurban Panchayats in AP: ఏపీలో కొత్తగా రూర్బన్ పంచాయతీలు!

New Rurban Panchayats in AP: ఏపీ ప్రభుత్వం( AP government ) గ్రామ పంచాయితీలకు సంబంధించి ఒక కీలక నిర్ణయం తీసుకుంది. గ్రామపంచాయతీలను పునర్ వర్గీకరించేందుకు అనుమతించింది. వర్గీకరణ ప్రతిపాదనలకు ఆమోదం తెలిపింది. జనాభాతో పాటు ఆదాయం ఆధారంగా వర్గీకరణ జరపాలని సూచించింది. ప్రస్తుతం మూడు రకాలుగా గ్రామపంచాయతీలు ఉన్నాయి. వాటిని నాలుగు రకాలుగా విభజించింది ఏపీ ప్రభుత్వం. ఇకనుంచి కొత్తగా రూర్బన్ పంచాయితీ విధానాన్ని తీసుకొచ్చింది. రూర్బన్ పంచాయతీలో పట్టణం తరహాలో అభివృద్ధి పనులు చేయనుంది. మౌలిక వసతులకు పెద్ద పీట వేయనుంది. తద్వారా పట్టణీకరణ సాధించాలని భావిస్తోంది.

* రూర్బన్ పంచాయతీల్లో పదివేలకు పైగా జనాభా ఉంటారు. వార్షిక ఆదాయం కోటి రూపాయలు కంటే ఎక్కువగా ఉండాలి. అదే గిరిజన ప్రాంతాల్లో జనాభా 5000 కంటే ఎక్కువగా ఉండాలి.

* రెండోది గ్రేడ్ 1 పంచాయతీలు. ఇక్కడ జనాభా 3,000 నుంచి పదివేల మధ్య ఉండాలి. పంచాయితీ వార్షిక ఆదాయం రూ.30 లక్షల కంటే ఎక్కువ. కోటి రూపాయలు కంటే తక్కువగా ఉండాలి. అదే గిరిజన ప్రాంతాల్లో జనాభా 2500 మంది నుంచి 5000 మధ్యలో ఉంటే చాలు గ్రేడ్ 1 పంచాయతీగా భావిస్తారు. మండల ప్రధాన కేంద్రం పంచాయితీ గ్రేడ్ 1 కిందకు రానుంది.

Also Read: ఏపీలో 310 కిలోమీటర్ల తీరం ప్రమాదం.. కేంద్రం హెచ్చరిక!

* మూడోది గ్రేడ్ 2 పంచాయతీలు. ఇక్కడ జనాభా రెండువేల కంటే తక్కువ మంది ఉంటారు. అదే గిరిజన ప్రాంతాల్లో అయితే 15 వేల నుంచి 2000 లోపు జనాభా ఉండాలి.

* నాలుగోది గ్రేడ్ 3 పంచాయతీలు. ఇక్కడ జనాభా 1500 కంటే తక్కువగా ఉంటారు. ఇలా మొత్తం నాలుగు రకాలుగా పంచాయతీలను పునర్వ్యవస్థీకరించారు.

* అయితే రూర్బన్ పంచాయతీలు ఇకనుంచి పట్టణాల తరహాలో అభివృద్ధి కానున్నాయి. కొన్ని నగర పంచాయతీలకు తక్కువ.. మేజర్ పంచాయతీలకు ఎక్కువ అన్న మాదిరిగా ఉంటాయి. ముఖ్యంగా మండల కేంద్రాలు రూర్బన్ పంచాయతీలుగా అవతరించనున్నాయి.

Dharma Raj
Dharma Rajhttps://oktelugu.com/
Dharma Raj is a Senior Journalist who has good experience in reporting and had worked with top Media Organizations. He Contributes articles on AP Politics.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Exit mobile version