Homeఆంధ్రప్రదేశ్‌Matsyakara Bharosa Scheme: ఏపీలో మరో ఎన్నికల హామీ అమలు.. ముహూర్తం రేపే!

Matsyakara Bharosa Scheme: ఏపీలో మరో ఎన్నికల హామీ అమలు.. ముహూర్తం రేపే!

Matsyakara Bharosa Scheme: ఏపీలో( Andhra Pradesh) కూటమి ప్రభుత్వం మరో హామీ అమలుకు రంగం సిద్ధం చేసింది. మత్స్యకారులకు 20వేల ఆర్థిక సాయం అందించనుంది. వేట నిషేధ సమయంలో ప్రభుత్వపరంగా మత్స్యకారులకు భృతి అందిస్తున్న సంగతి తెలిసిందే. రేపు రాష్ట్రవ్యాప్తంగా ఉన్న మత్స్యకారుల ఖాతాల్లో 20వేల రూపాయల చొప్పున ప్రభుత్వం నగదు జమ చేయనుంది. సీఎం చంద్రబాబు శ్రీకాకుళం జిల్లా ఎచ్చెర్ల నియోజకవర్గంలో పర్యటించనున్నారు. మత్స్యకార భరోసా పథకాన్ని లాంఛనంగా ప్రారంభించనున్నారు. గత ప్రభుత్వం పదివేల రూపాయల చొప్పున భృతి అందించగా.. టిడిపి కూటమి ప్రభుత్వం దానిని రెట్టింపు చేస్తూ.. రూ.20,000 అందించేందుకు సిద్ధపడింది. నిజంగా మత్స్యకారులకు ఇది శుభవార్త.

Also Read: వైఎస్ఆర్ కాంగ్రెస్ లోకి కేశినేని నాని.. జగన్ బిగ్ ఆఫర్!

* రెండు నెలలపాటు చేపల వేట నిషేధం
ఏటా ఏప్రిల్ 15 అర్ధరాత్రి నుంచి జూన్ 14 వరకు సముద్రంలో చేపల వేట( Fish Hunting ) నిషేధం. ఆ సమయంలో చేపలు వృద్ధి చెందుతాయి. అది చేపల ఉత్పత్తి సమయం కావడంతో మరపడవలతో చేపల వేట నిషేధం. అయితే రెండు నెలల పాటు జీవనోపాధికి మత్స్యకారులు దూరమవుతారు. ఆ సమయంలో వారికి ఎటువంటి ఉపాధి ఉండదు. అందుకే ప్రభుత్వం మత్స్యకార భరోసా అందిస్తూ వస్తోంది. గత ఐదేళ్ల వైయస్సార్ కాంగ్రెస్ పాలనలో ఏటా పదివేల రూపాయల చొప్పున భృతి అందిస్తూ వచ్చారు. దానిని ఇప్పుడు రెట్టింపు చేసి అందించనున్నారు. రేపు మత్స్యకార భరోసా కింద 20 వేల రూపాయల చొప్పున లబ్ధిదారుల బ్యాంక్ అకౌంట్లో జమ చేయనున్నారు.

* సీఎం పర్యటనకు ఏర్పాట్లు..
సీఎం శ్రీకాకుళం జిల్లా( Srikakulam district) పర్యటనకు సంబంధించి అన్ని ఏర్పాటు చేస్తున్నారు అధికారులు. ఎచ్చెర్ల నియోజకవర్గంలోని బుడగట్లపాలెం నుంచి మత్స్యకార భరోసా నిధులు విడుదల చేయనున్నారు సీఎం చంద్రబాబు. అమరావతి నుంచి విశాఖపట్నం మీదుగా బుడగట్లపాలెం వెళ్ళనున్నారు. లబ్ధిదారులకు సాయం అందించిన తరువాత వారితో ముఖాముఖి నిర్వహించనున్నారు. సాయంత్రానికి తిరిగి అమరావతికి చేరుకుంటారు. మరోవైపు మత్స్యకార భరోసా సాయం విడుదలపై మత్స్యకారులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.

* ఆ ఆలోచన టిడిపి ప్రభుత్వానిదే..
అయితే వేట నిషేధ సమయంలో భృతి అందించాలన్న ఆలోచన తెలుగుదేశం ప్రభుత్వానిదే( Telugu Desam government). గతంలో వేట నిషేధ సమయానికి రేషన్ అందించేవారు. 2014లో టిడిపి అధికారంలోకి వచ్చిన తర్వాత నగదు మొత్తం ఇవ్వడం ప్రారంభించింది. అలా వైయస్సార్ కాంగ్రెస్ ప్రభుత్వం ఆ మొత్తాన్ని పదివేల రూపాయలకు పెంచింది. అయితే తాము అధికారంలోకి వస్తే సాయాన్ని రెట్టింపు చేస్తామని చంద్రబాబు హామీ ఇచ్చారు. అందుకు తగ్గట్టుగానే ఇప్పుడు సాయం అందించేందుకు సిద్ధపడుతున్నారు. మొత్తానికైతే కూటమి ప్రధాన ఎన్నికల హామీ నెరవేర్చినట్లు అవుతోంది.

 

Also Read: అమ్మకానికి విశాఖ.. కేశినేని నాని సంచలనం!

Dharma Raj
Dharma Rajhttps://oktelugu.com/
Dharma Raj is a Senior Journalist who has good experience in reporting and had worked with top Media Organizations. He Contributes articles on AP Politics.
RELATED ARTICLES

Most Popular