Raj Tarun Lavanya: గత ఏడాది మొత్తం మీడియా లో రాజ్ తరుణ్(Raj Tarun), లావణ్య(Lawanya) ప్రేమ వ్యవహారం ఎంతటి దుమారం రేపిందో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. లోకల్ మీడియా నుండి నేషనల్ మీడియా వరకు దీని గురించే చర్చ. ప్రైమ్ టైం న్యూస్ లో కూడా రాష్ట్రంలో వేరే సమస్యలే లేనట్టు వీళ్లిద్దరి వ్యవహారం గురించి లైవ్ డిబేట్స్ జరిగాయి. ఎప్పుడైతే శేఖర్ బాషా మధ్యలోకి ఎంట్రీ ఇచ్చి, లావణ్య కి సంబంధించిన ఆడియో రికార్డ్స్ అన్నిటిని బయటపెట్టాడో, అప్పటి నుండి లావణ్య ఆడుతున్నది నాటకాలే అని అత్యధిక శాతం మంది నమ్మారు. ఇంకా ఎక్కువ లాగితే అడ్డంగా దొరికిపోతాము అనే భయం తో లావణ్య ఈ వ్యవహారం పై మాట్లాడడం మానేసి సైలెంట్ గా ఉంటున్న సంగతి తెలిసిందే. రీసెంట్ గానే ఆమె మీడియా ముందుకొచ్చి రాజ్ తరుణ్ కి క్షమాపణలు చెప్పిన సందర్భాలు కూడా సోషల్ మీడియా లో బాగా వైరల్ అయ్యాయి.
Also Read: ఇన్ స్టాగ్రామ్ ఫాలోవర్లు మొత్తం ఫేక్ అంటూ నోరు జారేసిన పూజా హెగ్డే !
అయితే ఇప్పుడు మళ్ళీ లావణ్య వ్యవహారం చర్చల్లోకి వచ్చింది. రాజ్ తరుణ్ లావణ్య తో రిలేషన్ లో ఉంటున్న రోజుల్లో ఉండే ఇల్లుని లావణ్య కి వదిలేసాను అని ఒక ఇంటర్వ్యూ లో చెప్పిన సంగతి తెలిసిందే. ఎందుకంటే కెరీర్ ప్రారంభం లో నేను ఇబ్బంది పడుతున్న రోజుల్లో లావణ్య నాకు సహాయంగా నిల్చింది, ఆ కృతజ్ఞతతోనే లావణ్య ని ఆ ఇంట్లో ఉండనిచ్చాను అంటూ చెప్పుకొచ్చాడు రాజ్ తరుణ్. అయితే ఇప్పుడు రాజ్ తరుణ్ సినిమాలు ఆశించిన స్థాయిలో ఆడడం లేదు, అవకాశాలు కూడా అంతంత మాత్రంగానే ఉన్నాయి, అద్దె ఇంట్లో ఉండడం వల్ల మాకు ఖర్చు ఎక్కువ అయిపోయాయి, రీసెంట్ గానే మా ఇద్దరికీ ఆరోగ్యం క్షీణించింది, ఇన్ని కష్టాలు పెట్టుకొని అద్దె ఇంట్లో ఎందుకు ఉండాలి, మాకంటూ ఒక సొంత ఇల్లు ఉంది కదా, మేము అందులోనే ఉంటామని నిన్న వచ్చారు.
కానీ అప్పటికే ఆ ఇంట్లో ఉంటున్న లావణ్య మాత్రం వాళ్ళిద్దరిని లోపలకు రానివ్వలేదు. దీంతో ఉదయం నుండి అర్థ రాత్రి వరకు రాజ్ తరుణ్ తల్లిదండ్రులు ఆ ఇంటి ముందే ధర్నా కి దిగి అన్నం నీళ్లు లేకుండా కూర్చున్నారు. పరిస్థితి చేతులు దాటడంతో పోలీసులు కలగచేసుకొని వాళ్ళిద్దరిని లోపలకు రానివ్వాల్సిందే అని గట్టిగా చెప్పడం తో లావణ్య కి వేరే గత్యంతరం లేక ఇంట్లోకి తీసుకెళ్లింది. అయితే తనని మరోసారి ఇబ్బంది పెట్టినందుకు గాను లావణ్య ఒక ఆడియో రికార్డు ని బయటపెట్టింది. ఆ ఆడియో రికార్డు లో రాజ్ తరుణ్, అరియానా కలిసి లావణ్య తో మాట్లాడారు. అరియానా మాట్లాడుతూ ‘రాజ్ తరుణ్ మా కుటుంబ సభ్యులలో ఒకరు. అతనితో జీవితాంతం నేను ఇలాగే ప్రయాణం చేయాలనీ అనుకుంటున్నాను. ఈ విషయాన్నీ మా ఇంట్లో కూడా చెప్పేసాను’ అంటూ అరియనా మాట్లాడుతుంది. ఈ ఆడియో రికార్డు ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది.
Also Read: ఈ నటుడి భార్య కూడా టాలీవుడ్ లో స్టార్ నటి.. ఎవరో తెలిస్తే షాక్ అవుతారు..