https://oktelugu.com/

Game Changer : గేమ్ చేంజర్ లో అంజలి చనిపోతుందా..? ఆమెను చంపడం తో కథలో ఎలాంటి మలుపులు జరగబోతున్నాయి అంటే..?

ఇప్పటివరకు తెలుగు సినిమా ఇండస్ట్రీలో చాలామంది నటులు వాళ్ళకంటూ ఒక ప్రత్యేకమైన ఇమేజ్ ను క్రియేట్ చేసుకుంటూ ముందుకు సాగుతున్నారు. మరి ఎవరు ఎలాంటి సినిమాలు చేసినా కూడా యావత్ ఇండియన్ సినిమా ఇండస్ట్రీలో మెగా ఫ్యామిలీకి ఉన్న గుర్తింపు నెక్స్ట్ లెవెల్ అనే చెప్పాలి... మరి వాళ్ళు చేస్తున్న సినిమాలతోనే భారీ సక్సెస్ ను అందుకోవాలని చూస్తున్నారు...

Written By:
  • Gopi
  • , Updated On : January 9, 2025 / 12:41 PM IST

    Game Changer

    Follow us on

    Game Changer : ప్రస్తుతం సంక్రాంతి సినిమాల సందడి మొదలైందనే చెప్పాలి. ఇక రేపు రామ్ చరణ్ హీరోగా శంకర్ డైరెక్షన్ లో వస్తున్న గేమ్ చేంజర్ సినిమా రిలీజ్ అవ్వనున్న నేపధ్యంలో ఈ సినిమాకు సంబంధించిన ప్రతి విషయం కూడా ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఇక ఇదిలా ఉంటే ఈ సినిమాకి సంబంధించిన కొన్ని విషయాలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. అవి ఏంటి అంటే ‘గేమ్ చేంజర్’ సినిమాలో ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్స్ లో రామ్ చరణ్ భార్యగా నటించిన అంజలి ఈ సినిమాలో చనిపోబోతుందనే వార్తలైతే వినిపిస్తున్నాయి. నిజానికి తను చేసిన క్యారెక్టర్ చాలా పవర్ ఫుల్ గా ఉండబోతుందట. దాని వల్లే ఆమెను ఆ పాత్ర కోసం శంకర్ తీసుకున్నట్టుగా తెలుస్తోంది. మరి ఈ పాత్ర ఎలా ఉంటుంది ఆమెను ఎవరు చంపుతారు వాళ్ళను చంపిన వాళ్ళని చంపడానికే ఈ సినిమా స్టోరీ సాగుతుందా? అనే విషయాలైతే తెలియాల్సి ఉన్నాయి. మరి మొత్తానికైతే అంజలి ఉన్నంతసేపు ఈ సినిమా మొత్తం తన మీదే నడుస్తుందని ఆమె నటించిన ఈ పాత్ర వల్ల ఆమెకు చాలా అవార్డులు కూడా వస్తాయని ఇప్పటికే సినిమా యూనిట్ మొత్తం ఆమె మీద ప్రశంసల వర్షమైతే కురిపిస్తున్నారు.

    మరి ఏది ఏమైనా కూడా ఈ సినిమాతో ఆమె మరోసారి మంచి కంబ్యాక్ ఇచ్చి వరుస సినిమాలు చేస్తూ బిజీ ఆర్టిస్ట్ గా కొనసాగాలనే ప్రయత్నంలో ఉన్నట్టుగా తెలుస్తోంది. ఇక ఇప్పటివరకు ఆమె చాలామంది స్టార్ హీరోలతో నటించినప్పటికి పెద్దగా గుర్తింపైతే రావడం లేదు.

    ఇక ఈసారి ఈ సినిమాతో మంచి గుర్తింపు రావడమే కాకుండా హీరోయిన్ గా మరోసారి ఆమె ఇండస్ట్రీలో సెటిల్ అవ్వబోతుందనే వార్తలు కూడా వినిపిస్తున్నాయి. మరి ఏది ఏమైనా కూడా ఈ సినిమా పెను సంచలనాన్ని సృష్టించబోతుంది అంటూ ఈ సినిమా నిర్మాత అయిన దిల్ రాజు ఇప్పటికే భారీ ప్రమోషన్స్ అయితే చేస్తున్నాడు. ఇక బాలీవుడ్ లో సైతం ఈ సినిమా పెను రికార్డ్ లను సృష్టించడానికి సిద్ధమయ్యింది.

    ఇక పుష్ప 2 సినిమా రికార్డులను బ్రేక్ చేస్తుందా? లేదా అనేది కూడా తెలియాల్సి ఉంది… ఇక ఏది ఏమైనా శంకర్ ఈ సినిమాతో మరోసారి కంబ్యాక్ ఇచ్చి మంచి సినిమాలు చేయడానికి సిద్ధమవుతున్నట్టుగా తెలుస్తోంది. మరి ఈ ఒక్క సినిమా సక్సెస్ అటు శంకర్ కి, ఇటు దిల్ రాజుకి, అంజలికి, రామ్ చరణ్ కి ప్రతి ఒక్కరికి కీలకంగా మారబోతున్నట్టుగా తెలుస్తుంది…