Nara Bhuvaneshwari: చంద్రబాబు ప్రేమగా తెచ్చిన చీర.. భువనేశ్వరికి మైండ్ బ్లాక్

సాధారణంగా చంద్రబాబు ఏనాడూ తనకోసం చీరలు కొనితెచ్చిన దాఖలాలు లేవన్నారు. అందుకే ఓసారి అందరు భర్తలు భార్యల కోసం చీరలు తెస్తారని.. మీరెందుకు తేవడం లేదని ప్రశ్నించినట్లు భువనేశ్వరి తెలిపారు. దీంతో ఓసారి ప్రత్యేకంగా గుర్తించుకొని చంద్రబాబు చీర తెచ్చారని.. ఓ 30 సంవత్సరాల క్రితం ఇది జరిగి ఉంటుందని గుర్తు చేసుకున్నారు.

Written By: Dharma, Updated On : February 18, 2024 10:31 am

Nara Bhuvaneshwari

Follow us on

Nara Bhuvaneshwari: సాధారణంగా భర్త నుంచి భార్య ఎన్నో ఊహిస్తుంది. భర్త కొనితెచ్చే దుస్తులు, ఇతరత్రా సామాగ్రిని ప్రేమగా స్వీకరిస్తుంది. దయనందిన జీవితంలో మనిషి బిజీగా మారుతున్న వేళ, కుటుంబ సమస్యలతో సతమవుతమవుతున్న ఈ సమయంలో భర్త చిన్నపాటి వస్తువు తెచ్చినా భార్య ఆనంద పడిపోతుంది. దీనికి పేద, ధనిక అని సంబంధం ఉండదు. ఎప్పుడూ ప్రజల మధ్య ఉండే టిడిపి అధినేత చంద్రబాబు కూడా తన భార్య కోసం ఓసారి చీర కొని తెచ్చారట. ఆ చీరను చూస్తే భార్య భువనేశ్వరికి మైండ్ బ్లాక్ అయ్యిందట. శ్రీ సత్య సాయి జిల్లా ధర్మవరంలో చేనేత మహిళలతో భువనేశ్వరి ముఖాముఖిగా సమావేశం నిర్వహించారు. చేనేత కార్మికులను ఆప్యాయంగా పలకరించారు. మగ్గం పై వాళ్లు చీరలు నేస్తున్న విధానాన్ని పరిశీలించారు. వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం జరిగిన సమావేశంలో ఆసక్తికర విషయాలను పంచుకున్నారు.

సాధారణంగా చంద్రబాబు ఏనాడూ తనకోసం చీరలు కొనితెచ్చిన దాఖలాలు లేవన్నారు. అందుకే ఓసారి అందరు భర్తలు భార్యల కోసం చీరలు తెస్తారని.. మీరెందుకు తేవడం లేదని ప్రశ్నించినట్లు భువనేశ్వరి తెలిపారు. దీంతో ఓసారి ప్రత్యేకంగా గుర్తించుకొని చంద్రబాబు చీర తెచ్చారని.. ఓ 30 సంవత్సరాల క్రితం ఇది జరిగి ఉంటుందని గుర్తు చేసుకున్నారు. అయితే ఆ చీర ఘోరంగా ఉందని.. చూస్తేనే హార్ట్ ఎటాక్ వచ్చేలా కనిపించిందని.. ఆ కలర్లు చూసి మైండ్ బ్లాక్ అయ్యిందని చెప్పుకొచ్చారు. కానీ ఆ చీరను తన భర్త ప్రేమతో తీసుకొచ్చారు కనుక.. బీరువాలో భద్రంగా దాచుకున్నట్లు చెప్పుకొచ్చారు.

అయితే ఈ విషయం భువనేశ్వరి చెప్పేసరికి సభలో అందరూ ఒక్కసారిగా నవ్వుకున్నారు. అటు వేదికపై ఉన్న భువనేశ్వరి, మాజీ మంత్రి సునీతలు సైతం నవ్వు ఆపుకోలేక పోయారు. చంద్రబాబుకు తొలి ప్రాధాన్యం ప్రజలేనని.. తరువాతే కుటుంబ సభ్యులను భువనేశ్వరి తేల్చి చెప్పారు. టిడిపి అధికారంలోకి వస్తే చేనేతకు ప్రత్యేక గుర్తింపు తీసుకొచ్చేలా చేస్తామని హామీ ఇచ్చారు. ధర్మవరం, పోచంపల్లి, ఇక్కత్ వస్త్రాలకు ప్రాధాన్యమిచ్చేలా చర్యలు చేపడతామన్నారు. చేనేతను అభివృద్ధి చేస్తామన్నారు. నారా లోకేష్ సతీమణి బ్రాహ్మణి సైతం మంగళగిరి నియోజకవర్గంలో చేనేత కార్మికులను కలుసుకున్నారు. వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు.