Nara Lokesh: తెలుగుదేశం పార్టీ శ్రేణులకు గుడ్ న్యూస్. కొత్త సంవత్సరం వేళ మంత్రి నారా లోకేష్ శుభవార్త చెప్పారు. పార్టీ కోసం క్షేత్రస్థాయిలో పనిచేస్తున్న కోటి మంది కార్యకర్తలకు మేలు జరిగే నిర్ణయం తీసుకున్నారు. తెలుగుదేశం పార్టీకి క్యాడర్ కీలకం. ఆ పార్టీ నాలుగు దశాబ్దాల పాటు కొనసాగిందంటే అందుకు పార్టీ శ్రేణులే కారణం. అధికారంలో ఉన్నా.. లేకున్నా పార్టీ కోసం పనిచేసే కార్యకర్తలు టిడిపికి సొంతం. అటువంటి కార్యకర్తల రుణం తీర్చుకోవాలని భావించారు లోకేష్. కొత్త సంవత్సరం వేళ.. బంపర్ ఆఫర్ ప్రకటించారు. ప్రస్తుతం టిడిపి సభ్యత్వ నమోదు ప్రక్రియ చురుగ్గా సాగుతోంది. ఈ నేపథ్యంలో పార్టీలోని కోటి మంది కార్యకర్తలకు ప్రమాద బీమా సౌకర్యం కల్పించేలా నారా లోకేష్ ఇన్సూరెన్స్ కంపెనీ తో అవగాహన ఒప్పందం కుదుర్చుకున్నారు.
* రికార్డ్ స్థాయిలో సభ్యత్వ నమోదు
అక్టోబర్ 26న రాష్ట్రవ్యాప్తంగా అన్ని నియోజకవర్గాల్లో టిడిపి సభ్యత్వ నమోదు ప్రారంభం అయ్యింది. ప్రస్తుతం 95 లక్షల సభ్యత్వాలు నమోదయ్యాయి. ప్రజల నుంచి వచ్చిన వినతుల మేరకు ఈనెల 15 వరకు సభ్యత్వానికి అవకాశం ఇచ్చారు. కోటి సభ్యత్వాల నమోదు దాటుతుందని భావిస్తున్నారు. అయితే ఇలా సభ్యత్వ నమోదు చేసుకున్న ప్రతి ఒక్కరికి ప్రమాద బీమా వర్తించేలా ఏర్పాటు చేశారు నారా లోకేష్. యునైటెడ్ ఇండియా ఇన్సూరెన్స్, ప్రాగ్మ్యాటిక్ ఇన్సూరెన్స్ బ్రోకింగ్ ప్రతినిధులతో ఒప్పందంపై సంతకాలు చేశారు. కోటి మంది కార్యకర్తల కోసం ఒకేసారి ఇన్సూరెన్స్ సౌకర్యం కల్పించడం రాజకీయ పార్టీల చరిత్రలోనే ఇదే ప్రథమం. ఈ ఒప్పందం ఈ ఏడాది మొత్తం వర్తించబోతుంది. కార్యకర్తల ప్రమాద బీమా కోసం తెలుగుదేశం పార్టీ 42 కోట్ల రూపాయలు చెల్లించింది. వచ్చే ఏడాది సైతం ప్రీమియం సొమ్మును చెల్లించేందుకు సన్నాహాలు చేస్తోంది.
* రూ. 138 కోట్లు ఖర్చు
ఈ బీమాతో ఎంతో ప్రయోజనం కలగనుంది. ఎవరైనా ప్రమాదాల బారిన పడితే ఆ కార్యకర్తల కుటుంబాలకు 5 లక్షల వరకు ప్రమాద బీమా సొమ్ము లభిస్తుంది. తాజాగా ఈ 42 కోట్లతో కలుపుకొని నారా లోకేష్ ఇప్పటివరకు పార్టీ శ్రేణుల కోసం చేసిన ఖర్చు అక్షరాల 138 కోట్లు. గత ఐదేళ్ల వైసిపి హయాంలో వివిధ ప్రమాదాల్లో దెబ్బతిన్న టిడిపి కార్యకర్తలను ఆదుకునేందుకు మంగళగిరిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో ఓ ప్రత్యేక సెల్ కూడా ఏర్పాటు చేశారు. చనిపోయిన కార్యకర్తల పిల్లల కోసం హైదరాబాద్ తో పాటు కృష్ణాజిల్లాలో ఎన్టీఆర్ ట్రస్ట్ తరఫున రెసిడెన్షియల్ స్కూల్ సైతం నడుపుతున్నారు. మొత్తానికి అయితే పార్టీ క్యాడర్ కోసం చిన్న బాస్ లోకేష్ చేస్తున్న ప్రయత్నాలు సత్ఫలితాలను ఇస్తున్నాయి.