https://oktelugu.com/

Nara lokesh: పవన్ తో లోకేష్ కు సమాన హోదా.. ఇప్పట్లో సాధ్యమేనా?

ఏపీలో కూటమి ప్రభుత్వం నడుస్తోంది.మూడు పార్టీలు ఉమ్మడిగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశాయి.పవన్ కళ్యాణ్ కు సీఎం చంద్రబాబు ప్రాధాన్యత ఇస్తున్నారు.ఈ ఎన్నికల్లో విజయానికి కారణమయ్యారన్న కారణంతో పెద్దపీట వేస్తున్నారు.అయితే పవన్ కు ఇస్తున్న హోదాను లోకేష్ కు ఇవ్వాలన్న డిమాండ్ పార్టీ నుంచి పెరుగుతోంది.

Written By:
  • Dharma
  • , Updated On : October 8, 2024 12:55 pm
    Nara Lokesh

    Nara Lokesh

    Follow us on

    Nara lokesh: మంత్రి నారా లోకేష్ కు ప్రభుత్వంలో ప్రాధాన్యత పెంచాలన్న డిమాండ్ టిడిపి శ్రేణుల నుంచి వినిపిస్తోంది.ప్రస్తుతం లోకేష్ మంత్రిగా ఉన్నారు.పార్టీలో కీలక బాధ్యతలు చూస్తున్నారు. అయితే ఇతర రాష్ట్రాల్లో వారసులకు పెద్దపీట వేస్తున్న తరుణంలో..లోకేష్ విషయంలో చంద్రబాబు ఒక ఆలోచన చేయాలన్న డిమాండ్ పార్టీ నుంచి వినిపిస్తోంది. అటు నందమూరి,నారా కుటుంబాల నుంచి సైతం ఇదే మాట వస్తుండడంతో చంద్రబాబు పునరాలోచనలో పడినట్లు సమాచారం. ప్రధానంగాలోకేష్ కు డిప్యూటీ సీఎం పదవి కల్పించాలన్నది ప్రధానమైన డిమాండ్ గా వినిపిస్తోంది. తద్వారా పవన్ కళ్యాణ్ తో సమానమైన హోదాలో లోకేష్ ను చూసుకోవాలని సొంత పార్టీ శ్రేణులు భావిస్తున్నాయి. అయితే అది సాధ్యమేనా అన్న ప్రశ్న వినిపిస్తోంది. ఈ ఎన్నికల్లో కూటమి తిరుగులేని విజయం సాధించింది. కూటమిలో కీలక భాగస్వామి అయిన జనసేన 21 స్థానాల్లో పోటీ చేసి.. శత శాతం విజయం అందుకుంది. కూటమి గెలుపులో పవన్ కీలక భాగస్వామి అయ్యారు. అందుకే చంద్రబాబు పవన్ కళ్యాణ్ కు ఎనలేని ప్రాధాన్యమిస్తూ వచ్చారు. డిప్యూటీ సీఎం హోదాతో పాటు కీలకమైన నాలుగు మంత్రిత్వ శాఖలను అప్పగించారు. అయితే ఎన్నికల్లో గెలవడం అనేది చంద్రబాబుకు కీలకంగా మారింది. టిడిపిని బతికించుకోవడంతోపాటు కుమారుడు లోకేష్ కు రాజకీయ భవిత ఇవ్వాలని భావించారు చంద్రబాబు. అయితే పవన్ రూపంలో అది అడ్డంకిగా మారింది. భాగస్వామి పార్టీగా పవన్ కు అత్యంత ప్రాధాన్యం ఇచ్చే క్రమంలో ఒకే ఒక్క డిప్యూటీ సీఎం పదవి ఇవ్వడం అనివార్యంగా మారింది.

    * తమిళనాడు మాదిరిగానే
    అయితే లోకేష్ కు డిప్యూటీ సీఎం హోదా కల్పించాలన్న డిమాండ్ ఇప్పుడు పార్టీ నుంచి ప్రారంభమైంది. తమిళనాడులో స్టాలిన్ తన వారసుడు ఉదయనిధి స్టాలిన్ కు డిప్యూటీ సీఎం హోదా కల్పించారు. తన తరువాత పార్టీని నడిపించేది ఉదయనిధి స్టాలిన్ అని సంకేతాలు ఇవ్వగలిగారు. అదే మాదిరిగా చంద్రబాబు కూడా లోకేష్ కు ప్రాధాన్యం ఇవ్వాలన్న డిమాండ్ పెరుగుతోంది. డిప్యూటీ సీఎం తో పాటు పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ పదవి ఇవ్వాలని మెజారిటీ క్యాడర్ కోరుతోంది. అయితే పార్టీ పరంగా వర్కింగ్ ప్రెసిడెంట్ పదవి పై ఎటువంటి అభ్యంతరాలు లేవు. కానీ డిప్యూటీ సీఎం హోదా విషయంలో మాత్రం అంత ఈజీ కాదని తేలుతోంది.

    * వారిద్దరికీ సమానంగా ప్రాధాన్యత
    మంత్రివర్గ సమావేశాల్లో సీఎం చంద్రబాబుకు అటు ఇటుగా పవన్ తో పాటు లోకేష్ కూర్చుంటున్నారు.చంద్రబాబు తర్వాత వారిద్దరికీ ప్రభుత్వంలో ఎనలేని ప్రాధాన్యం ఉంటుంది. అయితే డిప్యూటీ సీఎం హోదా అనేది సున్నితమైన అంశం. ఒకవేళ చంద్రబాబు అడిగితే పవన్ కాదనలేని పరిస్థితి. ఇప్పటివరకు పరిస్థితులకు అనుగుణంగా పవన్ కళ్యాణ్ నడుచుకున్నారు. ఎక్కడ కూటమిలో ఇబ్బందులు తెచ్చిపెట్టే పరిస్థితి ఒకటి లేదు. ఇప్పుడు కూడా లోకేష్ ను డిప్యూటీ సీఎం హోదా కట్టబెడితే అభ్యంతరం వ్యక్తం చేయరన్నవ్యాఖ్యలు కూడా వినిపిస్తున్నాయి. అటు తెలుగుదేశం పార్టీ సైతం సంపూర్ణ మెజారిటీతో ఉంది. ఆ పార్టీని భవిష్యత్తులో కాపాడుకోవాలంటే లోకేష్ కు పదోన్నతి ఇవ్వడం మేలు. అయితే ఇటు జనసైనికుల నుంచి ఇబ్బందికర అభ్యంతరాలు వ్యక్తం అయ్యే అవకాశం ఉంది. అయితే కూటమికి ఇబ్బందికరంగాఉండే నిర్ణయాలను చంద్రబాబు తీసుకునే అవకాశం లేదు.మరి లోకేష్ విషయంలో ఎలా ముందుకు వెళ్తారో చూడాలి.