https://oktelugu.com/

 Nandamuri Taraka Rama Rao : ముఖ్యమంత్రిగా ఎన్టీఆర్.. నేటికి 42 ఏళ్లు.. తెలుగు రాజకీయాలపై చెరగని ముద్ర వేసిన నేత

దేశ రాజకీయాల్లో చెరగని ముద్ర నందమూరి తారక రామారావు ( Nandamuri Taraka Rama Rao ). తెలుగుదేశం పార్టీని ఏర్పాటు చేసిన తొమ్మిది నెలల కాలంలోనే అధికారంలోకి తెచ్చిన మహానేత ఆయన.

Written By: , Updated On : January 9, 2025 / 12:40 PM IST
 Nandamuri Taraka Rama Rao

 Nandamuri Taraka Rama Rao

Follow us on

Nandamuri Taraka Rama Rao : నందమూరి తారక రామారావు ( Nandamuri Taraka Rama Rao )అను నేను.. అన్న ప్రమాణానికి 42 సంవత్సరాలు అయింది. ఢిల్లీ( Delhi) కోటలను పగులగొట్టి.. పార్టీని స్థాపించిన 9 నెలల్లోనే అధికారంలోకి వచ్చారు నందమూరి తారక రామారావు. 1983 జనవరి 9న ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా( chief minister) ప్రమాణ స్వీకారం చేశారు. ఈ తేదీని అక్షరాలతో లెక్కించవచ్చు కూడా. వెండితెరపై ఆరాధ్యుడిగా వెలిగిపోయిన నటరత్న నందమూరి తారక రామారావు.. ముఖ్యమంత్రిగా తొలిసారి ప్రమాణ స్వీకారం చేసిన ఘట్టం. వెండితెర నుంచి రాజకీయ యవనికపై అడుగుపెట్టారు ఎన్టీఆర్. సినీ రంగంలో అగ్ర కథానాయకుడిగా కొనసాగుతూ.. రాజకీయాల్లో అడుగుపెట్టి ఈ రాష్ట్రానికి సారధి అయ్యారు. రాజకీయాల్లో కూడా ఆధిపత్యమే. మాటలతో మంట పుట్టించి.. పదాలు దట్టించి.. కాక పుట్టించి.. పౌరుషాన్ని రగిలించి.. జనాన్ని కదిలించి చరిత్ర సృష్టించారు నందమూరి తారక రామారావు. తెలుగు ప్రజల ఆరాధ్య దైవంగా మారిపోయారు.

* తొలి ప్రమాణ స్వీకారం రికార్డ్ ఎన్టీఆర్( Nandamuri Taraka Rama Rao ) ముఖ్యమంత్రిగా తొలి ప్రమాణ స్వీకారం ఒక రికార్డ్. అప్పటివరకు ముఖ్యమంత్రులు రాజ్ భవన్ లో ప్రమాణ స్వీకారం చేసేవారు. కానీ ఎన్టీఆర్ మాత్రం హైదరాబాద్ నగరంలోని లాల్ బహుదూర్ స్టేడియంలో( lb stadium) ప్రజా సమక్షంలో ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. అచ్చ తెలుగులో ప్రమాణం చేసి కొత్త చరిత్రకు నాంది పలికారు. ముఖ్యమంత్రి అయ్యాక పరిపాలనలో పలు సంస్కరణలు తీసుకువచ్చారు. ప్రజాభిమానాన్ని పొందగలిగారు. సంక్షేమానికి ఆధ్యుడయ్యారు. రెండు రూపాయలకే కిలో బియ్యం పథకం, పేదలకు జనతా వస్త్రాల పంపిణీ లాంటి వినూత్న పథకాలతో ప్రజలకు చేరువయ్యారు.

* చెప్పింది చేసిన నేత
అధికారం చేపట్టిన నాటి నుంచి ఏదైతే చెప్పారో అదే చేసి చూపారు ఎన్టీఆర్( Nandamuri Taraka Rama Rao ). తప్పుడు వాగ్దానాలు, తప్పించుకునే దారిని ఆయన పాలనలో ఏనాడు దరి చేరనివ్వలేదు. పేదవాడి నా దేవుడు.. సమాజమే నా దేవాలయం అంటూ కాషాయ వస్త్రాలను ధరించి ప్రజాక్షేమమని దీక్ష పూనారు. తెలుగుదేశం పార్టీ దేశ రాజకీయాల్లో బలీయమైన శక్తిగా ఎదిగిందంటే.. అంతలా పునాదులు వేశారు ఎన్టీఆర్. సాహసోపేతమైన నిర్ణయాలు, సంక్షేమ పథకాలే అందుకు కారణం. ఢిల్లీ రాజకీయాలను( Delhi politics ) శాసించిన ఘనత ఎన్టీఆర్ ది. కాంగ్రెస్ పార్టీ ని గడగడలాడించింది కూడా ఆయనే. ఒక విధంగా చెప్పాలంటే దేశంలో ప్రాంతీయ పార్టీలకు దిక్సూచిగా నిలిచింది కూడా ఎన్టీఆర్.

* ఎంతోమంది నేతలకు భవిష్యత్తు
తెలుగుదేశం పార్టీని( Telugu Desam Party) నేతలను తయారు చేసే ఫ్యాక్టరీగా మార్చింది ఎన్టీ రామారావు. అప్పటివరకు అగ్రకులాలు, పెత్తందారులే రాజకీయాల్లో రాణించేవారు. కానీ ఆ పరిస్థితిని మార్చారు. సమాజంలో అన్ని వర్గాలకు నాయకత్వ బాధ్యతలు అప్పగించారు. ఎంతోమంది నాయకులను తయారు చేశారు. ఉమ్మడి రాష్ట్రంలో వందలాదిమంది నేతలకు రాజకీయ భవిష్యత్తు ఇచ్చారు. ఒక విధంగా చెప్పాలంటే జాతీయ రాజకీయాలను సైతం శాసించారు ఎన్టీ రామారావు. ఆయన వేసిన పునాది తోనే తెలుగుదేశం పార్టీ నాలుగున్నర దశాబ్దాలుగా ఈ రాష్ట్రంలో ఉనికి చాటుతోంది. తెలుగు వెలుగును దేశ రాజకీయాల్లో పంచుతోంది. ఈ క్రెడిట్ వన్ అండ్ ఓన్లీ నందమూరి తారక రామారావు ది. ఆయన తొలిసారిగా ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేసి ఈరోజుకు 42 సంవత్సరాలు అవుతోంది. ఈ సందర్భంగా ఆ మహనీయుడిని ఒకసారి స్మరించుకుందాం.