spot_img
Homeఆంధ్రప్రదేశ్‌Nara Lokesh Comedy Video: నారా లోకేష్ కామెడీ.. పడి పడి నవ్వుకున్న రేవంత్ రెడ్డి.....

Nara Lokesh Comedy Video: నారా లోకేష్ కామెడీ.. పడి పడి నవ్వుకున్న రేవంత్ రెడ్డి.. వైరల్ వీడియో

Nara Lokesh Comedy Video: నారా లోకేష్.. ఆంధ్రప్రదేశ్ ఫ్యూచర్ మొత్తం ఇప్పుడు ఈయన చేతిలోనే ఉంది. ఇందులో అనుమానం ఏమాత్రం లేదు. అతిశయోక్తి అంతకంటే లేదు. ఒకప్పుడు వైల్డ్ కార్డు ఎంట్రీ ద్వారా పాలిటిక్స్ లోకి వచ్చిన నారా లోకేష్.. అంత ఈజీగా తన జర్నీ మొదలుపెట్టలేదు. చాలా విమర్శలు ఎదుర్కొన్నారు. చాలా ఇబ్బందులు పడ్డారు. వైసిపి నాయకుల చేతిలో నవ్వుల పాలయ్యారు.

Also Read: ప్రియుడి కోసం ఏకంగా తల్లినే.. వామ్మో ఇటువంటి కూతురు పుట్టనే కూడదు

మంగళగిరిలో ఓటమి పాలయ్యారు. ఒకానొక దశలో పడకూడని మాటలు.. వినకూడని మాటలు మొత్తం విన్నారు. ఆ తర్వాత తనను తాను చెక్కుకున్నారు. బౌన్స్ బ్యాక్ అన్నట్టుగా ముందుకు వచ్చేశారు. పినిక్స్ పక్షి బూడిద నుంచి లేచి పైకి ఎగిరినట్టుగా.. నారా లోకేష్ తన రాజకీయ గమ్యాన్ని మరో విధంగా మార్చుకున్నారు. తండ్రి జైలు పాలు అయితే.. ఆ బాధను గుండెలో దిగమింగుకొని.. కార్యకర్తలకు ధైర్యం చెప్పారు. తండ్రిని జైలు నుంచి విడిపించుకున్నారు. యువగళం పేరుతో పాదయాత్ర చేశారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడానికి తనవంతు పాత్ర పోషించారు. తెలుగుదేశం పార్టీకి దూరమైన యువతను దగ్గరికి చేశారు. ఇలా చెప్పుకుంటూ పోతే నారా లోకేష్ ఎన్నో అద్భుతాలు చేశారు.

ఇప్పుడు మంత్రిగా కూడా ఏపీలో విప్లవాత్మకమైన మార్పులకు నారా లోకేష్ శ్రీకారం చుట్టారు. తన శాఖలో జరుగుతున్న లోపాలను బహిరంగంగానే ఆయన వ్యక్తం చేస్తున్నారు. ఆ లోపాలను సవరించుకోవడానికి ప్రయత్నాలు చేస్తున్నారు. మంత్రి అనే అహం లేకుండా.. ముఖ్యమంత్రి కుమారుడని అనే హిప్పోక్రసీ లేకుండా నారా లోకేష్ ముందుకు సాగుతున్నారు.. నారా లోకేష్ సీరియస్ పొలిటిషన్ మాత్రమే కాదు.. బిజినెస్ టైకున్ మాత్రమే కాదు.. అంతకుమించిన కామెడీ పండించగలరు.

బుధవారం ఏపీ రాష్ట్రానికి చెందిన ఎమ్మెల్యే దూళిపాల నరేంద్ర కూతురు దీప్తి వివాహం జరిగింది. ఈ వివాహానికి నారా లోకేష్ హాజరయ్యారు. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా ఈ కార్యక్రమానికి వచ్చారు. ఈ నేపథ్యంలో పెళ్లి మండపంలో నూతన వధూవరులను నారా లోకేష్ ఆశీర్వదించారు. ఈ సమయంలో దీప్తిని ఉద్దేశించి ” నియోజకవర్గాలు పునర్విభజనకు గురవుతున్నాయి. మహిళలకు 33% రిజర్వేషన్ లభించబోతోంది. అలాంటప్పుడు మీరు సిద్ధంగా ఉండాలి. వచ్చేసారి ఎన్నికల్లో పోటీ చేసి ఎమ్మెల్యేగా గెలవాలని” అన్నారు. మాటలు విన్న ధూళిపాల నరేంద్ర ఒక్కసారిగా ఆశ్చర్యపోయారు.. “నా సీటుకే ఎసరు పెడుతున్నావా బాబు” అంటూ నరేంద్ర లోకేష్ ను ఉద్దేశించి అన్నారు. వీరిద్దరి మధ్య సంభాషణ విని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా గట్టిగా నవ్వారు. దీంతో పెళ్లి మండపంలో నవ్వులు వీరి సాయి. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో విపరీతంగా సర్కులేట్ అవుతోంది. అంతేకాదు నారా లోకేష్ కామెడీ టైమింగ్ మామూలుగా ఉండదని టిడిపి నేతలు వ్యాఖ్యానిస్తున్నారు.

Anabothula Bhaskar
Anabothula Bhaskarhttps://oktelugu.com/
Anabothula Bhaskar is a Senior Political Content writer who has very good knowledge on Telugu politics. He is a senior journalist with good command on writing articles with good narative.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES

Most Popular