Nara Lokesh: ఏపీలో( Andhra Pradesh) ఉపాధ్యాయులకు గుడ్ న్యూస్. ఇప్పటివరకు యాప్ లతో నరకయాతన పడ్డారు వారు. ఆ బాధ నుంచి తప్పిస్తూ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ సరికొత్త విధానాన్ని తెరపైకి తీసుకొచ్చారు. సరికొత్త యాప్ ఒకటి అందుబాటులోకి తెచ్చారు. దాంతో ఉపాధ్యాయుల కష్టాలన్నీ తీరనున్నాయి. గత ప్రభుత్వంలో తమను శత్రువులుగా చూశారని.. కూటమి ప్రభుత్వం అనుకూల నిర్ణయాలు తీసుకోవడంతో ఉపాధ్యాయ వర్గాల్లో సంతృప్తి కనిపిస్తోంది. తాజాగా ప్రభుత్వం అందుబాటులోకి తెచ్చిన యాప్ ను స్వాగతిస్తున్నారు ఉపాధ్యాయులు. కూటమి ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలుపుతున్నారు. ముఖ్యంగా మంత్రి నారా లోకేష్ కు రుణపడి ఉంటామంటున్నారు.
Also Read: ఆరు సినిమాలతో జనసేనను నడిపించేశారా? పవన్ పై వైసీపీ కొత్త అస్త్రం!
* పేరు పేరునా యాప్ ల గోల
వైయస్సార్ కాంగ్రెస్( YSR Congress ) హయాంలో ఉపాధ్యాయులపై నానారకాల యాప్ ల ఒత్తిడి ఉండేది. విద్యా బోధన కంటే ఈ యాప్ ల నమోదుకే అధిక ప్రాధాన్యం ఇవ్వాల్సి వచ్చేది. దీంతో ఉపాధ్యాయులు యాప్ లతో కుస్తీలు పడేవారు. అయితే ఈ యాప్ ల ఇబ్బంది నుంచి తప్పిస్తామని ఎన్నికల్లో కూటమి నేతలు హామీ ఇచ్చారు. ఇప్పుడు విద్యా సంవత్సరం ప్రారంభం కానుండడంతో కీలక నిర్ణయం తీసుకున్నారు. బుధవారం నుంచి లెర్నింగ్ ఎక్సలెన్స్ ఇన్ ఆంధ్ర ప్రదేశ్ ‘లీప్’ పేరుతో ఒక సమగ్ర యాప్ ను విడుదల చేశారు. గత ప్రభుత్వ హయాంలో టీచర్లు, ఉద్యోగులు, విద్యార్థుల హాజరు, మధ్యాహ్నం భోజనం, టాయిలెట్ల నిర్వహణ వంటి వాటికోసం చాలా యాప్ లు ఉండేవి. పాఠ్యపుస్తకాల పంపిణీ, నాడు నేడు, పీఎం శ్రీ వంటి వివరాల నమోదు చేయడానికి కూడా మరికొన్ని యాప్ లు ఉండేవి. అయితే వరుసగా ఈ యాప్ ల నమోదు, పాస్ వర్డ్ గుర్తింపు చాలా కష్టంగా ఉండేది. గత ప్రభుత్వ హయాంలో యాప్ ల వినియోగంపై ఉపాధ్యాయులు గగ్గోలు పెట్టేవారు. అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ యాప్ ల భారం లేకుండా చూస్తామని లోకేష్ హామీ ఇచ్చారు.
* కొత్తగా లీప్ యాప్
గత ఐదు సంవత్సరాలుగా ఉపాధ్యాయులు( teachers) పడుతున్న ఈ సమస్యను పరిష్కరించడానికి ప్రభుత్వం లీప్ యాప్ తీసుకొచ్చింది. ఉపాధ్యాయులు తమ ఫేస్ రికగ్నేషన్ ఐడి, పాస్ వర్డ్ తో యాప్ లో లాగిన్ కావచ్చు. ఈ యాప్ లో స్కూల్, టీచర్, స్టూడెంట్స్, గవర్నెన్స్, కమ్యూనికేషన్, డ్యాష్ బోర్డ్ అనే ఆరు విభాగాలు ఉంటాయి. చాలా రకాల యాప్ లు లేకుండా.. అన్నింటికీ కలిపి ఒకే ఒక యాప్ అందుబాటులోకి వచ్చింది. దీనిపై మంత్రి నారా లోకేష్ మాట్లాడుతూ ఎన్నికల్లో ఇచ్చిన హామీని నిలబెట్టుకున్నామని చెప్పారు.
* సానుకూల నిర్ణయాలు..
ఉపాధ్యాయుల విషయంలో ఏపీ ప్రభుత్వం( AP government) అన్ని రకాల జాగ్రత్తలు తీసుకుంటుంది. గతంలో వైయస్సార్ కాంగ్రెస్ ప్రభుత్వం ఉపాధ్యాయుల నుంచి మూల్యం చెల్లించుకుంది. వారి విషయంలో నిర్లక్ష్యంగా వ్యవహరించడంతోనే ఇబ్బందికర పరిస్థితులు ఎదురయ్యాయి. కానీ కూటమి ప్రభుత్వం మాత్రం ఉపాధ్యాయుల విషయంలో సానుకూల నిర్ణయాలు తీసుకుంటూ వస్తోంది. యాప్ ల బాధ తప్పడంతో ఉపాధ్యాయుల నుంచి కూడా సంతృప్తి కనిపిస్తోంది. త్వరలో డీఎస్సీ నియామక ప్రక్రియతో ఉపాధ్యాయుల కొరత తీరనుంది. కొద్ది రోజుల్లో డీఎస్సీ నోటిఫికేషన్ ఇచ్చేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉంది.
Also Read: తిరుపతిలో హై టెన్షన్.. గోశాల వద్ద టీడీపీ ఎమ్మెల్యేలు.. బయలుదేరిన కరుణాకర్ రెడ్డి!