Nara Lokesh With Pawan Kalyan: ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ విషయంలో సోదర భావంతో ఉంటారు మంత్రి నారా లోకేష్. తన కుటుంబంతో పాటు తెలుగుదేశం పార్టీ కష్ట కాలంలో ఉండగా అండగా నిలిచారు పవన్. అందుకే లోకేష్ పవన్ కళ్యాణ్ విషయంలో కృతజ్ఞతా భావంతోనే మెలుగుతారు. ఇది పలు సందర్భాల్లో చూశాం కూడా. ఏపీ మంత్రివర్గ ప్రమాణ స్వీకారం సమయంలో ఏకంగా పవన్ కళ్యాణ్ కు పాదాభివందనం చేశారు లోకేష్. వద్దని వారించినా ఆయన వినలేదు. పవన్ కాలిని తాకి ఆశీర్వచనం తీసుకున్నారు. అప్పట్లో ఈ ఘటన వైరల్ గా మారింది. విమర్శకుల నోరును సైతం మూయించింది. తాజాగా అటువంటి వీడియో ఒకటి వైరల్ అవుతోంది. ఎయిర్పోర్టులో పరస్పరం ఎదురుపడిన పవన్, లోకేష్ ఆత్మీయ ఆలింగనం వీడియో ఒకటి సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. బంధం అంటే ఇది కదా అని ట్యాగ్ జత చేసి సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టారు.
* ఆత్మీయ ఆలింగనం
తాజాగా గన్నవరం ఎయిర్పోర్ట్ లో పవన్ కళ్యాణ్, మంత్రి లోకేష్ ఎదురుపడ్డారు. ఈ క్రమంలో ఇద్దరు నేతలు పరస్పరం నమస్కారం చేసుకున్నారు. ఆత్మీయ ఆలింగనం చేసుకున్నారు. మొదటినుంచి పవన్ విషయంలో లోకేష్ గౌరవభావం గానే మెలుగుతున్నారు. గత ఏడాది చంద్రబాబు అరెస్ట్ సమయంలో నేరుగా రాజమండ్రి సెంట్రల్ జైలుకు వచ్చి పరామర్శించారు పవన్. వెంటనే బయటకు వచ్చి తెలుగుదేశం పార్టీతో పొత్తు పెట్టుకుంటున్నట్లు ప్రకటించారు. తానే కాదు బిజెపిని సైతం కూటమిలోకి తెస్తానని కూడా పవన్ తేల్చి చెప్పారు. అన్నట్టుగానే ఎన్ని రకాల ఇబ్బందులు వచ్చినా పట్టించుకోలేదు. బిజెపిని తెచ్చి కూటమి కట్టారు. ఏపీలో అధికారంలోకి రావడానికి కారణమయ్యారు. అందుకే పవన్ విషయంలో చంద్రబాబుతో పాటు లోకేష్ ఒక రకమైన భావనతో నడుచుకుంటున్నారు.
* ఆ విశ్లేషణల నేపథ్యంలో
వాస్తవానికి లోకేష్ విషయంలో జనసేనకు అనేక రకాల అభ్యంతరాలు ఉన్నట్లు విశ్లేషణలు వచ్చాయి. భవిష్యత్తులో పవన్ కళ్యాణ్ కు లోకేష్ అడ్డంకిగా మారుతారని కూడా ప్రచారం నడిచింది. లోకేష్ విషయంలో పవన్ సైతం ఒక రకమైన అభిప్రాయంతో ఉన్నారని కూడా టాక్ నడిచింది. కానీ ఆ ఇద్దరు నేతలు ఎప్పుడూ పట్టించుకోలేదు. ఎటువంటి అరమరికలు లేకుండా వారు గడుపుతున్నారు. పరస్పరం గౌరవించుకుంటున్నారు. గన్నవరం ఎయిర్పోర్ట్ లో ఇద్దరు నేతల కలయికకు సంబంధించిన వీడియో ఇప్పుడు ట్రెండింగ్ గా మారింది. వీడియో ఆఫ్ ది డే గా నిలుస్తోంది.
డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తో మంత్రి నారా లోకేష్..
అమెరికా పర్యటన ముగించుకుని ఢిల్లీ నుంచి ప్రత్యేక విమానంలో గన్నవరం ఎయిర్ పోర్టుకు చేరుకున్న లోకేష్
అదే సమయంలో హైదరాబాద్ నుంచి ప్రత్యేక విమానంలో గన్నవరం విమానాశ్రయానికి చేరుకున్న డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్
ఎయిర్ పోర్టులోనే న్యూ… pic.twitter.com/z3QXLf12zL
— BIG TV Breaking News (@bigtvtelugu) January 2, 2025