Indiramma Houses: తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఇచ్చిన హామీల్లో భాగంగా ఇందిరమ్మ ఇళ్ళను నిర్మించాలని నిర్ణయించింది. ఇందులో భాగంగా ఇప్పటికే గ్రామాల్లో ఇందిరమ్మ పథకం కింద ఇళ్లను నిర్మిస్తూ ఉంది. అర్హులైన వారికి రూ. 5 లక్షల రూపాయలు అందించి ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణానికి తోడ్పాటు అందిస్తోంది. అయితే ఇప్పటివరకు గ్రామాల్లోనే ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణానికి అవకాశం ఇచ్చారు. ఇకనుంచి పట్టణ ప్రాంతాల్లోనూ ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణానికి కూడా కృషి చేస్తామని సంబంధిత శాఖామంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి తాజాగా ప్రకటించారు. ఇప్పటికే తొలి విడతలో నాలుగు లక్షల ఇందిరమ్మ ఇళ్ళను పంపిణీ చేశామని.. రెండో విడత ఇందిరమ్మ ఇండ్లను ఏప్రిల్ నుంచి పంపిణీ చేస్తామని అన్నారు.
వచ్చే మూడేళ్లలో పట్టణ ప్రాంతాల్లో కూడా ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణం ఉంటుందని అన్నారు. ఇందిరమ్మ ఇండ్ల పంపిణీ నిరంతర ప్రక్రియ అని.. అర్హులైన వారికి ఇందిరమ్మ ఇల్లు ఇచ్చు తీరుతామని ఆయన అన్నారు. నిరుపేదలందరికీ ఇల్లు నిర్మించాలని కాంగ్రెస్ ప్రభుత్వ ధ్యేయమని అన్నారు. సందీప్ లేని వారికి ఇందిరమ్మ ఇల్లు కచ్చితంగా కేటాయిస్తామని చెప్పారు. కాంగ్రెస్ పార్టీ తెలంగాణలో అధికారంలోకి వచ్చిన తర్వాత అనేక సంక్షేమ కార్యక్రమాలు చేపట్టిందని.. ఇందులో ఇప్పటికే అనేక పథకాలను అమలు చేస్తోందని అన్నారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీలన్నింటినీ ఒక్కొక్కటి పూర్తి చేస్తోందని పేర్కొంటున్నారు. వీటిలో ఇందిరమ్మ ఇల్లు అనేది తప్పనిసరిగా ప్రభుత్వం చేపడుతుందని అన్నారు. ఇవే కాకుండా రాబోయే రోజుల్లో మరిన్ని సంక్షేమ కార్యక్రమాలు చేపట్టే అవకాశం ఉందని అన్నారు.
ఇప్పటివరకు గ్రామాల్లో నిర్మించిన ఇల్లు 60 గజాల్లో ఒక ఫ్లోర్ మాత్రమే నిర్మించారని.. అయితే వచ్చే పట్టణ ప్రాంతాల్లో ఇళ్ల నిర్మాణానికి జి ప్లస్ త్రీ, జి ప్లస్ ఫోర్ విధానంలో ప్రణాళికలు రూపొందిస్తున్నామని మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి అన్నారు. కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చే ఆర్థిక సహాయం నేరుగా లబ్ధిదారుల బ్యాంకు ఖాతాలోని జమ అవుతుందని.. ఇందులో ఎలాంటి అక్రమాలు లేవని అన్నారు. ఒకవేళ ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణాల్లో అక్రమాలు జరిగితే వెంటనే చర్యలు తీసుకుంటామని ఆయన హెచ్చరించారు.
ఇప్పటివరకు గ్రామాల్లో దాదాపు ఇందిరమ్మ ఇండ్లు పూర్తి అయ్యాయి. కొందరు ఇప్పటికే గృహప్రవేశం చేసి ఇందిరమ్మ ఇంట్లోనే జీవనం కొనసాగిస్తున్నారు. అయితే దరఖాస్తు చేసుకున్న వారికి సైతం అధికారులు సర్వే చేసి అర్హులైన వారికి ఇందిరమ్మ ఇండ్లు కేటాయిస్తున్నారు. ఇందిరమ్మ ఇల్లు నిర్మించుకునే వారికి సైతం బ్యాంకు ఖాతాలో డబ్బులు వెంట వెంటనే జమ అవుతుందని తెలుపుతున్నారు. అయితే పట్టణ ప్రాంత వాసులు సైతం తమకు ఇందిరా మా ఇంట్లో కేటాయించాలని కోరుతున్నారు. ఇప్పటికే ఇందిరమ్మ ఇండ్ల కోసం చాలామంది దరఖాస్తు చేసుకున్నారు.