spot_img
Homeఆంధ్రప్రదేశ్‌AP Pensions: ఏపీలో భారీగా బోగస్ పింఛన్లు.. ఆ నెల నుంచి కట్!

AP Pensions: ఏపీలో భారీగా బోగస్ పింఛన్లు.. ఆ నెల నుంచి కట్!

AP Pensions: కూటమి ప్రభుత్వం పింఛన్లపై ( social pensions )ఫోకస్ చేసింది. ప్రభుత్వం 14 రకాల సామాజిక పింఛన్లు అందిస్తున్న సంగతి తెలిసిందే. తాము అధికారంలోకి వస్తే 3000 రూపాయల పింఛన్ మొత్తాన్ని నాలుగు వేల రూపాయలకు పెంచుతామని చంద్రబాబు హామీ ఇచ్చిన సంగతి తెలిసిందే. ఆ హామీ మేరకు అధికారంలోకి వచ్చిన వెంటనే పెంచిన మొత్తాన్ని అందించారు. మూడు నెలల బకాయి తో పాటు చెల్లించారు. మరోవైపు కొత్త పింఛన్ల జారీకి సంబంధించి ప్రక్రియ ప్రారంభించారు. అయితే ఇప్పటికే అందిస్తున్న పింఛన్లలో భారీగా బోగస్ ఉన్నట్లు గుర్తించారు. ముఖ్యంగా వికలాంగుల పింఛన్లకు సంబంధించి చాలా రకాల అనుమానాలు ఉన్నాయి. తప్పుడు ధ్రువీకరణ పత్రాలతో వికలాంగ పింఛన్లు పొందారు అన్నది ప్రధాన ఆరోపణ. దానిపై ఫోకస్ పెట్టింది కూటమి ప్రభుత్వం. బోగస్ పింఛన్లు తొలగించి కొత్త వాటిని అందించేందుకు కసరత్తు చేస్తోంది.

రాష్ట్రవ్యాప్తంగా 18 లక్షల కు సంబంధించి దివ్యాంగ పింఛన్లు( physically handicapped pensions ) ఉన్నట్లు గణాంకాలు చెబుతున్నాయి. అయితే ఇందులో చాలామంది తప్పుడు వైకల్య ధ్రువపత్రాలు పెట్టి పింఛన్లు పొందుతున్నారన్నది ప్రధాన ఆరోపణ. దీనిపై పెద్ద ఎత్తున ఫిర్యాదులు కూడా వచ్చాయి. దీంతో విచారణ చేపట్టేందుకు ప్రభుత్వం నిర్ణయించింది. అందులో భాగంగా ప్రయోగాత్మకంగా కొన్ని సచివాలయాల పరిధిలో తనిఖీలు చేపట్టింది. దివ్యాంగ పింఛన్లలో భారీగా బోగస్ ఉన్నట్లు తనిఖీల్లో తేలింది. అందుకే ఇప్పుడు రాష్ట్రవ్యాప్తంగా దివ్యాంగ పింఛన్లకు సంబంధించి తనిఖీ జరుగుతోంది. బోగస్ అని తేలితే వెనువెంటనే తొలగించేందుకు ప్రభుత్వం చర్యలు చేపడుతోంది. ప్రస్తుతం తనిఖీలు జరుగుతుండడంతో బోగస్ లబ్ధిదారుల్లో ఒక రకమైన ఆందోళన కనిపిస్తోంది.

* మూడు విభాగాలుగా
సాధారణంగా దివ్యాంగ పింఛన్లకు సంబంధించి.. మూడు విభాగాలుగా విభజించారు. దీర్ఘకాలిక రోగాలతో( long diseases ) బాధపడుతూ మంచానికి పరిమితమైన వారికి ప్రభుత్వం 15000 రూపాయలు కింద పింఛన్ మొత్తాన్ని అందిస్తోంది. ప్రస్తుతం వీరిని ముగ్గురు వైద్యులతో కూడిన బృందం పరిశీలిస్తోంది. అక్కడికక్కడే వారి ఆరోగ్య వివరాలను నమోదు చేసే ప్రక్రియ సైతం కొనసాగుతోంది. అయితే చాలామంది అర్హత లేని వారికి సైతం 15 వేల రూపాయల చొప్పున పింఛన్ అందుతున్నట్లు గుర్తిస్తున్నారు. ఇంకోవైపు తీవ్ర వైకల్యంతో బాధపడుతున్న వారికి పదివేల రూపాయలు చొప్పున అందిస్తున్నారు. దీనిలో ఎక్కువ మంది అనర్హులు ఉన్నట్లు తాజాగా చేస్తున్న తనిఖీల్లో బయటపడుతోంది.

