‘అనంత’పై మైక్రోసాఫ్ట్ సీఈవో భార్య ఔదార్యం.. రైతులకు వరం

  కరోనా ఎఫెక్ట్ తో దేశంలో లాక్డౌన్ విధించారు. దీంతో పరిస్థితులన్నీ తలకిందులయ్యాయి. లాక్డౌన్ తో అన్నివర్గాల ప్రజలు ఇబ్బందులు గురయ్యారు. ముఖ్యంగా రైతులు, వలస కార్మికులు, ఉద్యోగులు, ప్రయాణికులు తీవ్రంగా అవస్థలు పడాల్సి వచ్చింది. ప్రస్తుతం కేంద్రం ఆన్ లాక్ నిబంధనలు అమలు చేస్తున్న చేస్తుంది. అయితే అమెరికాలో స్థిరపడిన అనుపమ అనంతపురం రైతులపై ‘అనంత’ దాతృత్వం చూపారు. దీంతో ఆమె గురించి తెలుసుకునేందుకు ప్రతీఒక్కరు ఆసక్తి చూపుతున్నారు. Also Read : బాబుకు వయసు […]

Written By: NARESH, Updated On : September 15, 2020 11:53 am

anupama

Follow us on

 

కరోనా ఎఫెక్ట్ తో దేశంలో లాక్డౌన్ విధించారు. దీంతో పరిస్థితులన్నీ తలకిందులయ్యాయి. లాక్డౌన్ తో అన్నివర్గాల ప్రజలు ఇబ్బందులు గురయ్యారు. ముఖ్యంగా రైతులు, వలస కార్మికులు, ఉద్యోగులు, ప్రయాణికులు తీవ్రంగా అవస్థలు పడాల్సి వచ్చింది. ప్రస్తుతం కేంద్రం ఆన్ లాక్ నిబంధనలు అమలు చేస్తున్న చేస్తుంది. అయితే అమెరికాలో స్థిరపడిన అనుపమ అనంతపురం రైతులపై ‘అనంత’ దాతృత్వం చూపారు. దీంతో ఆమె గురించి తెలుసుకునేందుకు ప్రతీఒక్కరు ఆసక్తి చూపుతున్నారు.

Also Read : బాబుకు వయసు బెంగ పట్టుకుందట..?

ప్రముఖ సాప్ట్ వేర్ సంస్థ అధిపతి సత్య నాదెళ్లకు గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. తెలుగోడి సత్తాను ప్రపంచానికి సత్యనాదెళ్ల చూపించారు. అమెరికాకు చెందిన మైక్రోసాఫ్ట్ సంస్థకే అధిపతి అయ్యారు. ఆయన భార్య అనుపమకు కూడా తెలుగు నేలతో మంచి సంబంధం ఉంది. అనుపమ తండ్రితోపాటు సత్యనాదెళ్ల తండ్రి ఇద్దరు కూడా ఐఏఎస్ అధికారులుగా పని చేశారు. అనుపమ తండ్రి ఏపీలోని పలు జిల్లాలకు కలెక్టర్ గా పని చేశారు. దీంతో ఆమె కూడా ఇక్కడి పల్లెల వాతావరణం.. రైతుల పరిస్థితిని పూర్తిగా అవగాహన చేసుకున్నారు.

సత్యనాదెళ్ల దంపతులు అమెరికాలో స్థిరపడ్డారు. అయినప్పటికీ ఇక్కడి వాళ్లతో సత్ససంబంధాలు కొనసాగిస్తున్నారు. ఎప్పటికప్పుడు ఇక్కడి విషయాలను తెలుసుకుంటున్నారు. ఈక్రమంలో లాక్డౌన్లో రైతులు పడుతున్న ఇబ్బంది గురించి అనుపమ తెలుసుకొని చలించిపోయారు. రాయలసీమలో కరువు జిల్లాగా పేరొందిన అనంతపురం జిల్లా రైతులను ఆదుకునేందుకు తనవంతు సాయంగా రూ.2కోట్ల సాయం అందించి దాతృత్వాన్ని చాటుకున్నారు.

రైతుల సంక్షేమం కోసం పని చేస్తున్న అనంతపురం యాక్షన్ ప్రేటార్నా ఎకాలజీ సెంటర్ కు అనుపమ రూ.2కోట్ల విరాళాన్ని పంపించారు. ఈ సాయంపై జిల్లా కలెక్టర్ గంధం చంద్రుడు, ప్రేటార్నా ఎకాలజీ సెంటర్ డైరెక్టర్ వైవీ మల్లారెడ్డిలు హర్షం వ్యక్తం చేశారు. ఈ నిధులతో రైతులకు ఉపాధి కల్పించేందుకు ప్రణాళికలను చేస్తున్నట్లు తెలిపారు. సత్యనాదెళ్ల సొంత జిల్లా అనంతపురం రైతులను ఆదుకునేందుకు ఆయన భార్య అనుపమ ముందుకు రావడంపై పలువురు హర్షం వ్యక్తం చేశారు.

Also Read : బీజేపీకి వైసీపీ పాహిమాం.. ఎదురించుట లేదు