https://oktelugu.com/

Nara Lokesh: మంత్రి అంటే అలా ఉండాలి.. 25 మంది విద్యార్థుల భవిష్యత్తును కాపాడిన లోకేష్

నారా లోకేష్ కు ఐటీతో పాటు విద్యాశాఖను అప్పగించారు చంద్రబాబు. ఆ రెండు శాఖలు చాలా కీలకమైనవి.అందుకే లోకేష్ గట్టిగానే కృషి చేస్తున్నారు. శాఖపై పట్టు పెంచుకునేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. అయితే ఓ 25 మంది ప్రతిభావంతులైన దివ్యాంగ విద్యార్థులు తమ భవిష్యత్ ముగిసిపోయిందని ఆందోళన చెందారు. వారికి ఎదురైన సున్నిత సమస్యతో ఇక కోలుకోలేమని భావించారు. కానీ దాని నుంచి విముక్తి కల్పించారు లోకేష్.

Written By:
  • Dharma
  • , Updated On : July 8, 2024 10:43 am
    Nara Lokesh

    Nara Lokesh

    Follow us on

    Nara Lokesh: అమరావతి:ఏపీలో కూటమి ప్రభుత్వం కొలువుదీరింది.సీఎం,డిప్యూటీ సీఎం, మంత్రులు పదవి బాధ్యతలు చేపట్టారు. ఎవరి పని మీద వారు ఉన్నారు. శాఖలపై సీరియస్ గా సమీక్షిస్తున్నారు.మంత్రి పదవులు కేటాయించినప్పుడే సీఎం చంద్రబాబు కీలక ఆదేశాలు ఇచ్చారు. మూడు నెలల్లో తమ శాఖలపై పట్టు పెంచుకోవాలని కూడా సూచించారు. దీంతో యువ మంత్రులు గట్టిగానే కసరత్తు చేస్తున్నారు. ఈసారి పాలనలో తన మార్కు చూపించాలని మంత్రి నారా లోకేష్ గట్టి పట్టుదలతోనే ఉన్నారు. ముఖ్యంగా విద్యాశాఖలో విప్లవాత్మకమైన మార్పులు తీసుకురావాలని భావిస్తున్నారు. అయితే ఆయన తాజాగా తీసుకున్న ఒక నిర్ణయం సంచలనం గా మారింది. 25 మంది ప్రతిభావంతులైన దివ్యాంగ విద్యార్థుల భవిష్యత్తునకు భరోసా ఇచ్చింది.

    * కీలక బాధ్యతలు..
    నారా లోకేష్ కు ఐటీతో పాటు విద్యాశాఖను అప్పగించారు చంద్రబాబు. ఆ రెండు శాఖలు చాలా కీలకమైనవి.అందుకే లోకేష్ గట్టిగానే కృషి చేస్తున్నారు. శాఖపై పట్టు పెంచుకునేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. అయితే ఓ 25 మంది ప్రతిభావంతులైన దివ్యాంగ విద్యార్థులు తమ భవిష్యత్ ముగిసిపోయిందని ఆందోళన చెందారు. వారికి ఎదురైన సున్నిత సమస్యతో ఇక కోలుకోలేమని భావించారు. కానీ దాని నుంచి విముక్తి కల్పించారు లోకేష్. దేశవ్యాప్తంగా ఐఐటి, ఎన్ఐటీలలో సీట్ల సాధింపునకు అర్హత ఉన్న దివ్యాంగ విద్యార్థులు ప్రభుత్వం చేసిన చిన్నతప్పిదంతో సీట్లు కోల్పోయే ప్రమాదం ఏర్పడింది. ఏపీలో దివ్యాంగ విద్యార్థులకు సెకండ్ లాంగ్వేజ్ పరీక్ష నుంచి మినహాయింపు ఉంది. సర్టిఫికెట్ లోనూ సెకండ్ లాంగ్వేజ్ పరీక్ష వద్ద E అని ఇస్తారు. అదే దేశంలోని ప్రఖ్యాత ఐఐటి, ఎన్ఐటీలలో సీట్లు సంపాదించడానికి అర్హత సాధించిన దివ్యాంగ విద్యార్థులకు శాపం అయింది.

    * అరగంటలో స్పందన..
    ఐఐటీలో 170 ర్యాంకుతో ఓ దివ్యాంగ విద్యార్థి సత్తా చాటాడు. ఐఐటి మద్రాస్ నుంచి ఆయనకు పిలుపు వచ్చింది. కానీ సర్టిఫికెట్ లో ఉన్న సెకండ్ లాంగ్వేజ్ వద్ద E అని ఉండడంతో… ఆ విద్యార్థి ఉత్తీర్ణతకు కావలసిన ఐదు సబ్జెక్టుల్లో నాలుగు మాత్రమే ఉత్తీర్ణులైనట్లు.. అందుకే ఆ సర్టిఫికెట్ చెల్లదని అధికారులు అభ్యంతరం వ్యక్తం చేశారు. దీంతో పృద్వి సత్యదేవ అనే విద్యార్థి దిక్కుతోచని స్థితిలో విద్యాశాఖ మంత్రి లోకేష్ కు మెసేజ్ పంపాడు. దీనిపై అరగంటలోనే స్పందించారు లోకేష్. అధికారులను పరుగులు పెట్టించారు. వారి సమస్యను పరిష్కరించాలని ఆదేశించారు. E అని ఇవ్వడానికి బదులు అక్కడ మార్కులు ఇచ్చి వారికి మేము జారీ చేయాలని ఆదేశించారు. దీంతో వెంటనే ఇంటర్ బోర్డు అధికారులు స్పందించారు. కనీస స్థాయిలో పాస్ మార్కులు అయిన 35 గా చూపి మేములను జారీచేశారు.

    * ఆగమేఘాలతో జీవో..
    అయినా సరే ఐఐటి అధికారులు ఆ జాబితాలను సమ్మతించలేదు. ఏపీ ప్రభుత్వం నుంచి ప్రత్యేక జీవో కావాలని మెలిక పెట్టారు. దీంతో బాధితులు మరోసారి మంత్రి లోకేష్ ను ఆశ్రయించారు. వెంటనే జీవో జారీ చేయాలని లోకేష్ ఆదేశించడంతో ప్రభుత్వ అధికారులు సత్వర చర్యలు చేపట్టారు. ఈ జీవోతో ఏకంగా 25 మంది ప్రతిభావంతులైన దివ్యాంగ విద్యార్థులకు అవకాశం దక్కింది. నేడు వారంతా మంత్రి లోకేష్ ను కలవనున్నారు. తమ సమస్యను పరిష్కరించినందుకు కృతజ్ఞతలు తెలపనన్నారు.