Rajamouli and Nani : సినిమా ఇండస్ట్రీ అంటే హీరోలకు దర్శకులకు మధ్య చాలా మంచి బాండింగ్ అయితే ఉంటుంది. దాన్ని వాళ్ళు ఎప్పటికప్పుడు కాపాడుకుంటూ వస్తారు. ఎవరు ఎవరితో సినిమాలు చేసినా కూడా అందరూ సపోర్ట్ చేసుకుంటూ ఆయా సినిమాలకు మద్దతుగా నిలుస్తూ సూపర్ సక్సెస్ ని సాధించడానికి కీలకపాత్ర వహిస్తూ ఉంటారు. ఇక రాజమౌళి (Rajamouli), నాని (Nani) మధ్య ఉన్న ఫ్రెండ్షిప్ అయితే చాలా గొప్పదనే చెప్పాలి. ఈగ సినిమా సమయం నుంచి వీళ్లిద్దరి మధ్య పరిచయం అయితే ఏర్పడింది. అప్పటినుంచి ఇప్పటివరకు వీళ్లు చాలా మంచి ఫ్రెండ్స్ గా ఉండటమే కాకుండా వాళ్లకు నచ్చిన సినిమాలను చేసుకుంటూ ముందుకు సాగుతున్నారు. ఇక వీళ్ళ కాంబినేషన్ లో మరో సినిమా రాకపోయినప్పటికి రాజమౌళి అంటే నానికి విపరీతమైన అభిమానం అలాగే నాని చేస్తున్న సినిమాలు అంటే నాని కి చాలా ఇష్టమట…ఆయన సినిమా కోసం పెడుతున్న ఎఫర్ట్స్ ని చూసిన రాజమౌళికి నాని అంటే చాలా ఇష్టం ఏర్పడిందట. అందువల్లే వీళ్ళిద్దరూ అంచలంచెలుగా ఎదుగుతూ ముందుకు సాగుతున్నారు. రాజమౌళి ఎల్లలు దాటి ప్రపంచ ప్రేక్షకుడిని ఆకట్టుకునే విధంగా సినిమాలు చేయడానికి ఆసక్తి చూపిస్తుంటే ఇప్పుడిప్పుడే నాని పాన్ ఇండియా సినిమాలను చేయడానికి ముందుకు వస్తున్నాడు. అయితే ఏ ఫంక్షన్ ఉన్న లేకపోయినా వీళ్లంతా వారానికి ఒకరోజు ఫ్యామిలీతో పాటు మీట్ అవుతూ ఉంటారట.
Also Read : 100% స్ట్రైక్ రేట్ విషయంలో పవన్ ని దాటేసిన నేచురల్ స్టార్ నాని!
అందువల్లే ఇలా ఫ్యామిలీతో పాటు కూడా వీళ్లకు మంచి అనుబంధమైతే ఉంది. ఇక నాని ఏ సినిమా చేసిన కూడా రాజమౌళికి ఆ సినిమాను చూపిస్తూ ఉంటాడు. కారణం ఏంటి అంటే ఆయన ఆ మూవీకి సంబంధించిన రివ్యూ ను పర్ఫెక్ట్ గా ఇస్తారనే ఒక నమ్మకంతోనే అతనికి ఒక స్పెషల్ షో అయితే వేస్తారట. మరి మొత్తానికైతే రాజమౌళి నాని మధ్య మంచి బాండింగ్ అయితే ఉంది.
రీసెంట్ గా నాని హిట్ 3 సినిమాకి రాజమౌళి చీఫ్ గెస్ట్ గా వచ్చాడు. అలాగే తను చేయబోయే మహాభారతం సినిమాలో నాని ఉంటున్నాడు అంటూ ఒక క్లారిటీ అయితే ఇచ్చాడు… ఇక మొత్తానికైతే నాని మహాభారతం సినిమాలో ఏ క్యారెక్టర్ లో నటిస్తాడు అనేది తెలియాల్సి ఉంది…
ఇక ప్రస్తుతం తను చేసిన హిట్ 3 సినిమాని కూడా సక్సెస్ ఫూల్ గా నిలపాల్సిన బాధ్యత నాని చేతుల్లోనే ఉంది. మరి ఈ సినిమా ఎలాంటి సక్సెస్ సాధిస్తుంది. తద్వారా ఈ సినిమాతో ఎలాంటి గుర్తింపును సంపాదించుకోబోతున్నాడు అనేది కూడా తెలియాల్సి ఉంది.
Also Read : పావలా పెట్టుబడికి రూపాయి లాభం… హీరో నాని పెద్ద ముదురు బాబోయ్!