* కొనసాగుతున్న వైద్య పరీక్షలు
ఇంకోవైపు వైకల్యంతో బాధపడుతున్న సాధారణ మనుషులకు 6000 రూపాయలు చొప్పున పింఛన్ అందిస్తున్నారు. అయితే ఇందులో సైతం ఎక్కువమంది బోగస్ ఉన్నట్లు తెలుస్తోంది. వీరందరికీ సమీప ప్రభుత్వ ఆసుపత్రికి ( government hospitals)తీసుకెళ్లి వైకల్య నిర్ధారణ పరీక్షలు చేస్తున్నారు. గతం మాదిరిగా గుంప గుత్తిగా కాకుండా.. నిర్దిష్టమైన కొంతమందికి ముందుగానే సమాచారం ఇస్తున్నారు. వారిని ఆసుపత్రులకు తీసుకెళ్లి వైద్య పరీక్షలు చేస్తున్నారు. అయితే వీరిలో సైతం భారీగా బోగస్ లబ్ధిదారులు ఉన్నట్లు తెలుస్తోంది. ఇదే విషయాన్ని ప్రత్యేక నమోదు ప్రక్రియ ద్వారా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తున్నారు.

* మరో రెండు నెలల పాటు సర్వే
అయితే పింఛన్ల తనిఖీ( pensions survey ) ప్రక్రియ మరో రెండు నెలల పాటు కొనసాగే అవకాశం ఉంది. అప్పటివరకు కొత్త పింఛన్లకు సంబంధించి జారీ ఉండకపోవచ్చు. బహుశా మార్చి నెలలో భారీగా ఉన్న ఈ బోగస్ పింఛన్ల తొలగింపు చేపట్టవచ్చు. ఇందుకు సంబంధించి అనర్హుల జాబితా కూడా ప్రకటించేందుకు ప్రభుత్వం కసరత్తు చేస్తున్నట్లు తెలుస్తోంది. 18 లక్షల వరకు ఉన్న ఈ పింఛన్లలో సగానికి సగం బోగస్ అని ప్రచారం జరుగుతోంది. మరి ఈ తొలగింపు జాబితాలో ఎంతమంది ఉంటారో తెలియాలి.

Dharma Raj
Dharma Rajhttps://oktelugu.com/
Dharma Raj is a Senior Journalist who has good experience in reporting and had worked with top Media Organizations. He Contributes articles on AP Politics.

Most Popular

Azim Premji : జీవితానికి సంబధించి అజీమ్ ప్రేమ్ జీ చెప్పిన 5 సూత్రాలివే..

Azim Premji : భారతదేశ ప్రముఖ పారిశ్రామికవేత్త అజీమ్ ప్రేమ్‌జీ వ్యాపార రంగంలో ఎన్నో విజయాలు సాధించారు. ఆయన ధనవంతుడైనప్పటికీ సాదాసీదా జీవనశైలి, క్రమశిక్షణకు ఎంతో ప్రాధాన్యత ఇస్తారు. యువతకు, వ్యాపారవేత్తలకు స్ఫూర్తినిచ్చేలా...

Yasho Sagar : రాత్రికి రాత్రే స్టార్‌డమ్.. ‘ఉల్లాసంగా ఉత్సాహంగా’ హీరో విషాదాంతం.. ఇప్పటికీ మిస్టరీయేనా?

Yasho Sagar : ఒక హీరో కి అయినా , హీరోయిన్ కి అయినా కేవలం ఒకటి రెండు సినిమాలతో కలలో కూడా ఊహించని గుర్తింపు దక్కడం అనేది ఒక అదృష్టం. పదుల...

Jana Nayagan collections : 2వ రోజు దారుణంగా పడిపోయిన ‘జన నాయగన్ ‘ వసూళ్లు.. ఎంత గ్రాస్...

Jana Nayagan collections : తమిళనాడు ముఖ్యమంత్రి విజయ్ నటించిన లేటెస్ట్ చిత్రం 'జన నాయగన్ ' నిన్న ప్రపంచవ్యాప్తంగా భారీ అంచనాల నడుమ విడుదలైంది. 'భగవంత్' కేసరి కి రీమేక్ గా...

Infosys : ఏఐ విజృంభిస్తున్న వేళ.. ఇన్ఫోసిస్ కీలక నిర్ణయం.. ఇకపై జరిగేది అదే

Infosys : టెక్నాలజీలో రోజురోజుకు కొత్త కొత్త మార్పులు వస్తున్నాయి. నిన్న ఉన్న టెక్నాలజీ నేటికీ పాతగా మారిపోతుంది. నేడు ఉన్న టెక్నాలజీ రేపటికి మరుగున పడిపోతోంది. అందువల్లే టెక్నాలజీ యుగంలో ఎప్పుడు...

Jantar Mantar : జంతర్ మంతర్ వద్ద రామనామం.. ఇది అసలు ఊహించలేదుగా..

Jantar Mantar : సాధారణంగా రాముడి నామం మీద పేటెంట్ రైట్స్ మొత్తం బిజెపికి ఉంటాయి. ఎందుకంటే ఆ పార్టీ రాముడి నామం జపించడంలో ఏమాత్రం వెనుకాడదు. పైగా ఆ పార్టీకి సెక్యులర్...
Oktelugu Epaper
Exit mobile version