Pandem Kollu: సంక్రాంతి వచ్చిందంటే ముందుగా గుర్తుకొచ్చేది కోడిపందాలు. గోదావరి జిల్లాలతో పాటు కోస్తాంధ్రలో కోడిపందాలు విరివిగా జరుగుతాయి. తెలుగు ప్రజల పెద్ద పండుగ కూడా సంక్రాంతి. మరో 10 రోజుల్లో సంక్రాంతి జరగనుండడంతో ఎప్పటినుంచే సందడి వాతావరణం ప్రారంభం అయ్యింది. వలస కూలీల రాక కూడా మొదలైంది. దీంతో పల్లెల్లో సందడి వాతావరణం నెలకొంది. ఏ బస్సు చూసినా.. ఏ రైలు చూసినా జనాలతో కిటకిటలాడుతున్నాయి. సంక్రాంతి లో ప్రతిదీ ప్రత్యేకమే. భోగి మంటలు, ముత్యాల ముగ్గులు, డుడూ బసవన్నలు, ఆటలు, హరిదాసు కీర్తనలు, ఆడపడుచుల సంబరాలు.. ఇలా ఒక్కటేంటి మొత్తం హంగామా ఉంటుంది. పండుగ అంటే ఇదే అనిపించేలా సందడి కనిపిస్తుంది. ఇవన్నీ ఒక ఎత్తు అయితే వీటికి మించి అన్నట్టుగా సాగుతాయి కోడిపందాలు. పండుగకు కొద్ది నెలల ముందు నుంచే కోడిపందాలకు సన్నద్ధం అవుతుంటారు.
* లక్షల్లో ఖర్చు
గోదావరి తో పాటు కోస్తాంధ్ర జిల్లాల్లో కోడి పందాలు ఎక్కువగా సాగుతుంటాయి. పందాలకు లక్షల్లో ఖర్చు అవుతుంది. కోళ్లను పందాలకు రెడీ చేయడానికి ఒక రోజుకు అయ్యే ఖర్చు తెలిస్తే ఆశ్చర్యానికి గురికావాల్సిందే. కోడిపందాలను చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకుంటారు. అంతేకాదు వాటి చుట్టూ ఎన్నో నమ్మకాలు, సెంటిమెంటులు కూడా ఉంటాయి. కోడిపందాలలో ప్రావీణ్యం ఉన్నవారు కుక్కట శాస్త్రాన్ని ఫాలో అవుతారు. పందెం వేసే రోజున నక్షత్రాన్ని బట్టి తారాబలం చూసి మరి బరిలో దించుతారు. కోడి రంగుతో పాటు జాతి, అన్ని విషయాల్లో జాగ్రత్తలు తీసుకుంటారు. పందెం బరిలో దిగిన రోజున ఏ రంగు తో ఉన్న పుంజును పందెంలోకి దించాలో ముందుగానే ఎంపిక చేసుకుంటారు. ముహూర్తాలను సైతం పరిగణలోకి తీసుకుంటారు. ఏ కోడి ఏ రోజు పందాలలో పాల్గొంటే విజయం సాధిస్తుందో లెక్కలు కడతారు.
* అదే స్థాయిలో సెంటిమెంటులు
భోగి రోజు… గౌడ నెమలికి చెందిన పుంజులు పందాలలో విజయం సాధిస్తాయట. 14న కాకి నెమలి పసి మగళ్ళ కాకి పుంజులు, కాకి డేగల కు చెందిన పుంజులు గెలుపు పొందుతాయన్నది ఒక నమ్మకం. సంక్రాంతి నాడు డేగలు, ఎర్ర కాకి బ్యాగులు పందెంలో విజయం సాధిస్తాయని ప్రావీణ్యం ఉన్నవారు చెబుతుంటారు. ప్రస్తుతం పందెం కోళ్లను ప్రతిరోజు ముగ్గురు చొప్పున సంరక్షిస్తున్నారు. మిలటరీ స్థాయిలో కోళ్లకు శిక్షణ ఇస్తుంటారు. ఆర్మీ ట్రైనింగ్ ఎంత కష్టంగా ఉంటుందో.. వీటి శిక్షణ కూడా అంతే మాదిరిగా ఉంటుంది.
* సంరక్షణలో సైతం జాగ్రత్తలు
పందెం కోళ్ల సంరక్షణలో కూడా చాలా రకాల జాగ్రత్తలు తీసుకుంటారు. ఉదయం ఐదు గంటలకు కోడిపుంజులను బయటకు తీసి కాసేపు చల్లటి గాలి శ్వాస తీసుకునేలా చేస్తారు. చుట్టూ భారీ వలయాన్ని ఏర్పాటు చేస్తారు. అందులో కోడిపుంజులను వదిలిపెట్టి పరిగెత్తిస్తారు. ఆ తరువాత వలయం నుంచి బయటకు తీసి స్విమ్మింగ్ చేయిస్తారు. పుంజులు అలసిపోకుండా పాలల్లో నానబెట్టిన బాదం పిస్తా, ఖర్జూరం, కిస్ మిస్ లను పెడతారు. చిరంజీవి ద్వారా పాలన పట్టిస్తారు. ఒక్కో పుంజుకు రోజుకు 500 రూపాయల వరకు ఖర్చు చేస్తారు. పందాలు అన్ని విధాలుగా తట్టుకునే విధంగా వాటిని తయారు చేస్తారు. పందాలలో పాల్గొనే పుంజులకు బలమైన ఆహారం ఇవ్వడంతో పాటు కొన్ని నెలల నుంచి ప్రత్యేక శిక్షణ ఇస్తారు. పూర్తిస్థాయిలో కోడిపుంజులు పందాలకు సిద్ధమైన తర్వాత… ఒక్కో పుంజు ధర లక్షల్లో పలుకుతుందని శిక్షకులు చెబుతున్నారు.