Balayya : నందమూరి నటసింహంగా తనకంటూ ప్రత్యేకమైన ఇమేజ్ ను సంపాదించుకున్న నటుడు బాలయ్య బాబు (Balayya Babu)…ఆయన చేస్తున్న అఖండ 2(Akhanda 2) సినిమా షూటింగ్ లో బిజి గా ఉన్నప్పటికి ఆయన తన తదుపరి సినిమాని కూడా అనౌన్స్ చేయడానికి సిద్ధంగా ఉన్నాడు. ప్రస్తుతం ఆయన ఇద్దరు డైరెక్టర్లతో సినిమాను చేయాలనే ఆలోచనలో ఉన్నట్టుగా తెలుస్తోంది. అందులో ఒకరు గోపీచంద్ మలినేని (Gopi Chand Malineni) కాగా, మరొకరు హరీష్ శంకర్ (Harish Shankar)… మరి వీళ్ళిద్దరిలో ఎవరి సినిమాని మొదట చేస్తాడు. ఎవరి సినిమాని తర్వాత చేస్తాడు అనే విషయంలో సరైన క్లారిటీ అయితే రావడం లేదు. కానీ ప్రస్తుతం ఆయన ఒక సినిమాను అనౌన్స్ చేసి ఆలోచనలో ఉన్నట్టుగా తెలుస్తోంది. ఎందుకంటే అఖండ 2 సినిమా షూటింగ్ శరవేగంగా జరగడమే కాకుండా మరొక రెండు నెలలు అయితే ఈ సినిమా షూటింగ్ మొత్తం కంప్లీట్ అయి బాలయ్య బాబు డేట్స్ మొత్తం కాలి అయిపోతాయి. కాబట్టి తన డేట్స్ వేస్ట్ అయిపోతాయనే ఉద్దేశ్యంతో ఇప్పుడు ఇద్దరు డైరెక్టర్లలో ఎవరినో ఒకరిని ఎంచుకొని వాళ్లతో సినిమాలు చేయడానికి సిద్ధమవుతున్నట్టుగా తెలుస్తోంది. మరి బాలయ్య బాబు అంటే మాస్ అంశాలు చాలా దండిగా ఉంటాయి. మరి అలాంటి కథను డీల్ చేసి గోపి చంద్ మలినేని ఒకసారి సక్సెస్ అయితే సాధించాడు. వీర సింహారెడ్డి (Veera Simha Reddy) సినిమాతో తన స్టామినా ఏంటో చూపించాడు.
Also Read : బాలయ్య ఫ్యాన్స్ కి పండగే..’డాకు మహారాజ్’ ఓటీటీ వెర్షన్ లో 15 నిమిషాల సరికొత్త సన్నివేశాలు!
అలాగే బాలయ్య బాబుని వీలైనంత వరకు కొత్తగా ప్రజెంట్ చేసే ప్రయత్నం చేశాడు. మరి హరీష్ శంకర్ సైతం కమర్షియల్ డైరెక్టర్ గా మంచి గుర్తింపును సంపాదించుకున్నప్పటికి బాలయ్య బాబుని ఏ యాంగిల్ లో చూపిస్తాడు. ఎలాంటి ఎలివేషన్స్ తో బాలయ్య బాబు సినిమాని ప్రేక్షకులకు దగ్గర చేస్తాడు అనే విషయంలో సరైన క్లారిటీ అయితే రావడం లేదు.
అందువల్లే బాలయ్య అభిమానులు సైతం మొదట గోపీచంద్ మలినేని సినిమా చేస్తేనే బాగుంటుంది అంటూ కామెంట్లు అయితే చేస్తున్నారు. ఇక ఇప్పటివరకు గోపీచంద్ మలినేని చేసిన సినిమాలన్నీ కమర్షియల్ సినిమాలే కావడం విశేషం…ఇక హరీష్ శంకర్ చేసిన సినిమాలు కూడా కమర్షియల్ సినిమాలే అయినప్పటికి అవి కొంతవరకు రొటీన్ సినిమాల మాదిరిగానే కనిపిస్తూ ఉంటాయి.
అందువల్ల ఆయన కంటే ఇప్పుడు గోపీచంద్ మలినేని బెస్ట్ ఆప్షన్ అంటూ కొంతమంది చెబుతూ ఉండటం విశేషం. మరి వీళ్ళిద్దరిలో బాలయ్య ఎవరికి ముందుగా డేట్స్ ఇస్తాడు. ఎవరి సినిమా స్టార్ట్ చేసి ఎలాంటి విజయాన్ని అందుకుంటుంది అనేది తెలియాల్సి ఉంది.