Minister Nimmal: నిమ్మల రామానాయుడు.. పరిచయం అక్కర్లేని పేరు. అధికారంలో ఉన్నా.. ప్రతిపక్షంలో ఉన్నా ప్రజాసేవే పరమావధిగా ముందుకు సాగుతారు ఆయన. అందుకే పాలకొల్లు ప్రజలు ఆయనను గుండెల్లో పెట్టుకొని చూసుకుంటున్నారు. వరుసగా మూడు ఎన్నికల్లో గెలిపిస్తూ వచ్చారు.2019 ఎన్నికల్లో జగన్ ప్రభంజనంలో సైతం తట్టుకునే నిలబడ్డారు రామానాయుడు.ఎన్నికల్లో రికార్డు స్థాయిలో 67945 ఓట్లతో పాలకొల్లు నియోజకవర్గం నుంచి విజయం సాధించారు. దీనిని బట్టి అర్థమవుతోంది నిమ్మల రామానాయుడు నియోజకవర్గంలో ఏ స్థాయిలో పట్టు సాధించారో. అందుకే చంద్రబాబు రామానాయుడును తన క్యాబినెట్లోకి తీసుకున్నారు. కీలకమైన జల వనరుల శాఖను కేటాయించారు.
పాలకొల్లు నియోజకవర్గంలో ప్రతి గడప రామానాయుడుకు ఎరుక. ప్రజలు కష్టంలో ఉంటే అస్సలు సహించలేరు. విపత్తుల సమయంలో తానే స్వయంగా సహాయ చర్యల్లో పాల్గొంటారు. సెక్యూరిటీని పక్కనపెట్టి మరి కు గ్రామాల్లో పర్యటిస్తుంటారు. ప్రజల కష్టాలను తెలుసుకునే ప్రయత్నం చేస్తారు. ఆయన సేవలను గుర్తించిన చంద్రబాబు క్యాబినెట్లో కీలక పోర్టు పోలియోను అప్పగించారు. ఇప్పుడు కూడా అదే బాధ్యతతో ముందుకు సాగుతున్నారు రామానాయుడు. నిత్యం ప్రజల మధ్య ఉంటూ, తనకిచ్చిన మంత్రి బాధ్యతలను నిర్వర్తిస్తున్నారు. మంత్రిగా ఉన్నా పాలకొల్లు నియోజకవర్గం పై మాత్రం ప్రత్యేక దృష్టితో ఉంటారు.
రాష్ట్రవ్యాప్తంగా ఈరోజు పింఛన్ల పంపిణీ వేడుక ఘనంగా జరిగిన సంగతి తెలిసిందే. ఉదయం 6 గంటలకే లబ్ధిదారుల ఇంటికి వెళ్లి సీఎం చంద్రబాబు పింఛన్ అందించారు. రాష్ట్రవ్యాప్తంగా మంత్రులు, ఎమ్మెల్యేలు, పార్టీ శ్రేణులు పండగ వాతావరణం లో లబ్ధిదారులకు పింఛన్లు అందించారు.అందులో భాగంగా పాలకొల్లు నియోజకవర్గంలో మంత్రి రామానాయుడు ఇంటింటికి వెళ్లి లబ్ధిదారులకు పింఛన్లు అందజేశారు.ఈ క్రమంలో కొంతమంది వృద్ధులు,మహిళలకు కాళ్లు కడిగి పింఛన్లు పంపిణీ చేశారు.ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు చంద్రబాబు ఇంటి పెద్ద కొడుకుగా నిలిచారని.. గెలిపించినందుకు కృతజ్ఞత తెలిపారని.. టిడిపి ప్రభుత్వాన్ని ఆదరించాలని వృద్ధులను కోరారు. ప్రస్తుతం మంత్రి రామానాయుడు వృద్ధులకు కాళ్లు కడిగిన దృశ్యాలు సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతున్నాయి.