MGNREGA : ప్రజల బ్యాంకు ఖాతాల్లో ఈ డబ్బులు జమ అవుతున్నాయి. ఆ డబ్బులు మీ అకౌంట్ లో పడ్డాయో లేదో చెక్ చేసుకోండి. కేంద్ర ప్రభుత్వం తాజాగా ఉపాధి కూలీలకు ఒక శుభవార్త తెలిపింది. మండుతున్న ఎండను సైతం లెక్కచేయకుండా కష్టపడుతున్న ఉపాధి కూలీలకు నెలల తరబడి పేరుకుపోయి ఉన్నా బకాయిలను విడుదల చేస్తూ కేంద్ర ప్రభుత్వం ఇటీవల ఉత్తర్వులను జారీ చేసింది. ఈ క్రమంలో ఉపాధి కూలీల బ్యాంకు ఖాతాల్లో ఈ నగదు జమ కానున్నట్లు కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. అనకాపల్లి జిల్లాలోని కూలీలు ఎక్కువగా ఉపాధి హామీ పనికి వెళ్తున్నారు. మొత్తం 24 మండలాల పరిధిలో 3.13 లక్షల మంది కూలీలు ఈ పనికి వెళ్తున్నారు. అయితే వీళ్ళందరూ కేంద్ర ప్రభుత్వం నిధులను మంజూరు చేయనప్పటికీ కూడా ప్రతిరోజు పనికి వెళ్తూ వస్తున్నారు. ఉపాధి పనికి గాను వీళ్ళకు వారానికి ఒకసారి డబ్బులు చెల్లిస్తారు. ప్రతి ఏడాది ఆర్థిక సంవత్సరం ముగింపులో భాగంగా వీళ్లకు వేతనాల చెల్లింపులు ఆలస్యం అవుతూ వస్తాయి. ఈసారి కేంద్ర ప్రభుత్వం 12 వారాలుగా వీళ్ళకు డబ్బులు చెల్లించలేదు. ఈ క్రమంలో ఉపాధికి వెళ్లే కూలీలు తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొన్నారు.
Also Read : గ్రామీణ డాక్ సేవక్ ఫలితాలు.. రెండో జాబితా విడుదల
వీళ్ళందరూ ఎప్పటికప్పుడు తమ కూలీ డబ్బులను విడుదల చేయమంటూ కేంద్ర మరియు రాష్ట్ర ప్రభుత్వాలకు నివేదనలు కూడా సమర్పించారు. అయితే కూలీలందరూ ఫీల్డ్ ఆఫీసర్లు వచ్చి హాజరు వేసి వెళ్లడం తప్ప తమకు డబ్బులు రావడం లేదు అంటూ తమ ఆవేదనను ప్రభుత్వానికి వ్యక్తం చేశారు. రాష్ట్ర ప్రభుత్వం చొరవ తీసుకోవడంతో ఉపాధి కూలీలకు కేంద్ర ప్రభుత్వం బకాయిలను విడుదల చేసింది. ఈ మేరకు అనకాపల్లి జిల్లాలో ఉన్న సుమారు 80,000 మందికి రూ. 59 కోట్ల బకాయిలను కేంద్ర ప్రభుత్వం చెల్లించాల్సి ఉంది. ఉపాధి కూలీలు తమ ఖాతాలలో ప్రభుత్వం నగదు జమ చేయనప్పటికీ కూడా చెరువులు అభివృద్ధి చేయడం, కందకాల తవ్వకాలు అలాగే నీటి కుంటల పనులను కూడా ప్రతిరోజు చేస్తున్నారు.
ఈ వేసవిలో ఎండ తీవ్రత ఎక్కువగా ఉన్నా కూడా వాళ్ళందరూ ప్రతిరోజు కష్టపడుతున్నారు. ఏప్రిల్ ముందు వరకు ఉపాధి కూలీలకు ఒక్కొక్కరికి రోజుకు రూ.300 వేతనం చెల్లించేవారు. తాజాగా కేంద్ర ప్రభుత్వం ఈ వేసవి ఎండలను దృష్టిలో పెట్టుకొని వారికి ఒక్కొక్కరికి రూ.307 కు పెంచింది. ఉపాధి కూలీలు ప్రతిరోజూ ఎక్కువగా మాకవరపాలెం, గోలుకొండ, నాతవరం, రోలుగుంట, వి మాడుగుల, చోడవరం, కొటావురట్ల, రావికా మతం, బుచ్చయ్యపేట, కసింకోట తదితర ప్రాంతాలలో ఉపాధి పనులకు వెళ్తున్నారు.
Also Read : వందల మంది పని AI చేస్తోంది.. ఎవరికీ గ్యారెంటీ లేదు..