MLA Sudha: వైయస్సార్ కాంగ్రెస్( YSR Congress ) పార్టీకి ఎమ్మెల్యేలు గుడ్ బై చెబుతారా? ఒకరిద్దరు ఎమ్మెల్యేలు పార్టీ మారే ఆలోచనలో ఉన్నారా? వారి అసంతృప్తికి వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నేతలే కారణమా? అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది. 2024 ఎన్నికల్లో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ దారుణంగా ఓడిపోయింది. ఆ పార్టీ కేవలం 11 స్థానాలకు మాత్రమే పరిమితం అయింది. కొన్ని జిల్లాల్లో అయితే కనీసం ఖాతా తెరవలేదు. జగన్మోహన్ రెడ్డి సొంత జిల్లాలో అతి కష్టం మీద మూడు స్థానాల్లో విజయం సాధించింది. అయితే ఇప్పుడు సొంత జిల్లా నుంచి ఒక ఎమ్మెల్యే చేజారి పోతారని ప్రచారం జరుగుతోంది. స్థానిక వైయస్సార్ కాంగ్రెస్ నేతల తీరుతో ఆ ఎమ్మెల్యే పార్టీకి గుడ్ బై చెబుతారని టాక్ నడుస్తోంది.
Also Read: రెడ్డి వర్సెస్ కమ్మ వర్సెస్ బిసి.. ఏపీ బిజెపి కొత్త అధ్యక్షుడు ఆయనే!
* సౌమ్యురాలిగా పేరు..
కడప జిల్లాలో బద్వేలు నియోజకవర్గం( Badvel constituteshan ) నుంచి గెలిచారు డాక్టర్ సుధ. ఆమె పార్టీ తరఫున రెండు సార్లు గెలిచారు. ఎమ్మెల్యేగా ఉన్న ఆమె భర్త అకాల మరణంతో ఉప ఎన్నికల్లో గెలిచారు. 2024 ఎన్నికల్లో రెండోసారి విజయం సాధించారు. సౌమ్యురాలిగా పేరు ఉంది. మరోవైపు కడప వైసీపీ రాజకీయాలను చక్కదిద్దుతుంటారు అవినాష్ రెడ్డి. ఆయన వర్గంగా డాక్టర్ సుధ ఉన్నారు. అయితే ఇప్పుడు మారిన రాజకీయ పరిస్థితుల నేపథ్యంలో బద్వేలులో ఆమె వ్యతిరేక వర్గం యాక్టివ్ అయింది. చాలా దూకుడు ప్రదర్శిస్తోంది. ముఖ్యంగా ఎమ్మెల్యే పై వ్యతిరేకంగా ప్రచారం నడుస్తోంది. ఎమ్మెల్యే సుధ తీరుతో నియోజకవర్గ ఎటువంటి అభివృద్ధి జరగలేదని సోషల్ మీడియాలో వైసీపీ నేతలు ప్రచారం చేస్తున్నారు. కానీ దీనిని కట్టడి చేయలేకపోతున్నారు జిల్లా వైసీపీ పెద్దలు. మరోవైపు అవినాష్ రెడ్డి సైతం ఆమెను పట్టించుకోవడంలేదని ప్రచారం జరుగుతోంది. అందుకే వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలో ఉండడం కంటే.. బయటకు వెళ్ళిపోవడమే మేలన్న నిర్ణయానికి ఆమె వచ్చినట్లు సమాచారం.
* తీవ్ర అవమానం..
అయితే బద్వేలు నియోజకవర్గంలో జరిగిన పరిస్థితులను అధినేతకు తెలియజేందుకు ఎమ్మెల్యే సుధ( MLA Sudha) ప్రయత్నించినట్లు సమాచారం. తాడేపల్లి కార్యాలయానికి వెళ్ళగా రెండు రోజులు పాటు వెయిట్ చేయించారు. జగన్మోహన్ రెడ్డి సైతం ముఖం చాటేశారు. దీంతో ఆమె తీవ్ర మనస్తాపంతో వెనుదిరిగినట్లు తెలుస్తోంది. తనకంటే తన వ్యతిరేక వర్గానికి ఎక్కువ ప్రాధాన్యం ఇస్తున్నారని ఆమె చాలా బాధపడుతున్నారు. అందుకే పార్టీలో ఉండడం అంత శ్రేయస్కరం కాదని భావిస్తున్నారు. అదే సమయంలో ఆమెకు కూటమి నేతలు టచ్లోకి వెళ్లినట్లు తెలుస్తోంది. పార్టీలోకి వస్తే సముచిత స్థానం కల్పిస్తామని.. గుర్తింపు కలిగేలా చూస్తామని హామీ ఇచ్చినట్లు ప్రచారం జరుగుతోంది. ముఖ్యంగా ఆమె జనసేన లో చేరతారని కడప జిల్లా వ్యాప్తంగా ప్రచారం ప్రారంభం అయ్యింది.
* ఎమ్మెల్యేలను తీసుకోకూడదని నిర్ణయం..
వాస్తవానికి వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నుంచి 11 మంది గెలిచారు. ఇప్పటికే ఆ పార్టీకి ప్రతిపక్ష హోదా రాలేదు. ఈ సమయంలో ఆ పార్టీ నుంచి ఎమ్మెల్యేలను తీసుకుంటే విమర్శలు వస్తాయని కూటమి భావించింది. అందుకే వైయస్సార్ కాంగ్రెస్ ఎమ్మెల్యేలను చేర్చుకోకూడదని నిర్ణయించింది. అయితే ఇప్పుడు బద్వేలు ఎమ్మెల్యే తనంతట తాను జనసేనకు సంప్రదించినట్లు తెలుస్తోంది. అవసరం అనుకుంటే అనుబంధ ఎమ్మెల్యేగా కొనసాగుతానని కూడా ఆమె చెప్పినట్లు ప్రచారం జరుగుతోంది. అయితే ఆమె వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేతకు వీర విధేయురాలని.. ఆమె పార్టీని వీడరని వైసిపి వర్గీయులు చెబుతున్నారు. మరి వాస్తవం ఏంటో వారికే తెలియాలి.