Nandamuri Balakrishna : నందమూరి అభిమానులకు( Nandamuri fans) ఈరోజు శుభవార్త. ఢిల్లీ వేదికగా నందమూరి బాలకృష్ణ పద్మ విభూషణ్ అవార్డు అందుకోనున్నారు. కొద్ది రోజుల కిందట కేంద్ర ప్రభుత్వం పద్మ అవార్డులను ప్రకటించిన సంగతి తెలిసిందే. ఐదు దశాబ్దాల పాటు సినీ రంగంతోపాటు సేవారంగంలో సేవలందించిన నందమూరి బాలకృష్ణ గుర్తించింది కేంద్ర ప్రభుత్వం. పద్మ విభూషణ్ అవార్డుకు ఎంపిక చేసింది. 1960లో నందమూరి తారక రామారావుకు పద్మ అవార్డు వచ్చింది. ఇన్నాళ్లకు నందమూరి వంశంలో మళ్లీ బాలకృష్ణకు వరించింది. దీంతో నందమూరి అభిమానులు పండుగ చేసుకున్నారు. జూనియర్ ఎన్టీఆర్ తో పాటు కళ్యాణ్ రామ్ సైతం బాబాయికి శుభాకాంక్షలు తెలిపారు.
Also Read : విశాఖపై చంద్రబాబు పక్కా ప్లాన్.. ఆ సామాజిక వర్గానికి ప్రాధాన్యం!
*నేడు అవార్డుల ప్రదానం
ఈరోజు ఢిల్లీలో పద్మ అవార్డుల ( Padma awards ) ప్రదాన కార్యక్రమం కొనసాగనుంది. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ హాజరుకానున్నారు. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము అవార్డులను ప్రదానం చేయనున్నారు. బాలకృష్ణ పద్మ విభూషణ్ అవార్డు తీసుకొనున్న నేపథ్యంలో నందమూరి, నారా కుటుంబ సభ్యులు ఢిల్లీ చేరుకున్నారు. ఈరోజు సాయంత్రం అవార్డుల ప్రదానం చేయనున్నారు. ఈ వేడుకకు జూనియర్ ఎన్టీఆర్ తో పాటు కళ్యాణ్ రామ్ హాజరవుతారని తెలుస్తోంది. అదే జరిగితే ఇది అభిమానులకు పండుగ. కాగా ఇప్పటికే నందమూరి కుటుంబ సభ్యులు ఢిల్లీకి చేరుకున్నారు.
* గత కొంతకాలంగా గ్యాప్..
గత కొంతకాలంగా నందమూరి కుటుంబ హీరోల( Nandamuri family heroes) మధ్య పలకరింపులు లేవు. బహిరంగంగా వేదికలు పంచుకోవడం కూడా లేదు. ముఖ్యంగా జూనియర్ ఎన్టీఆర్ తో పాటు ఆయన సోదరుడు కళ్యాణ్ రామ్ లను కుటుంబ సభ్యులు పట్టించుకోవడంలేదని కామెంట్స్ వినిపించాయి. వైయస్సార్ కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో టిడిపి అధినేత చంద్రబాబు అరెస్ట్ అయిన సంగతి తెలిసిందే. అంతకుముందు కూడా ఎన్టీఆర్ యూనివర్సిటీ పేరు మార్పు, నారా భువనేశ్వరి పై వైయస్సార్ కాంగ్రెస్ నేతల అనుచిత వ్యాఖ్యల సమయంలో కూడా జూనియర్ ఎన్టీఆర్ స్పందన టిడిపి శ్రేణులకు రుచించలేదు. అయితే ఎన్నికల ఫలితాలు వచ్చిన తరువాత.. నందమూరి యువ హీరోల్లో మార్పు కనిపించింది. పార్టీ అధికారంలోకి వచ్చిన క్రమంలో, చంద్రబాబుతో పాటు లోకేష్ ప్రమాణస్వీకారం చేసే సమయంలో జూనియర్ ఎన్టీఆర్ స్పందించారు. శుభాకాంక్షలు తెలిపారు. బాలకృష్ణకు పద్మ విభూషణ్ అవార్డు ప్రకటించిన సమయంలో కూడా బాల బాబాయ్ అంటూ శుభాకాంక్షలు తెలిపారు జూనియర్ ఎన్టీఆర్. అటు కుటుంబంలో కూడా ఒక రకమైన ఐక్యత కనిపిస్తూ వచ్చింది.
* కుటుంబ సభ్యులందరికీ ఆహ్వానం..
నందమూరి బాలకృష్ణ ( Nandamuri Balakrishna)పద్మ విభూషణ్ అవార్డు ప్రదాన కార్యక్రమానికి నందమూరి కుటుంబ సభ్యులందరికీ ఆహ్వానం పంపించినట్లు తెలుస్తోంది. జూనియర్ ఎన్టీఆర్ తో పాటు కళ్యాణ్ రామ్ లకు సైతం ఆహ్వానం పలికినట్లు సమాచారం. అయితే జూనియర్ ఎన్టీఆర్ హాజరవుతారని మాత్రం పొలిటికల్ సర్కిల్ లో చర్చ నడుస్తోంది. ఈ కార్యక్రమానికి హాజరు కావడం ద్వారా తమ మధ్య విభేదాలు లేవని సంకేతాలు పంపేందుకు వస్తారని తెలుస్తోంది. అయితే గత అనుభవాల దృష్ట్యా.. జూనియర్ ఎన్టీఆర్ హాజరు కాకపోవచ్చు అన్న కామెంట్స్ వినిపిస్తున్నాయి. తనపై ఎటువంటి రాజకీయ ముద్ర లేకుండా జూనియర్ ఎన్టీఆర్ జాగ్రత్తలు పడుతూ వస్తున్నారు. అదే సమయంలో కుటుంబ వ్యవహారాలపై కూడా స్పందిస్తున్నారు. దీనిని ఇలాగే కొనసాగిస్తారని సన్నిహిత వర్గాలు చెబుతున్నాయి. ఒకవేళ జూనియర్ ఎన్టీఆర్ మాత్రం ఈ కార్యక్రమానికి హాజరైతే సంచలనం గా మారనుంది.
Also Read : రాజమౌళి ఫ్యామిలీ తో నాని కి అంత మంచి బాండింగ్ ఉండటానికి అదొక్కటే కారణమా..?