spot_img
Homeఎంటర్టైన్మెంట్Bigg Boss 8 Telugu: మైండ్ బ్లోయింగ్ న్యూస్... బిగ్ బాస్ తెలుగు 8 షెడ్యూల్...

Bigg Boss 8 Telugu: మైండ్ బ్లోయింగ్ న్యూస్… బిగ్ బాస్ తెలుగు 8 షెడ్యూల్ ఇదే, లాంచింగ్ ఎపిసోడ్ ఎప్పుడంటే?

Bigg Boss 8 Telugu: బిగ్ బాస్ 8 కోసం ఆడియన్స్ ఆతృతగా ఎదురు చూస్తున్నారు. సెప్టెంబర్ లో లేటెస్ట్ సీజన్ అంటూ ప్రచారం జరుగుతుంది. తాజా సమాచారం ప్రకారం అంతకంటే ముందే నిర్వాహకులు ప్లాన్ చేస్తున్నారు. ఆ విశేషాలు ఏమిటో చూద్దాం. బిగ్ బాస్ తెలుగు సక్సెస్ఫుల్ గా 7 సీజన్స్ పూర్తి చేసుకుంది. 2017లో ప్రయోగాత్మకంగా బిగ్ బాస్ తెలుగులో ప్రసారం అయ్యింది. ఎన్టీఆర్ హోస్టింగ్ చేశారు. మొదట్లో ఆడియన్స్ కొంచెం కన్ఫ్యూజ్ అయ్యారు. మెల్లగా అలవాటు పడ్డారు. అందులోని మజా ఆస్వాదించారు. సినిమాలతో బిజీగా మారిన ఎన్టీఆర్ తప్పుకున్నారు. సెకండ్ సీజన్ కి నాని రంగంలోకి దిగాడు.

ఆయన హోస్టింగ్ మీద విమర్శలు వచ్చాయి. ఈ క్రమంలో బిగ్ బాస్ సీజన్ 3 హోస్ట్ గా నాగార్జున రంగంలోకి దిగాడు. ఎవరు మీలో కోటీశ్వరుడు షోకి హోస్టింగ్ చేసిన ఉన్న నాగార్జున సూపర్ సక్సెస్ అయ్యారు. వరుసగా ఐదు సీజన్స్ కి ఆయన హోస్ట్ గా వ్యవహరించారు. ఒక్క సీజన్ 6 మాత్రమే ఫెయిల్ అయ్యింది. గత ఏడాది ప్రసారమైన సీజన్ 7 గ్రాండ్ సక్సెస్. భారీ టీఆర్పీ ఈ సీజన్ రాబట్టింది. సామాన్యుడు పల్లవి ప్రశాంత్ విన్నర్ అయ్యాడు.

కాగా సీజన్ 8 కి మేకర్స్ ఏర్పాట్లు మొదలెట్టారట. ఇప్పటికే కంటెస్టెంట్స్ ఎంపిక దాదాపు పూర్తి కావచ్చిందని సమాచారం. బర్రెలక్క, సురేఖావాణి లేదా ఆమె కూతురు, నటి హేమ, రీతూ చౌదరి, బుల్లెట్ భాస్కర్, కిరాక్ ఆర్పీ, అమృత ప్రణయ్, కుమారీ ఆంటీ కంటెస్టెంట్స్ లిస్ట్ లో ఉన్నారనే ఊహాగానాలు వినిపిస్తున్నాయి. కాగా సెప్టెంబర్ మొదటివారం లేదా చివరి వారం బిగ్ బాస్ సీజన్ 8 ప్రారంభం అవుతుందని ప్రచారం జరిగింది.

మేకర్స్ అంత కంటే ముందే బిగ్ బాస్ 8 లాంచింగ్ ఎపిసోడ్ కి ప్లాన్ చేస్తున్నారట. ఆగస్టు 4 లేదా 11న లాంచింగ్ ఎపిసోడ్ ఉంటుందట. జులై నెలలో ప్రోమోలు వస్తాయట. మరోసారి కింగ్ నాగార్జున హోస్టింగ్ బాధత్యలు తీసుకోనున్నాడని సమాచారం. ఇది బిగ్ బాస్ లవర్స్ కి పండగ లాంటి న్యూస్ అనడంలో ఎలాంటి సందేహం లేదు. మరి ఇంకెందుకు నాన్ స్టాప్ ఎంటర్టైన్మెంట్ కోసం సిద్ధంగా ఉండండి.

Most Popular

student protests : విద్యార్థులు సంప్రదింపులు ప్రతిపక్షాలు బాయ్ కాట్ ఎందుకిలా?

student protests : దేశ రాజకీయాల్లో ప్రస్తుతం విద్యార్థుల ఆందోళనలు కొత్త మలుపు తిరిగాయి. ఒకవైపు విద్యార్థి ప్రతినిధులు కేంద్ర ప్రభుత్వంతో చర్చలకు సిద్ధమవుతుండగా, మరోవైపు ప్రతిపక్షాలు పార్లమెంట్‌ను బహిష్కరిస్తామని ప్రకటించడం ఆసక్తికరమైన...

Kallanai Dam: దేశంలో అతి పురాతనమైన డ్యామ్ ఎక్కడుందో తెలుసా.. దీనిని ఎలా నిర్మించారంటే..

Kallanai Dam: భారతదేశం వ్యవసాయ పంటలపై ఎక్కువగా ఆధారపడినందున.. ఇక్కడ నీటి నిల్వ చేయడం చాలా అవసరం. అలాగే ఈ నీటిని ఇతర ప్రాంతాలకు తరలించడానికి నీటి ప్రాజెక్టుల అవసరాన్ని పురాతన కాలంలోనే...

Godavari Pulasa: *‘పులస’ ఎందుకు దొరకడం లేదు.. గోదావరిలోకి ఎందుకు రావడం లేదు?*

Godavari Pulasa: చేపలందు.. ఓ చేప వేరయ్యా.. అదే మన గోదారి పులస. 'పుస్తెలమ్మి అయినా పులస తినాల్సిందే'.. అనే నానుడి గోదావరి జిల్లాలో ఉందంటే ఆ చేప ప్రత్యేకత అంతలా ఉంటుందన్నమాట....

Adani Group Airlines: ఎయిర్ లైన్స్ వ్యాపారంలోకి అదానీ గ్రూప్ ఎంట్రీ..

Adani Group Airlines: దేశీయ విమానయాన రంగంలో సరికొత్త పరిణామాలు చోటుచేసుకోనున్నాయి. ప్రముఖ వ్యాపారవేత్త గౌతం అదానీ నేతృత్వంలో ప్రధాని గ్రూప్ కొత్తగా విమానయాన సేవలోకి ప్రవేశించే అవకాశాలున్నట్లు తెలుస్తోంది. ఈ...

Srirastu Meaning: పెళ్లి పత్రికలో శ్రీరస్తు అని ఎందుకు రాస్తారు.. శ్రీ అనే అక్షరానికి ఎలాంటి ప్రాధాన్యత ఉంది..

Srirastu Meaning: సాధారణంగా లక్ష్మీదేవి పేరు రాసేటప్పుడు ముందు శ్రీ అని రాస్తారు. అలాగే వివాహ ఆహ్వాన పత్రికల్లో శ్రీరస్తు.. అని పేర్కొంటారు.. ఏదైనా శుభకార్యం చేసేటప్పుడు కూడా శ్రీ అని...
Oktelugu Epaper
Exit mobile version