Atul Kulkarni: ఉగ్రదాడులతో అక్కడి ప్రశాంత వాతావరణ ఒక్కసారిగా చెదిరిపోయింది.. ఈ ప్రాంతంలో ఉగ్రవాదులు దాడులు జరపడం వల్ల మినీ స్విట్జర్లాండ్ గా పేరుపొందిన పహల్గాం రక్తసిక్తమైంది. ఉగ్రవాదుల దాడుల వల్ల ఏకంగా 26 మంది ప్రాణాలు కోల్పోయారు. కాశ్మీర్లో ఇటీవల కాలంలో అభివృద్ధి పనులు జోరుగా సాగడం వల్ల.. ఆ ప్రాంతానికి పర్యాటకులు భారీగా వెళ్తున్నారు. అయితే ఈ ప్రాంతానికి వస్తున్న మంచి పేరును చెడగొట్టడానికి ఉగ్రవాదులు దాడికి పాల్పడ్డారు. పర్యాటకులకు స్వర్గధామం గా ఉన్న కాశ్మీర్ లో పర్యాటకులపై జరిగిన అతిపెద్ద దాడిగా దీనిని అభివర్ణిస్తున్నారు. దాడి జరిగిన నాటి నుంచి కాశ్మీర్ ప్రాంతానికి వెళ్లే పర్యాటకుల సంఖ్య చాలావరకు తగ్గిపోయింది. అంతేకాదు అక్కడ ఉన్న పర్యాటకులు కూడా తిరిగి రావడం మొదలుపెట్టారు. బుకింగ్స్ చేసుకున్న వారు కూడా తమ ప్రయాణాలను రద్దు చేసుకుంటున్నారు. దీంతో కాశ్మీర్ ప్రాంతం పర్యాటకుల లేని తో విలవిలలాడుతోంది. హోటళ్లు ఖాళీగా కనిపిస్తున్నాయి. కేవలం పర్యాటకుల మీద ఆధారపడిన వారంతా ఉపాధి లేకుండా ఇబ్బంది పడుతున్నారు. ఒకరకంగా అక్కడ పరిస్థితి అత్యంత అధ్వానంగా ఉంది.
Also Read: పాకిస్థాన్.. ధనిక దేశం నుంచి ఆర్థిక సంక్షోభం వైపు..
పర్యటించి ధైర్యం చెప్పాడు
కాశ్మీర్ రాష్ట్రంలో భయానక పరిస్థితులు ఏర్పడిన నేపథ్యంలో.. బాలీవుడ్ లో ఫేమస్ క్యారెక్టర్ ఆర్టిస్ట్ అతుల్ కులకర్ణి అక్కడ పర్యటిస్తున్నారు. ” కాశ్మీర్ రాష్ట్రానికి ఎవరూ రావద్దు అనే సంకేతాలను ఉగ్రవాదులు ఇచ్చారు. దేశంలో విభజన చేపట్టాలని చూశారు. కానీ అది జరగకూడదు. ఉగ్ర దాడి తర్వాత పర్యాటకులు తమ బుకింగ్స్ రద్దు చేసుకుంటున్నారు. అసలు ఉగ్రవాదులు భయపెడితే మనం భయపడాలా? వారు ఏదో చేస్తారని చెప్పి వెనుకంజ వేయాలా? మనం భయపడి ఉగ్రవాదుల లక్ష్యాన్ని ఎందుకు పూర్తి చేయాలి. కాశ్మీర్ అనేది అద్భుతమైన ప్రదేశం. అది భూలోక స్వర్గం.. ఉగ్రవాదుల మీద మనం చేసే పోరాటం ఎట్టి పరిస్థితుల్లో ఆగకూడదు. కాశ్మీర్ రాష్ట్రానికి మనం మద్దతు ఎప్పటికీ ఉండాలి. నేను ఇప్పుడు మాత్రమే కాదు ఎప్పటికీ కాశ్మీర్ వస్తూనే ఉంటాను. కాశ్మీర్ ప్రజల ప్రేమను ఆతిథ్యాన్ని.. ప్రేమను స్వీకరిస్తూనే ఉంటానని” అతుల్ కులకర్ణి పేర్కొన్నారు. మరోవైపు అతుల్ కులకర్ణి చేసిన పని దేశ వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. అతుల్ కులకర్ణి చూపిన బాటలోనే తాము నడుస్తామని వందల మంది పర్యాటకులు ఈ సందర్భంగా పేర్కొనడం గమనార్హం. “అతుల్ గొప్ప పని చేశారు. అద్భుతమైన సందేశాన్ని ఇచ్చారు. ఈ సమయంలో ఈ దేశానికి కావాల్సింది అదే. వెనకడుగు వేయడం కంటే.. ధైర్యంగా నాలుగు అడుగులు వేయడమే ఒక జాతికి కావాల్సింది. ఈ ధైర్యాన్ని యావత్ జాతి మొత్తంలో కులకర్ని నింపారు. అంతేకాదు స్ఫూర్తి అంటే ఎలా ఉంటుందో నిరూపించారు. ఆయన ఇప్పుడు దేశం తరఫున కాశ్మీర్లో హీరో అని” నెటిజన్లు సోషల్ మీడియా వేదికగా వ్యాఖ్యానిస్తున్నారు.
Also Read: పాకిస్థాన్.. ధనిక దేశం నుంచి ఆర్థిక సంక్షోభం వైపు..