Tata Nexon : టాటా మోటార్స్ దేశంలోని అతిపెద్ద ఆటో కంపెనీలలో ఒకటి. ఈ కంపెనీ అనేక విభాగాల్లో కార్లను తయారు చేస్తుంది. కాంపాక్ట్ SUV సెగ్మెంట్‌లో టాటా నెక్సాన్ కారును ఉత్పత్తి చేస్తుంది. ఇది పెట్రోల్, సీఎన్జీ, ఎలక్ట్రిక్ వేరియంట్లతో పాటుగా డీజిల్ వేరియంట్‌లో కూడా మార్కెట్‌లో అందుబాటులో ఉంది. టాటా నెక్సాన్ డీజిల్ వేరియంట్‌ను కొనుగోలు చేయాలని ప్లాన్ చేస్తున్నట్లయితే.. కేవలం లక్ష రూపాయల డౌన్ పేమెంట్‌తో ఈ కారును ఇంటికి తీసుకెళ్లవచ్చు. దీని కోసం కొన్ని సంవత్సరాల పాటు EMI చెల్లించాల్సి ఉంటుంది. EMI మొత్తం ఎంత ఉంటుంది. దానిని ఎన్ని సంవత్సరాలు చెల్లించాలో వివరంగా తెలుసుకుందాం.
Also Read : టాటా నెక్సాన్ ఈవీ టెస్టులో పాస్ అయిందా.. నిజంగా కంపెనీ చెప్పినంత రేంజ్ ఇస్తుందా ?
టాటా నెక్సాన్ డీజిల్ వేరియంట్ ఎక్స్-షోరూమ్ ధర 10 లక్షల రూపాయలు. ఒకవేళ ఎవరైనా ఈ కారును కొనుగోలు చేస్తే, వారు RTOకి 83 వేల రూపాయలు, ఇన్సూరెన్స్ కోసం 43 వేల రూపాయలు చెల్లించాల్సి ఉంటుంది. దీంతో కారు మొత్తం ధర 11.25 లక్షల రూపాయలకు చేరుకుంటుంది. ఇప్పుడు లక్ష రూపాయల డౌన్ పేమెంట్ చేస్తే కారు కోసం మీరు 10.25 లక్షల రూపాయల లోన్ తీసుకోవాల్సి ఉంటుంది. మీరు బ్యాంకు నుండి 9 శాతం వడ్డీ రేటుతో లోన్ తీసుకుంటే ఏడు సంవత్సరాల పాటు ప్రతి నెల 16,506 రూపాయల EMI చెల్లించాల్సి ఉంటుంది.
కారు మొత్తం ఎంతవుతుంది?
ఈఎంఐ పై కారు తీసుకోవడం వల్ల తర్వాత ఎక్కువ డబ్బు చెల్లించాల్సి ఉంటుంది. కారు కోసం 7 సంవత్సరాలలో దాదాపు 3.60 లక్షల రూపాయల వడ్డీ చెల్లించాల్సి ఉంటుంది. వడ్డీ మొత్తాన్ని కూడా కలిపితే, కారు మొత్తం ఎక్స్-షోరూమ్ ధర 14.86 లక్షల రూపాయలు అవుతుంది. ఇది మీ కారు అసలు ధర కంటే ఎక్కువ. కాబట్టి మీరు కారు లోన్ తీసుకోవాలని ఆలోచించినప్పుడు మీ ఆర్థిక పరిస్థితిని కూడా అంచనా వేసుకోండి. ఎందుకంటే లోన్ వల్ల మీరు ఎక్కువ డబ్బు చెల్లించాల్సి వస్తుంది.
Also Read : ఎగబడి కొంటున్నారు.. ఈ కారు గురించి తెలుసా?