AP Minister Rajini : ఏపీ మంత్రి విడుదల రజినీ గురించి ఎవరికీ తెలియని విషయాలివీ!

AP Minister Rajini : విడుదల రజినీ.. ఇప్పుడు ఈ పేరు మారుమోగిపోతోంది. ప్రజా సేవకు సోషల్ మీడియా టచ్ ఇచ్చి పాపులర్ అయిన ఈమె గురించే ఇప్పుడంతా చర్చించుకుంటున్నారు. ఏపీ కేబినెట్ లోనే మంత్రి పదవి పొందిన అత్యంత చిన్న వయస్కురాలిగా రికార్డు సృష్టించారు. తొలిసారి ఎమ్మెల్యేగా గెలవడమే కాదు.. తొలిసారే.. అత్యంత ప్రాధాన్యత కలిగిన పెద్ద శాఖ ‘వైద్య ఆరోగ్యశాఖను’ ఆమె నిర్వర్తిస్తుండడం సంచలనంగా మారింది. జగన్ ఈమెను ఎలా నమ్మారు? ఎందుకు మంత్రి పదవి […]

Written By: NARESH, Updated On : April 13, 2022 8:05 pm
Follow us on

AP Minister Rajini : విడుదల రజినీ.. ఇప్పుడు ఈ పేరు మారుమోగిపోతోంది. ప్రజా సేవకు సోషల్ మీడియా టచ్ ఇచ్చి పాపులర్ అయిన ఈమె గురించే ఇప్పుడంతా చర్చించుకుంటున్నారు. ఏపీ కేబినెట్ లోనే మంత్రి పదవి పొందిన అత్యంత చిన్న వయస్కురాలిగా రికార్డు సృష్టించారు. తొలిసారి ఎమ్మెల్యేగా గెలవడమే కాదు.. తొలిసారే.. అత్యంత ప్రాధాన్యత కలిగిన పెద్ద శాఖ ‘వైద్య ఆరోగ్యశాఖను’ ఆమె నిర్వర్తిస్తుండడం సంచలనంగా మారింది. జగన్ ఈమెను ఎలా నమ్మారు? ఎందుకు మంత్రి పదవి ఇచ్చాడు.? అసలు విడుదల రజినీ బ్యాక్ గ్రౌండ్ ఏంటన్న దానిపై స్పెషల్ ఫోకస్..

-విడుదల రజినీ స్వస్థలమేది?
విడుదల రజినీ స్వస్థలం చిలకలూరిపేట అని ప్రచారంలో ఉంది. కానీ ఆమెది తెలంగాణ అని ప్రచారం సాగుతోంది. యాదాద్రి భువనగిరి జిల్లా తుర్కపల్లి మండలం కొండాపురం గ్రామానికి చెందిన రాగుల సత్తయ్య రెండో కూతురు రజినీ అని అంటున్నారు. రాగుల సత్తయ్యకు ఇద్దరు కూతుళ్లు, కొడుకు. చిలకలూరిపేటకు చెందిన విడదల కుమారస్వామిని ఆమె వివాహం చేసుకున్నారు. రజినీ భర్త సాఫ్ట్ వేర్ కంపెనీలు నిర్వహిస్తుంటారని చెబుతున్నారు. ఇటీవల రజినీకి మంత్రి పదవి రావడంతో ఈ కొండాపురం గ్రామస్థులు పండుగ చేసుకుంటున్నారు.

రాగుల సత్తయ్య బతుకుదెరువు కోసం 40 ఏళ్ల హైదరాబాద్ వలస వెళ్లాడు. సఫిల్ గూడలో నివాసం ఉన్నాడు. రజినీ హైదరాబాద్ లోనే జన్మించిందని అంటున్నారు. చిలకలూరిపేట వాసిని పెళ్లి చేసుకొని ఇక్కడికి కోడలు వచ్చి ఎమ్మెల్యేగా గెలిచి ఏకంగా మంత్రి అయ్యింది ఈ తెలంగాణ బిడ్డ అని అంటున్నారు.

-రజినీ సామాజికవర్గంపై వివాదం
రజినీది ‘రజక’ సామాజికవర్గమని.. బీసీ మహిళ కోటాలో ఆమెకు మంత్రి పదవిని జగన్ ఇచ్చారని అందరూ అనుకుంటున్నారు.కానీ కొన్ని రజక సంఘాలు మాత్రం రజినీ తమ కులం కాదని ప్రకటించాయి. ఆమె ముదిరాజ్ అని చెబుతున్నారు. దీనిపై రజినీ ఇంతవరకూ క్లారిటీ ఇవ్వలేదు.

-చంద్రబాబు నాటిన మొక్కనే
చంద్రబాబు ప్రోత్సాహంతో ఆయన టీడీపీలో నాటిన మొక్కనే రజినీ.. టీడీపీలో చేరి అంచలంచెలుగా ఎదిగి అనంతరం వైసీపీలోకి వచ్చి ఎమ్మెల్యేగా గెలిచారు.చిలకలూరిపేటలో రాజకీయాలు ప్రారంభించారు. వైసీపీ టికెట్ ను 2019లో దక్కించుకొని అనూహ్యంగా జగన్ వేవ్ లో ఎమ్మెల్యేగా గెలిచారు. తొలిసారి ఎమ్మెల్యేగా గెలిచిన మూడేళ్లకే ఏకంగా ఏపీ కేబినెట్ లో చోటు సంపాదించి వైద్య ఆరోగ్యం లాంటి పెద్ద శాఖను పొంది హాట్ టాపిక్ గా మారారు. తెలంగాణ బిడ్డ ఏపీలో మంత్రి కావడం ఇక్కడి వాసులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.