Game changer : ఇక ఈ సంక్రాంతి మూడు సినిమాలు వస్తున్న నేపధ్యం లో ఇప్పటికే ‘గేమ్ చేంజర్’ సినిమా రేపు రిలీజ్ అవ్వనుంది. ఇక ఈ నేపధ్యంలో ఈ సినిమాకు సంబంధించిన బజ్ అయితే మార్కెట్లో విపరీతంగా ఉంది. ఇక ‘డాకు మహారాజ్’ సినిమా మీద మాస్ తో పాటు సగటు ప్రేక్షకుల్లో కూడా మంచి అంచనాలైతే ఉన్నాయి. ఇక ‘సంక్రాంతికి వస్తున్నాం’ సినిమాతో ఫ్యామిలీ ఆడియన్స్ మొత్తం ఈ సినిమా వైపు ఆసక్తి చూపించే అవకాశాలైతే ఉన్నాయి. మరి ఏది ఏమైనా కూడా ఈ మూడు సినిమాల మీద మంచి బజ్ అయితే ఉంది. మరి ఈ అంచనాలను క్యాష్ చేసుకోవడానికి సినిమా మేకర్స్ భారీగా అసక్తి చూపిస్తున్నట్టుగా తెలుస్తోంది. మరి ఇప్పటికే ఈ మూడు సినిమాలకి ఆంధ్రలో రేట్లు హైక్ చేశారు. తెలంగాణలో గేమ్ చేంజర్ సినిమాకి కొంతవరకు హైక్ అయితే ఇచ్చారు. కానీ మిగిలిన రెండు సినిమాలకు టిక్కెట్ రేట్లపైన ఎలాంటి హైక్ లేదని స్పష్టం చేసినట్టుగా తెలుస్తోంది. అయితే ఇక్కడి వరకు బాగానే ఉంది. అయితే థియేటర్లలో ఆడియన్స్ రావడం లేదని థియేటర్స్ అసలు హౌస్ ఫుల్ కావడం లేదని ప్రతి ఒక్క ఎగ్జిక్యూటర్ కూడా వాళ్ళ ఆవేదనను వ్యక్తం చేస్తున్నారు. నిజానికి వాళ్లు థియేటర్ కి రాకపోవడానికి గల ముఖ్య కారణం ఏంటి అంటే టికెట్ రేట్లు పెంచడం ఒక్కటే దానికి కారణం అంటూ చాలామంది వాళ్ల అభిప్రాయాలను తెలియజేస్తున్నారు.
ఇక అది ఫోను 20 రోజుల్లోపే సినిమా ఓటిటి లోకి వస్తుండడం కూడా దానికి మరొక కారణం అంటూ తెలియజేస్తున్నారు. మరి ఏది ఏమైనా కూడా ఈ సంక్రాంతికి వస్తున్న సినిమాలతో టికెట్ల రేట్లు పెరగడం వల్ల జనాలు థియేటర్ కి రావడం లేదా లేదంటే సినిమాల మీద ఆసక్తి లేకపోవడం వల్ల జనాలు సినిమాకి రావడం లేదా అనే విషయాలైతే చాలా స్పష్టంగా తెలియబోతున్నాయి.
ఇక టిక్కెట్ల రేట్ హైక్ విషయంలో అయితే ‘గేమ్ చేంజర్’ సినిమాకి కొంతవరకు డ్యామేజ్ జరిగే అవకాశాలైతే ఉన్నాయి. ఇక మిగిలిన రెండు సినిమాలకు టికెట్ల రేట్ హైక్ లేదు కాబట్టి ఆ సినిమాలకు జనాలు ఎక్కువగా వస్తే టికెట్లు రేట్ అనేది సినిమాల మీద ప్రభావం చూపిస్తుంది అనేది మనం అమ్మడానికి ఒక అవకాశం అయితే ఉంటుంది.
అలాగే తెలంగాణ ప్రేక్షకులు సినిమాలకి ఎక్కువగా వచ్చి ఆంధ్రాలో సినిమాలకి ఎక్కువగా ఆదరణ లేకపోయినా కూడా టికెట్ల రేట్ వల్లే సినిమాని చూడడానికి ప్రేక్షకులు థియేటర్ కి రావడం లేదనే ఒక క్లారిటీ అయితే వస్తుంది. మరి ఈ అన్ని విషయాలను బేస్ చేసుకొని ప్రేక్షకులు థియేటర్ కి వస్తారా? లేదా? టిక్కెట్ రేట్లు పెంచడం వల్లే థియేటర్లు హౌజ్ ఫుల్ కావడం లేదా అనే విషయాలను సంబంధించిన ఒక క్లారిటీ అయితే రాబోతుందనేది చాలా స్పష్టంగా తెలుస్తోంది…