Tollywood Heroine : కొంతమంది హీరోయిన్లు పెళ్లి చేసుకుని సెటిల్ అయిపోతే మరికొంతమంది వ్యాపారంలో బిజీగా గడుపుతున్నారు. అందం అభినయం ఉండి కూడా సినిమాలకు దూరంగా ఉంటున్న వాళ్ళు చాలామంది ఉన్నారు. ప్రస్తుతం వైరల్ అవుతున్న ఈ ఫోటోలో ఉన్న హీరోయిన్ ఒకప్పుడు సినిమా ఇండస్ట్రీలో విపరీతమైన క్రేజ్ సొంతం చేసుకుంది. సినిమా ఇండస్ట్రీలో ఒకప్పటి చాలా మంది హీరోయిన్లు ప్రస్తుతం సినిమాలను తగ్గించారు. మనం చెప్పుకోబోయే హీరోయిన్ కూడా ఈ జాబితాకు చెందిందే. ఒకప్పుడు ఈమెకు తెలుగులో ఫాలోయింగ్ ఎక్కువగా ఉండేది. అలాగే అవకాశాలు కూడా ఎక్కువగానే వచ్చేవి. కానీ ఎవరు ఊహించని విధంగా ఈమె సినిమాలకు దూరంగా ఉంటుంది. దీంతో ఈమె అభిమానులు తెగ ఫీల్ అవుతున్నారు. ఇంత అందం ఉండి కూడా ఎందుకు ఈమె హీరోయిన్గా చేయడం లేదు అంటూ అభిమానులు తెగ ఆలోచిస్తున్నారు. ఈమె పెళ్లి కూడా చేసుకోలేదు అలాగే వేరే వ్యాపారంలో కూడా అడుగు పెట్టలేదు. అయినా కూడా హీరోయిన్ గా సినిమాలలో కనిపించడం లేదు.
Also Read : సినిమాలు మానేసి ఇన్నేళ్లు అవుతున్న తగ్గని క్రేజ్.. ఈ హీరోయిన్ ఎవరో చెప్పగలరా..
ఈ హీరోయిన్ ఛార్మి కౌర్. హీరోయిన్ ఛార్మి గురించి తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. తెలుగులో ఈమె ఎన్నో సూపర్ హిట్ సినిమాలలో నటించి తనకంటూ ప్రత్యేక గుర్తింపును తెచ్చుకుంది. తెలుగులో చార్మి మాస్, లక్ష్మి, స్టైల్, మంత్ర, జ్యోతిలక్ష్మి ఇలా ఎన్నో సూపర్ హిట్ సినిమాలలో నటించి తెలుగు ప్రేక్షకులను మెప్పించింది. తన నటనపరంగా అలాగే గ్లామర్ పరంగా మంచి ప్రశంసలు అందుకుంది. హీరోయిన్ గా వరుస అవకాశాలతో కెరియర్ పీక్స్ లో ఉన్న సమయంలోనే ఛార్మి నటనకు గుడ్ బై చెప్పేసింది. ప్రస్తుతం నిర్మాతగా మారి సినిమాలు చేస్తుంది. ఈ పంజాబీ భామ తెలుగు డైనమిక్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ కలిసి నిర్మాతగా పార్ట్నర్షిప్ మొదలుపెట్టింది. ఇప్పటివరకు చార్మి పూరి జగన్నాథ్ తో కలిసి ఎనిమిది చిత్రాలను నిర్మించింది. ఇక వాటిలో జ్యోతిలక్ష్మి, ఈ స్మార్ట్ శంకర్ సినిమాలు మాత్రమే బాక్సాఫీస్ దగ్గర విజయం సాధించాయి.
అయితే ఒక ఇంటర్వ్యూలో హీరోయిన్ ఛార్మి గురించి కృష్ణవంశీ పలు ఆసక్తికరమైన విషయాలను అభిమానులతో పంచుకున్నారు. హీరోయిన్ ఛార్మి చాలా డెడికేషన్ గా పనిచేస్తుందని, చార్మి అద్భుతమైన నటి అందులో తిరువలేదు అని చెప్పుకొచ్చారు. కానీ ఆమె ఎందుకు అంతగా సక్సెస్ కాలేదో అర్థం కావడం లేదు అంటూ అది పూర్తిగా బ్యాడ్ లక్ అంటూ ఆయన చెప్పుకొచ్చారు. సార్ మీ డెడికేషన్ లెవెల్స్ ఎప్పుడు సూపర్ గా ఉంటాయి. సినిమా కోసం ఎంతైనా కష్టపడుతుంది. దెబ్బలు తగిలి తనకు రక్తం వస్తున్నా కూడా పట్టించుకోకుండా నటిస్తుంది. శ్రీ ఆంజనేయం, చక్రం సినిమాలలో చార్మి నటిస్తున్న సమయంలో కొన్నిసార్లు అలా కూడా జరిగింది అంటూ కృష్ణవంశీ ఆమె గురించి తెలిపారు.