Ajith : కేవలం సినిమాల పరంగా మాత్రమే కాదు, కార్ రేసింగ్ లో కూడా తమిళ హీరో అజిత్ కుమార్(Thala Ajith Kumar) ఎన్నో సెన్సేషనల్ రికార్డ్స్ ని నెలకొల్పుతూ మన దేశ ప్రతిష్టని ప్రపంచం మొత్తానికి చాటి చెప్తున్నాడు. ఇప్పటికే దుబాయి లో జరిగిన రేసింగ్ లో మూడవ స్థానం లో నిల్చి చరిత్ర సృష్టించిన అజిత్ ఖాతాలో మరో అరుదైన ఘనత చేరింది. బెల్జియమ్ లో నిర్వహించిన స్పా – ఫ్రాన్ కోర్ ఛాంప్స్ సిర్క్యూట్ లో జరిగిన కార్ రేసింగ్ లో అజిత్ టీం రెండవ స్థానంలో నిల్చింది. ఈ విషయాన్ని సోషల్ మీడియా వేదికగా అజిత్ టీం అభిమానులతో పంచుకుంది. దీంతో అజిత్ అభిమానులు సంబరాలు చేసుకుంటున్నారు. సినిమాలు అయినా, స్పోర్ట్స్ అయినా మా అజిత్ కి సాటి వచ్చేవాళ్ళు ఎవ్వరూ లేరు అంటూ సోషల్ మీడియా లో అజిత్ ఫ్యాన్స్ గర్వంగా చెప్పుకుంటున్నారు.
Also Read : మరోసారి పల్టీలు కొట్టిన హీరో అజిత్ కార్..వణుకుపుట్టిస్తున్న విజువల్స్!
ఈ సందర్భంగా అజిత్ తో రీసెంట్ గానే ‘గుడ్ బ్యాక్ అగ్లీ’ వంటి సెన్సేషనల్ బ్లాక్ బస్టర్ ని తీసిన మైత్రీ మూవీ మేకర్స్ సంస్థ అజిత్ కి శుభాకాంక్షలు తెలియజేసింది. అదే విధంగా పలువురు టాలీవుడ్, కోలీవుడ్ టాప్ సెలబ్రిటీలు కూడా అజిత్ శుభాకాంక్షలు తెలియజేసారు. ఇదంతా పక్కన పెడితే అజిత్ ఈమధ్య కాలంలో కార్ రేసింగ్ చేస్తున్న సమయంలోనే ప్రమాదానికి గురైన సంఘటనలు మనం చాలానే చూసాము. ఒకసారి కాదు, రెండు సార్లు కాదు, ఏకంగా నాలుగు సార్లు ఆయన ప్రమాదానికి గురయ్యాడు. కానీ కోట్లాది మంది అభిమానులు ఆశీస్సులతో చిన్న గాయం కూడా జరగకుండా సురక్షితంగా బయటపడ్డాడు అజిత్. ఇది ఆయన అభిమానులకు ఎంతో సంతోషాన్ని కలిగించే విషయం. అదే సమయంలో భయానికి కూడా గురి చేసే విషయం. కానీ సాహసమే ఊపిరి గా సాగిపోయే అజిత్ లాంటి లెజెండ్స్ కి ఎలాంటి ప్రమాదం కూడా ప్రాణహాని తలపెట్టవు అని అంటున్నారు మరికొంతమంది అభిమానులు.
ఇకపోతే రెండు నెలల క్రితమే ‘విడాముయార్చి’ చిత్రం తో ఆడియన్స్ ముందుకొచ్చి తీవ్రంగా నిరాశపర్చిన అజిత్, రీసెంట్ గా ‘గుడ్ బ్యాడ్ అగ్లీ'(Good Bad Ugly) చిత్రం తో భారీ బ్లాక్ బస్టర్ హిట్ ని అందుకొని మరోసారి తన బాక్స్ ఆఫీస్ సత్తా ఎలాంటిదో అందరికీ అర్థం అయ్యేలా చేసాడు. రీసెంట్ గానే 200 కోట్ల రూపాయిల గ్రాస్ మార్కుని దాటిన ఈ చిత్రం, 300 కోట్ల రూపాయిల గ్రాస్ వసూళ్ల వైపు పరుగులు తీస్తుంది. కేవలం అభిమానుల కోసం తీసిన సినిమాతో ఇంత పెద్ద బ్లాక్ బస్టర్ హిట్ కొట్టడం అనేది అందరికీ సాధ్యమయ్యే విషయం కాదు. కేవలం అజిత్ లాంటి సూపర్ స్టార్స్ మాత్రమే ఇలాంటి అద్భుతాలను క్రియేట్ చేయగలరు. ఆయన తదుపరి చిత్రమ్ ఎవరితో చేయబోతున్నారు అనే దానిపై ఇంకా క్లారిటీ రాలేదు కానీ, ‘గుడ్ బ్యాడ్ అగ్లీ’ డైరెక్టర్ తోనే సినిమా చేస్తాడని టాక్ నడుస్తుంది.
Also Read : నెలకు 15 కోట్లు..5వ తేదీ దాటితే నిర్మాతలకు చుక్కలే అంటున్న అజిత్!